Hydra ( image credit: twitter)
హైదరాబాద్

Hydra: పార్కుల రక్షణకు హైడ్రా మాస్టర్ ప్లాన్.. ఆకమణలు కబ్డాలపై ఫోకస్!

Hydra: గ్రేటర్ హైదరాబాద్ లోని మూడు కమిష్నరేట్ల పరిధిలోని సర్కారు ఆస్తులైన చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములు, లేఅవుట్లలోని రోడ్లను కాపాడుతూ మంచి ఫలితాలు సాధిస్తున్న హైడ్రా ఇపుడు తాజాగా పార్కులపై దృష్టి సారించింది. ముఖ్యంగా హైడ్రా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో పార్కులను ఆక్రమించినట్లు, కబ్జా చేసినట్లు తరుచూ ఫిర్యాదులు వస్తుండటంతో హైడ్రా ఈ అంశంపై ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు సమాచారం. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న పార్కులపై హైడ్రా ఫోకస్ చేసింది.

Also Read:Hydraa: 435 ఏళ్ల‌ చ‌రిత్ర కలిగిన పాత‌బ‌స్తీలోని చెరువుకు హైడ్రా పున‌రుద్ధ‌ర‌ణ‌ 

ప్రభుత్వానికి చెందిన పార్కులెన్ని?

నగరంలోని ప్రభుత్వ ఆస్తులు, పార్కులు, సరస్సులు, నాలాల ఆక్రమణలను తొలగించి భూములను కాపాడటమేహైడ్రా ప్రధాన లక్ష్యంగా ఏర్పడిన హైడ్రా ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో భూములను పరిరక్షించి, వేల కోట్ల రూపాయల విలువైన సర్కారు ఆస్తులను కబ్జా చెర నుంచి విడిపించి మన్ననలు పొందుతుంది. ఇప్పటికే చెరువులు, నాలాల, పార్కు స్థలాలను కాపాడి పనిలో బిజీగా ఉన్న హైడ్రా ఇప్పుడు ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న పార్కులన్నీ? వాటి విస్తీర్ణం ఎంత? గతంలో ఎంత మేరకు విస్తీర్ణం ఉండేవి? ఇపుడెంత విస్తీర్ణంలో ఉన్నాయన్న విషయంపై ఫోకస్ చేసినట్లు సమాచారం. అసలు ఎన్ని పార్కులు ఉన్నాయి? ఇందులో ప్రభుత్వానికి చెందిన పార్కులెన్ని? ప్రైవేటు వెంటర్లలో కేటాయించిన పార్కలెన్నీ అనే లెక్క తేల్చేందుకు హైడ్రా సిద్దమైనట్లు సమాచారం.

కమిషనర్ ఏవీ రంగనాథ్ వ్యూహాన్ని సిద్దం

అలాగే గతంలో పార్కుల విస్తీర్ణం ఎంత ఉండేది, ప్రస్తుతం ఎంత ఉందనే వివరాలను సేకరించనున్నారు. ఎక్కడైనా పార్కులు కబ్జాకు, ఆక్రమణలకు గురైతే, వాటిని గుర్తించి కాపాడేందుకు చర్యలు తీసుకునేందుకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వ్యూహాన్ని సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ఇందు కోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) ద్వారా శాటిలైట్ మ్యాప్స్ ద్వారా విస్తీర్ణం, జరిగిన ఆక్రమణలను టెక్నికల్ గా గుర్తించి అవసరమైతే బాధ్యులపై లీగల్ గా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చునన్న విషయంపై కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజు రోజు వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ కారణంగా పెరుగుతున్న కాలుష్యానికి చెక్ పెట్టే సంఖ్యలో పార్కులు లేవన్న విషయాన్ని గుర్తించిన హైడ్రా ఇప్పటికైనా పార్కులను గుర్తించే చర్యలు చేపట్టకపోతే ఇపుడు అంతంత మాత్రం సంఖ్యలో ఉన్న పార్కులు కూడా మున్ముందు కనుమరుగయ్యే అవకాశముందన్న విషయాన్ని కూడా హైడ్రా గుర్తించినట్లు సమాచారం.

ఆక్రమణల ఫిర్యాదులెక్కువ రావటంతో

హైడ్రా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో పార్కుల ఆక్రమణలు, కబ్జాలకు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కవ వస్తుండటాన్ని గుర్తించిన హైడ్రా పార్కుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రధానంగా లేఅవుట్లలో పార్కులకు స్థలాలను కేటాయించి, ఆ తర్వాత పార్కు స్థలాన్ని కూడా చిన్న చిన్న ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులు కూడా హైడ్రా దృష్టికి వచ్చినట్లు తెలిసింది. లేఅవుట్లు వేసే సమయంలో మ్యాప్ లో పార్కు స్థలాలను చూపించి, ప్లాటు కొనుగోలుదారులను ఆకట్టుకుని, చివరకు దాన్ని కూడా విక్రయించిన విషయం చాలా లేటుగా బయట పడుతున్నట్లు హైడ్రా గుర్తించింది.

మరి కొందరు వెంచర్లలో పార్కులకు స్థలాలను కేటాయించి, అక్కడ ప్లాట్లలో ఇండ్ల నిర్మాణాలు పూర్తయిన తర్వాత పార్కులను డెవలప్ చేయకుండా వదిలేయటంతో, వాటిని ప్రైవేటు వ్యక్తులు కబ్జాలు చేస్తున్నట్లు కూడా ఫిర్యాదులు హైడ్రాకు వచ్చాయి. ఇక కాలనీల్లో కొంచెం పేరున్న నేతలు పార్కుల స్థలాలను దర్జాగా కబ్జాలు చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఓఆర్ఆర్ పరిధిలో పార్కులపై ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. ఈ ఆక్రమణల విషయంలో పేదలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని హైడ్రా భావిస్తున్నట్లు తెలిసింది.

హైడ్రా పరిధిలో దాదాపు 1650 పార్కులు?

హైడ్రా పరిధిలో దాదాపు 1650 పార్కులున్నట్లు అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే 1085 పార్కులు, ఇందులో 19 మేజర్ పార్కులు 17 థీమ్ పార్కులు కాగ, మిగతావి కాలనీల్లో పార్కులు ఉన్నాయి. ఇలా శివారు మున్సిపాలిటీల్లో అన్ని కలిపితే దాదాపు 1650 వరకు ఉండవచ్చునని హైడ్రా అధికారులు భావిస్తున్నారు. అయితే వీటిని 1970 సర్వే ఆఫ్ ఇండియా టోపో గ్రాఫిక్ షీట్లు, రెవెన్యూ రికార్డులు, పాత శాటిలైట్ మ్యాప్ తో కూడా పోల్చి చూసి, పార్కుల అసలు విస్తీర్ణం ఎంత, ఆ తర్వాత ఎలాంటి మార్పులు జరిగాయన్న విషయాన్ని గుర్తించనున్నారు. ఈ విధంగా పార్కులను గుర్తించి సంరక్షించడంతో పాటు మళ్లీ పార్కులను ఆక్రమిస్తే ఎదురయ్యే పరిణామాలు తెలిసేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. పార్కుల స్థలాలను కాపాడి వెంటనే పెన్సింగ్ వేయడంతో పాటు వాటిని ప్రజల అవసరాలకు తగిన విధంగా అభివృద్ది చేసి, మళ్లీ ఆక్రమణకు గురి కాకుండా నిరంతర నిఘా ఏర్పాటు చేసేలా హైడ్రా ప్రణాళికలను సిద్దం చేస్తున్నట్లు సమాచారం.

Also Read: Hydra: జ‌ర్న‌లిస్టులకు కేటాయించిన‌ 38 ఎక‌రాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా!

Just In

01

Cyclone Montha: రాష్ట్రంలో వర్ష బీభత్సం.. డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ హిస్టరీలోనే తొలిసారి.. ప్రేక్షకులను భలే బురిడీ కొట్టిస్తున్నారుగా?

Seethakka: మైనార్టీలను మోసం చేసింది బీఆర్‌ఎస్‌.. మంత్రి సీతక్క కౌంటర్!

Bigg Boss Telugu 9 Re Enter: బిగ్ బాస్‌లో సంచలనం.. పర్మినెంట్ హౌస్‌మేట్‌గా భరణి? మరి శ్రీజ పరిస్థితేంటి?

Bhatti Vikramarka: జీసీసీలకు క్యాపిటల్ హైదరాబాద్.. సమానత్వంతో కూడిన వృద్ధి లక్ష్యం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క