Prabhas Charity: పాన్ ఇండియా రెబల్ స్టార్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.. ఎందుకంటే.. ఆయన స్టార్ పవర్ కన్నా ఆయన వ్యక్తిత్వానికే ఎక్కువ వెయిట్ ఉంటుంది. ఎందుకంటే ఆయనతో పని చేసిన ప్రతి ఒక్కరూ చెప్పేది ఇదే. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్థాయిలో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ దానం చేయడంలో కూడా తాను రాజే అంటూ మరొక్క సారి నిరూపించుకున్నారు. తాజాగా రాజీవ్ కనకాలతో ఇచ్చిన ఓ ఇంటర్వూలో ఆయన ప్రభాస్ గురించి చెబుతూ ఒక్క సారిగా ఆయన గొప్పతనాన్ని కొనియాడారు. ప్రభాస్ గురించి రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. బాహుబలి టైంలో ఖమ్మంలోని ఒక చోట ఓల్డేజ్ హోమ్ కట్టించాము.. దానికి రాజమౌళి, రమ, నేను ఇలా కొంత మంది కలిసి అది కట్టించాము. మేము అక్కడితో ఆపేశాము.. కానీ ప్రభాస్ ఇప్పటికీ ప్రతి నెలా వారికి డబ్బు పంపిస్తున్నారు. అది ఆయన గొప్పతనం ప్రభాస్ కి సలాం అంటూ చెప్పుకొచ్చారు. దీనిని చూసి ప్రభాస్ ఫ్యాన్ ఒక మంచి వ్యక్తికి ఫ్యాన్స్ అయ్యా మంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read also-Chinmayi Shivaji: నటుడు శివాజీ వ్యాఖ్యలపై గాయని చిన్మయి ఆగ్రహం.. ‘ఆ నీతి సూత్రాలు మాకెందుకు?’
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ హారర్ కామెడీ చిత్రం “ది రాజాసాబ్” (The Raja Saab). ‘మారుతి’ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు మంచి వ్యూస్ సాధించాయి. ప్రభాస్ ఇప్పటివరకు చేసిన యాక్షన్ సినిమాలకు భిన్నంగా, పూర్తిస్థాయి వినోదం మరియు హారర్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రభాస్ వింటేజ్ లుక్‌లో కనిపిస్తుండటం అభిమానులకు పెద్ద పండుగలా మారింది.
Read also-Madhuri Struggles: కెరీర్ ప్రారంభంలో అలాంటివి చాలా ఎదుర్కొన్నా.. మాధురీ దీక్షిత్
ఇటీవల విడుదలైన గ్లింప్స్ (Glimpse) లో ప్రభాస్ చాలా స్టైలిష్‌గా, కలర్‌ఫుల్ లుక్‌లో కనిపించారు. ఇది ప్రభాస్ పాత సినిమాల్లోని క్యూట్ అండ్ మాస్ మేనరిజమ్స్‌ని గుర్తు చేస్తోంది. మారుతి తన గత చిత్రాలైన ‘ప్రేమకథా చిత్రమ్’ తరహాలో భయాన్ని, నవ్వుని మేళవించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇదొక పాన్ ఇండియా సినిమా కావడంతో, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా హారర్ సీక్వెన్స్‌లు చాలా గ్రాండ్‌గా ఉంటాయని సమాచారం. జనవరి 9, 2026న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Build an old-age home in Khammam with the help of Prabhas, Rajamouli, Rama, and Valli.
The great thing about #Prabhas is that he has been donating a sum of money every month till now..~ Rajeev Kanakala pic.twitter.com/2I0Ye8h9d6
— Vaishnu (@VaishnaliS) December 22, 2025

