Suryapet Govt Hospital: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని ఉద్యోగుల జేఏసీ నాయకులు అన్నారు. జిల్లా జనరల్ ఆసుపత్రి వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు.జనరల్ ఆసుపత్రిలో (Suryapet Govt Hospital )పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, డ్రైవర్లు మొదలగు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలని అన్నారు.గత ఐదు నెలల నుంచి సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న 126 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు రావడం లేదని, కాబట్టి పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
Also Read: POWERGRID Recruitment 2025: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో భారీ ఉద్యోగాలు..
కలెక్టర్ ను పలుమాలు కలిసి వినతిపత్రం
గత ఐదు నెలల నుండి వేతనాలు రాకపోవడం వల్ల ఇంటి కిరాయి కట్టలేక, పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టలేక, కిరాణా సరుకులు కొనలేక అవస్థలు పడుతున్నామని అన్నారు. ప్రభుత్వం వెంటనే జనరల్ ఆస్పత్రిలో కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీని నియమించాలని,తమ సమస్యలపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ ను పలుమాలు కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగిందని కాబట్టి జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రావాల్సిన వేతనాలు విడుదల చేయాలని తెలిపారు. జేఏసీ నాయకులు అశోక్ కుమార్ ను ఈరోజు ఉదయం అరెస్ట్ చేశారని వెంటనే విడుదల చేయాలని.సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రామారావు,నర్సిరెడ్డి, నాగయ్య, సాగర్, విజయ్, సాయి, రమాకాంత్, క్రాంతి, సతీష్, అనిల్, నవీన్, సందీప్, జానకి రాములు, భరత్, వీరేష్ ,మధు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Mirai Music Director: ‘మిరాయ్’లో రాములవారి పోర్షన్ చేయడానికి ఎంత టైమ్ పట్టిందంటే..
గూడు కాలింది.. గుండె కదిలింది
ఆయన రోజువారి కూలి పనులు చేసుకుంటూ ఉన్న గుడిసెలో కాలం వెల్లదీస్తున్నాడు. ఈ క్రమంలోనే అనుకోని ఘటన జరిగి తను ఉంటున్న గూడు కాలిపోయింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆయన మండలంలోని అధికారులను కలిశాడు. తనకు ఇంటిని ఇవ్వాలని వేడుకున్నాడు. ఆయన అనుకున్న విధంగా అధికారుల నుంచి సరైన సమాధానం, హామీ లభించకపోవడంతో ఆయన గుండె కదిలింది. వివరాల్లోకి వెళితే..
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం చిన్నమండవ గ్రామానికి చెందిన గురవయ్య అనే వ్యక్తి తన ఇల్లు కాలిపోయిందని, ఆర్థిక సహాయం చేయాలని కోరుతూ 30 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కి ఫిర్యాదు అందజేశారు. ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో గురవయ్య పూరి గుడిసె పూర్తిగా కాలిపోయింది. కట్టుబట్టలు తప్ప ఏమీ మిగల్లేదని, ప్రయాణానికి కూడా డబ్బులు లేకపోవడంతో సైకిల్పై కలెక్టరేట్కు వచ్చానని, ప్రభుత్వమే తనను ఆదుకోవాలని ఆయన తన గోడు వెళ్లబోసుకున్నాడు.
Also Read: Aarogyasri: వంద కోట్లు ఇచ్చిన సమ్మె నోటీసు.. ప్రైవేట్ ఆసుపత్రులపై ప్రభుత్వం సీరియస్..?
