Emmanuel: బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss Season 9) ముగిసింది. ఏటోళ్లు అటు వెళ్లిపోయారు. విన్నర్ కళ్యాణ్ పడాల, రన్నరప్ తనూజ, థర్డ్ ప్లేస్‌లో ఉన్న డిమోన్ పవన్ అంతా తమ ఫ్యామిలీలతో గడిపేందుకు వెళ్లిపోయారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం రచ్చ జరుగుతూనే ఉంది. ఏంటా రచ్చ అని అనుకుంటున్నారా? ఇంకేం రచ్చ.. బిగ్ బాస్ రచ్చే. సీజన్ 9 అయిపోయి, నాగార్జున (King Nagarjuna) కూడా హమ్మయ్య రేపటి నుంచి క్లాస్‌లు ఇవ్వడాలే లేదులే అని హాయిగా ఊపిరి పీల్చుకుంటూ ఉంటారు. కానీ, సోషల్ మీడియాలో ఈ సీజన్ విన్నర్ విషయంలో కాకుండా, రన్నర్ లేదంటే, మూడో స్థానం కల్పించిన వారిని ఉద్దేశించి బిగ్ బాస్‌పై అంతా ఫైర్ అవుతున్నారు. అవును, మొదటి నుంచి కళ్యాణ్ పడాల విన్నర్ అనేలానే టాక్ నడిచింది. ముఖ్యంగా ఆయన నెంబర్ వన్ ఫైనలిస్ట్ అయినప్పటి నుంచే, విన్నర్ కూడా కళ్యాణే అని అంతా టామ్ టామ్ అవుతూ వస్తుంది. ఆ రేంజ్లో పీఆర్ని కళ్యాణ్ అండ్ టీమ్ నడిపారు.
Also Read- Bigg Boss House: గ్రాండ్ ఫినాలే అనంతరం.. బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో చూశారా? వీడియో వైరల్!
మూడో స్థానమైనా ఇవ్వాలి కదా!
ఎందుకంటే, నెంబర్ వన్ ఫైనలిస్ట్ అయిన తర్వాత హౌస్‌లో కళ్యాణ్ చేసింది ఏమీ లేదు. చూస్తూ ఉండటమే. కనీసం ఓటింగ్ అడగడానికి కూడా ఛాన్స్ రాలేదు. కానీ, ఇమ్మానుయేల్ (Emmanuel), తనూజ (Thanuja) చాలా వరకు కష్టపడ్డారు. ఇక్కడ తనూజ అంటే మళ్లీ కళ్యాణ్ పేరే వినబడుతుంది కాబట్టి, ఆమెను పక్కన పెడితే.. ఇమ్మానుయేల్ లేనిదే ఈ సీజనే లేదు. ఎవరు నమ్మినా, నమ్మకపోయినా ఇదే నిజం. ఇమ్మానుయేల్ 10 వారాల పాటు నామినేషన్‌కే రాలేదు అంటే, హౌస్‌లో అతని గేమ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. టాస్క్‌లు, కామెడీ, వంట ఒక్కటేమిటి? ప్రతీది 100 పర్సంట్ ఇచ్చాడు ఇమ్మానుయేల్. మరెందుకు విన్నర్ కాకపోయినా, కనీసం రన్నర్‌గా కూడా ఆయనకు ఛాన్స్ ఇవ్వలేదు. సరే రన్నరప్ కూడా పక్కన పెట్టేద్దాం.. మూడో స్థానమైనా అతనికి ఇవ్వాలి కదా! మరీ నాలుగో స్థానం అంటే.. బిగ్ బాస్‌పైన చాలా మందికి నమ్మకమే పోయింది.
ఇమ్మానుయేల్‌కి అన్యాయం
అనవసరంగా ఈ సీజన్ చూశాం. ఇలా జరుగుతుంది అనుకుంటే అసలు చూసేవాళ్లమే కాదు అనేలా నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారంటే, ఇమ్మానుయేల్‌కి బిగ్ బాస్ ఎంత అన్యాయం చేశాడో అర్థం చేసుకోవచ్చు. రీతూ, పవన్‌ల మధ్య బాండింగ్ ఈ షోకు టాప్ రేటింగ్ రావడానికి కారణమని బిగ్ బాస్ అనుకుని ఉండొచ్చు. అసలు ఆ తలకాయ నొప్పి ఎప్పుడు పోతుందా? అని అనుకున్నవాళ్లే ఎక్కువ. ఇక తనూజ గురించి సరేసరి. ఎప్పుడూ నోరేసుకుని, మొత్తం అంతా తనపైనే ఫోకస్ పడేలా చాలా సేఫ్ గేమ్ ఆడటంలో ఆమె సక్సెస్ అయింది. అందుకే ఆమెకు టాప్ 2ని ఇచ్చి.. ఒట్టి చేత్తో పంపించారు. ఆఫ్కోర్స్ ఆమె స్వయంకృతాపరాధం కూడా ఉందనుకోండి. నేనే విన్నర్ అవుతానని ఓవర్ కాన్ఫిడెన్స్‌కు పోయి, నాగ్ ఇచ్చిన ఆఫర్‌ని వదులుకుంది. టాప్ 2 సంగతి పక్కన పెడితే, పవన్ ప్లేస్‌లో ఇమ్మానుయేల్ ఆ సిల్వర్ సూట్‌కేస్ తీసుకున్నా, అంతగా హర్ట్ అయ్యేవారు కాదేమో!
Also Read- Rowdy Janardhana: ‘రౌడీ జనార్ధన’ టైటిల్ గ్లింప్స్.. బాబోయ్ అరాచకమే!
కమెడియన్స్ అలెర్ట్..
ఇలాగే జరిగితే ఈసారి సీజన్‌కు కమెడియన్ అనేవాడు రావడానికి కూడా ఇంట్రస్ట్ చూపించరు. ఓన్లీ హౌస్‌లో కామెడీ చేయడానికే తీసుకొస్తున్నారా? అనే ఫీలింగ్ ఇప్పటికే జనాల్లో వచ్చేసింది. అలాగే క్యాస్ట్ ఫీలింగ్‌పై కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్‌లో విన్నర్ అవ్వాలంటే ఇమ్మానుయేల్ అనే పేరు సరిపోదేమో! అనేలా ఇమ్ము అభిమానులు కొందరు డైరెక్ట్‌గా పోస్ట్‌లు చేస్తుండటం చూస్తుంటే.. ఎంతగా వారు హర్టయ్యారో అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా ఇమ్మానుయేల్ విషయంలో మాత్రం బిగ్ బాస్ అన్యాయమే చేశాడు. ఈ హౌస్‌కి ఇమ్మూ ఇచ్చిన బూస్ట్ అంతా ఇంతా కాదు, అది ఇప్పుడు టాప్ 1,2,3లో నిలిచిన వారి అభిమానులను అడిగినా చెప్తారు. ఇక అయిపోయింది కాబట్టి.. ఎవరూ ఏం చేయలేరు.. కాకపోతే కమెడియన్స్ ఇలాంటి ఆఫర్స్ విషయంలో కాస్త అలెర్ట్‌గా ఉంటే మంచిదనే మెసేజ్ అయితే దీని ద్వారా వెళ్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

