Bigg Boss House: గ్రాండ్ ఫినాలే అనంతరం.. బిగ్ బాస్ హౌస్ ఇలా!
Bigg Boss 9 House (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Bigg Boss House: గ్రాండ్ ఫినాలే అనంతరం.. బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో చూశారా? వీడియో వైరల్!

Bigg Boss House: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) గ్రాండ్‌గా ముగిసిన విషయం తెలిసిందే. 105 రోజుల పాటు ఈ సీజన్ నడిచింది. ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్లు మించి, ఈ సీజన్ సక్సెస్ అయ్యిందని స్వయానా కింగ్ నాగ్ ఫినాలే స్టేజ్‌పై చెప్పారు. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అంటూ సాగిన ఈ షోలో.. ఫైనల్‌గా కామనరే విన్నర్‌గా నిలిచి ట్రోఫీ సొంతం చేసుకున్నాడు. ట్రోఫీతో పాటు రూ. 35 లక్షల క్యాష్ ప్రైజ్, రూ. 5 లక్షల ఓచర్లు సొంతం చేసుకున్నాడు. అంతేకాదు, మారుతి సుజుకీ విక్టోరియా కారును కూడా గెలుపొందాడు. ఇవన్నీ సొంతం చేసుకున్నది ఎవరో తెలుసుగా? కళ్యాణ్ పడాల (Kalyan Padala). రన్నరప్‌గా తనూజ (Thanuja) నిలిచింది. డిమోన్ పవన్ (Demon Pavan) రూ. 15 లక్షల క్యాష్‌తో టాప్ 3 స్థానం సొంతం చేసుకున్నాడు. మొత్తంగా అయితే.. రోజూ వచ్చే ఎపిసోడ్స్ పరంగానూ, అలాగే 24 బై 7 లైవ్‌తోనూ బిగ్ బాస్ హౌస్ ఈసారి చాలా మందికి ఒక ఎమోషన్‌గా మారింది. హౌస్‌లోకి వెళ్లిన వారికే కాదు.. ఆ ఎమోషనల్ బాండింగ్ చూస్తున్నవారికి కూడా కనెక్ట్ అయింది.

Also Read- Nari Nari Naduma Murari: రాజాలా పెంచితే రోజా ముందు.. ‘నారీ నారీ నడుమ మురారి’ టీజర్ ఎలా ఉందంటే?

ఏడుపొస్తుంది బిగ్ బాస్

ఇక బిగ్ బాస్ షో అయిపోయింది అంటే, అప్పుడే అయిపోయిందా? అంటూ డిజప్పాయింట్ అయ్యే వారు కూడా లేకపోలేదు. ఆ స్థాయిలో ఈసారి ఈ షోని కంటెస్టెంట్స్ రక్తి కట్టించారు. అలా బిగ్ బాస్ హౌస్‌ (Bigg Boss House)లోని ప్రతి ప్రదేశం ఆడియెన్స్‌కు నోటెడ్ అయిపోయింది. మరి అలాంటి హౌస్‌‌ని.. గ్రాండ్ ఫినాలే తర్వాత ఏం చేస్తారు? డోర్స్ క్లోజ్ చేసి, నెక్ట్స్ సీజన్ వరకు అలాగే ఉంచుతారా? లేక వేరే కార్యక్రమాలకు ఇస్తారా? అని అంతా అనుకోవడం సహజమే. అలాంటి వారందరికీ సమాధానమిచ్చేలా, తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా బాగా ఎమోషనల్ అవుతున్నారు. ‘ఎంతైనా ఇంట్లో మనుషులు ఉంటేనే అందం కదా’, ‘వామ్మో ఏడుపొస్తుంది బిగ్ బాస్ హౌస్‌ని అలా చూస్తుంటే’.. అనేలా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారంటే.. ఎంతగా ఈ హౌస్, ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.

Also Read- Shambhala: ‘శంబాల’తో నాన్న కోరిక తీరుతుంది- ఆది సాయి కుమార్

మిస్ యు బిగ్ బాస్

ఇక ఈ వీడియోలో ఇప్పటి వరకు ఉన్న హౌస్‌లోని ప్రాపర్టీస్ అన్నింటిని తీసేస్తుండటం గమనించవచ్చు. ఇప్పుడున్న హౌస్‌లోని ప్రాపర్టీని పూర్తిగా తీసేసి, మరో కొత్త థీమ్‌తో డిజైన్ చేసేందుకు ఇప్పటి నుంచే అంతా సిద్ధం చేస్తుంటారు. ఎంతో మంది దీనిలో భాగమవుతారు. ఇంకా చెప్పాలంటే.. ఖైరతాబాద్ గణేష్‌ని ఎలా అయితే రెడీ చేస్తారో.. అలా, సీజన్ పూర్తవ్వగానే హౌస్‌ని మొత్తం మార్చేస్తారు. అదే ప్రాసెస్ నడుస్తోంది. అది ఈ వీడియోలో క్లియర్‌గా తెలుస్తోంది. ఏదిఏమైనా ఈసారి హౌస్‌ని ఆడియెన్స్ తమ సొంత హౌస్‌లా భావించారంటే, అతిశయోక్తి కానే కాదు, అందుకే ఎవ్వరూ లేని ఆ హౌస్‌ని చూసి బాగా ఫీలవుతున్నారు. ‘బిగ్ బాస్ హౌస్‌లో మనుషులు ఉంటేనే ఆనందంగా ఉంటుంది.. వాళ్లు వెళ్లిపోతే అసలు ఆనందంగా లేదు.. బిగ్‌బాస్ హౌస్‌కి సందడే లేదు, వాళ్ళు వెళ్ళిపోయాక ఎన్నో మెమరీస్ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నాయి. ఐ మిస్ యు బిగ్ బాస్’ అంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ బాగా వైరల్ అవుతోంది. మరేందుకు ఆలస్యం మీరు కూడా ఫినాలే అనంతరం బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో చూసేయండి…

">

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Emmanuel: ఇమ్మానుయేల్‌కు ఇంత అన్యాయమా? ఏంటిది బిగ్ బాస్?

Ravi Kiran Kola: విజయ్‌తో ‘రౌడీ జనార్ధన’ ప్రాజెక్ట్ ఎలా ఓకే అయ్యిందంటే?

Bigg Boss House: గ్రాండ్ ఫినాలే అనంతరం.. బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో చూశారా? వీడియో వైరల్!

Ponguleti Srinivas Reddy: భూభారతి పోర్టల్‌తో అనుసంధానం.. ఒక్క క్లిక్‌తో రైతుల‌కు పూర్తి భూస‌మాచారం!

Jupally Krishna Rao: కేసీఆర్‌ కుటుంబ రాజకీయాలే ఆ పార్టీ పతనానికి కారణం : మంత్రి జూపల్లి కృష్ణారావు