Chinmayi Shivaji: శివాజీ వ్యాఖ్యలపై గాయని చిన్మయి ఆగ్రహం..
shivaji,-chinmai(X)
ఎంటర్‌టైన్‌మెంట్

Chinmayi Shivaji: నటుడు శివాజీ వ్యాఖ్యలపై గాయని చిన్మయి ఆగ్రహం.. ‘ఆ నీతి సూత్రాలు మాకెందుకు?’

Chinmayi Shivaji: నటుడు శివాజీ ఇటీవల ‘దండోరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా మహిళా నటీమణుల వస్త్రధారణపై ఆయన వాడిన పదజాలం, పరోక్షంగా వారిని కించపరిచేలా ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద తనదైన శైలిలో స్పందిస్తూ శివాజీ తీరును తీవ్రంగా ఖండించారు. సినిమా రంగంలో సీనియర్ నటుడిగా గుర్తింపు పొందిన శివాజీ, ఇటీవల ఒక వేదికపై మాట్లాడుతూ నటీమణులు చీరలు కట్టుకోవాలని, శరీరాన్ని కప్పి ఉంచుకోవాలని చెబుతూ కొన్ని అసభ్యకర పదజాలాన్ని ఉపయోగించడం పట్ల చిన్మయి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వృత్తిపరమైన వేదికలపై ఇలాంటి పదజాలం వాడటం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు.

Read also-Chiranjeevi Mohanlal: మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం కోలీవుడ్ సూపర్ స్టార్.. ఇక ఫ్యాన్స్‌కు పండగే?

ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు?

శివాజీ వ్యాఖ్యల్లోని ద్వంద్వ ప్రమాణాలను చిన్మయి ఎండగట్టారు. “శివాజీ గారు స్వయంగా జీన్స్, హుడీలు ధరిస్తూ ఆధునిక జీవనశైలిని అనుసరిస్తారు. మరి మహిళలకు మాత్రం భారతీయ సంస్కృతి గురించి పాఠాలు చెప్పడం ఏంటి? సంస్కృతి పట్ల అంత పట్టింపు ఉంటే, ఆయన కూడా కేవలం ధోవతులు ధరించి, నుదుట బొట్టు పెట్టుకుని, వివాహితుడన్న గుర్తింపుగా కంకణాలు, మెట్టెలు ధరించి తిరగాలి కదా!” అని ఆమె ఘాటుగా విమర్శించారు. ఒకరు ఏం ధరించాలి అనేది వారి వ్యక్తిగత స్వేచ్ఛ అని, వృత్తిపరమైన ప్రదేశాల్లో ఇలాంటి ‘బాడీ షేమింగ్’ వ్యాఖ్యలు చేయడం గర్హనీయమని ఆమె పేర్కొన్నారు.

Read also-Emmanuel: ఇమ్మానుయేల్‌కు ఇంత అన్యాయమా? ఏంటిది బిగ్ బాస్?

‘ఇన్సెల్’ మనస్తత్వానికి మద్దతుగా..

శివాజీ వాడిన కొన్ని పదాలు మహిళలపై ద్వేషాన్ని పెంచేలా ఉన్నాయని, ముఖ్యంగా సోషల్ మీడియాలో మహిళలను వేధించే ‘ఇన్సెల్’ గ్రూపులకు ఇవి ఊతమిచ్చేలా ఉన్నాయని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాలో విలన్‌గా నటించిన వారు నిజ జీవితంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలతో ఇతరులను ఇబ్బంది పెట్టడం దురదృష్టకరమని ఆమె అభిప్రాయపడ్డారు. “పబ్లిక్ ఫ్లాట్‌ఫామ్స్ మీద ఇంత బహిరంగంగా మహిళలను ఉద్దేశించి అసభ్య పదజాలం వాడుతుంటే, ఇక అమ్మాయిలకు ఇక్కడ భద్రత ఎక్కడ ఉంటుంది?” అని చిన్మయి ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలను సమర్థించే మగవారి ఆలోచనా విధానాన్ని కూడా ఆమె తప్పుబట్టారు. సమాజంలో మార్పు రావాలని కోరుకునే వ్యక్తులు మొదట తమ ప్రసంగాల్లో సంయమనం పాటించాలని, ఎదుటివారి గౌరవానికి భంగం కలగకుండా మాట్లాడటం నేర్చుకోవాలని ఈ వివాదం ద్వారా మరోసారి స్పష్టమవుతోంది.

Just In

01

Crime News: ఆర్టీసీ సిబ్బందిని టార్గెట్ చేస్తున్న మోస్ట్ వాంటెడ్​ క్రిమినల్ అరెస్ట్..!

Tanuja Interview: దానికోసం ఎప్పుడూ పనిచేయలేదు.. బిగ్‌బాస్ రన్నర్ తనూజ..

Gold Rates: మహిళలకు షాకింగ్ న్యూస్.. అతి భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్!

BJP Telangana: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ హైకోర్టులో పిటిషన్..!

Vivo Smartphones 2026: 2026లో వివో ప్రభంజనం.. మార్కెట్‌లోకి రాబోతున్న.. టాప్ మెుబైల్స్ ఇవే!