Crime News: ఓ వీడియోలో గంజాయి సేవిస్తున్న దృశ్యాలు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా సత్తుపల్లి(Sathupally) మండల ప్రాంతంలో ఈ ఘటనలు చోటు చేసుకున్నట్లుగా సమాచారం. కోవిడ్ 19 సమయం నుంచి పట్టణాల సంస్కృతి పల్లె ప్రాంతాలకు చేరిపోయింది. ఉన్నత విద్య అభ్యసించిన యువత అందరూ కోవిడ్ సమయంలో గ్రామాలకు చేరుకోవడం వారికున్న వ్యసనాలను గ్రామాలలో చిరు ప్రాయంలోనే ఉన్నవారికి అలవర్చడం జరిగిపోయింది. అప్పటినుంచి గ్రామాల్లో గంజాయి కల్చర్ నిత్య కృత్యంగా మారిపోయింది.
పోలీసులు నిఘా..
పోలీసులు గంజాయి వ్యాపారం, విక్రయాలు, సేవింపులపై పూర్తి నిఘా పెట్టినప్పటికీ గంజాయి అరికట్టడంలో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు. పోలీసుల కళ్ళు కప్పి అక్రమ గంజాయి వ్యాపారులు పోలీసులకే సవాల్ గా మారిపోయారు. ఓవైపు డ్రగ్స్ తో యువత భవిష్యత్తు నాశనమవుతుందని నేపథ్యంలో ఆపరేషన్ చైతన్యం పేరిట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు విశేషంగా తనిఖీలు నిర్వహిస్తూ అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు. అయినప్పటికీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంగా ఉండడంతో ఒడిశా(Odisha), చత్తీస్గడ్ రాష్ట్రాల మీదుగా వేరువేరు మార్గాల్లో అక్రమార్కులు గాంజాను సత్తుపల్లి కి సరఫరా చేస్తున్నారు. దీంతో విలాసాలకు అలవాటు పడిన కొందరు యువత గాంజాను పొట్లాలుగా చేసి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గాంజాను సేవిస్తూ యువత మత్తులో విహరించి పోతున్నారు.
Also Read: School Holidays: మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. స్కూళ్లకు మూడురోజులు సెలవులు
వీడియోలు చిత్రీకరించి..
ఈ నేపథ్యంలోనే కొందరు యువకులు గాంజాను సేవించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ క్రమంలో కొందరు యువకులు గాంజాను సేవిస్తున్న వీడియోలను చిత్రీకరించి తమ వాట్సాప్ స్టేటస్ లలో పోస్టులు చేస్తున్నారు. ఓ వీడియోలు ఆ యువకుడు గాంజా సేవిస్తున్న విధానం చూస్తే సత్తుపల్లి ప్రాంతంలో గాంజా ప్రభావం ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో భద్రాద్రి కొత్తగూడెం లోనే రాష్ట్రంలో ఎక్కడ పట్టుబడనంతగా పోలీసులకు గాంజా లభ్యమయింది.
Also Read: Wines Lucky Draw: అరచేతిలో అదృష్ట లక్ష్మీ.. ఒకే ఇంట్లో ఇద్దరికి లక్కీ కిక్కు..?
