Hari Gowra on Mirai
ఎంటర్‌టైన్మెంట్

Mirai Music Director: ‘మిరాయ్’లో రాములవారి పోర్షన్ చేయడానికి ఎంత టైమ్ పట్టిందంటే..

Mirai Music Director: సూపర్ హీరో తేజ సజ్జా నటించిన ‘మిరాయ్‌’ చిత్రం థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న విషయం తెలిసిందే. విడుదలైన అన్ని చోట్లా ఈ సినిమాకు బ్రహ్మాండమైన కలెక్షన్లు వస్తున్నాయి. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్‌ఫుల్ పాత్ర పోషించిన ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటించింది. సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకుని, అద్భుతమైన కలెక్షన్స్‌తో హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సక్సెస్‌ను పురస్కరించుకుని మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర (Hari Gowra) మీడియాకు తన ఆనందంతో పాటు, చిత్ర విశేషాలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ..

Also Read- Dil Raju: ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా దిల్ రాజు సంచలన నిర్ణయం.. ఇక అంతా ఈజీ!

ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌ సినిమా

‘‘హనుమాన్, మిరాయ్ రెండు బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా హిట్స్‌తో చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సక్సెస్ వస్తే.. ఇప్పటి వరకు సినిమా కోసం పడ్డ కష్టమంతా మర్చిపోతాం. మా నిర్మాత, దర్శకుడు, హీరో.. ఇలా టీమ్ అంతా చాలా హ్యాపీగా ఉన్నాం. దర్శకుడు కార్తీక్ చాలా అద్భుతమైన సినిమా తీశారు. ఈ సినిమా కథే నన్ను మ్యూజిక్ ఇవ్వడానికి ఇన్‌స్పైర్ చేసింది. సినిమా చూస్తున్నప్పుడే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కి దగ్గరగా ఉందని నాకు అనిపించింది. ఈ సినిమా చాలా బెస్ట్ వచ్చాయి. సినిమా విడుదలైనప్పటి నుంచి ఫోన్ కంటిన్యూగా రింగ్ అవుతూనే ఉంది. సినిమా చూసిన అందరికీ మ్యూజిక్ చాలా నచ్చింది. ఆడియన్స్ థియేటర్‌లో గ్రేట్ మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్ చేయడం నిజంగా చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చింది.

మిరాయ్ ఆయుధానికి లార్డ్ శివ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్

ఇందులో మిరాయ్ ఆయుధానికి లార్డ్ శివ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉపయోగించడం జరిగింది. శ్రీరాములవారి ఆయుధం అయినప్పటికీ దానికి పినాక అనే పేరు ఉంది. ఆస్ఫూర్తితోనే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చేశాను. ఈ సినిమా కథని దృష్టిలో పెట్టుకుని మ్యూజిక్ స్కోర్ రాయడం జరిగింది. ఈ సినిమాలో వచ్చే రాములవారి పోర్షన్ చేయడానికి దాదాపు 10 రోజులు పట్టింది. అందులో చాలా ఎలిమెంట్స్ వాడాం. అవన్నీ కూడా పవర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేయడానికి టైమ్ పట్టింది. ఈ సినిమా కోసం రకరకాల జానర్స్‌ని వాడాము. ఇంటర్వల్ బ్యాంగ్‌లో నాలుగు జానర్స్‌లో సౌండ్‌ని మిక్స్ చేసి ప్రెజెంట్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను.

Also Read- Huma Qureshi: ‘కాలా’ బ్యూటీకి అతనితో నిశ్చితార్థం అయిపోయిందా? ఈ వార్తలేంటి?

అంత ఈజీ కాదు

సినిమాలో వైబ్ ఉంది సాంగ్ లేనందుకు నేనేం నిరాశపడలేదు. అది టీమ్ డెసిషన్. సినిమాకి ఏది అవసరమో అది చేయడమే కరెక్ట్ అని నా భావన. మేమందరం కలిసే ఆ నిర్ణయం తీసుకున్నాం. నిజానికి ఇది చాలా పెద్ద కథ. ఒక పార్ట్‌గా చెప్పడం అంటే అంత ఈజీ కాదు. చాలెంజ్‌తో కూడుకున్న వ్యవహారం. కానీ కార్తీక్ చాలా అద్భుతంగా సినిమాని ప్రెజెంట్ చేశారు. ఆ సాంగ్ ఎడిటింగ్ టేబుల్ దగ్గర చూసినప్పుడు.. సినిమా ఫ్లోకి ఇబ్బంది కలిగిస్తుందేమో అనే ఫీలింగ్ కలిగింది. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాం. నెక్ట్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలోనే నాలుగు ప్రాజెక్ట్స్ చేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Delhi Blast: ఒక్కొక్కటిగా వెలుగులోకి నిజాలు.. ఇంటెలిజెన్స్ తాజా అనుమానం ఇదే

Jubilee Hills Bypoll: పోలింగ్ రోజూ పంపకాల జోరు?.. జూబ్లీహిల్స్‌లో ఎంత పంచారంటే?

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బై పోలింగ్ లో హీట్ ట్రెండ్.. మాస్ లోని మెజార్టీ లంతా నవీన్ వైపే?

Delhi Blast: పేలుడుకు ముందు 3 రోజులపాటు అండర్‌గ్రౌండ్‌లోకి ఉమర్.. వెలుగులోకి సంచలన నిజాలు

Gadwal District: నిధులు లేక నిరీక్షణ రెండేళ్ల నుంచి రాని గ్రాంట్లు.. చెక్కులు పాస్ కాక పంచాయతీ కార్యదర్శుల అవస్థలు