Dil Raju: తెలంగాణ రాష్ట్రంలో సినిమాల చిత్రీకరణకు అవసరమైన అనుమతులన్నీ సింగిల్ విండో ద్వారా పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం (Telangana State Government) ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ రూపొందిస్తోందని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు (FDC Chairman Dil Raju) పేర్కొన్నారు. ఈ సులభతర అనుమతులపై రూపొందిస్తున్న ప్రత్యేక వెబ్ సైట్ ‘ఫిలిమ్స్ ఇన్ తెలంగాణ’ (Films in Telangana Website) పై సోమవారం సంబంధిత శాఖలు, ఫిలిం ఇండస్ట్రీ ప్రతినిధులతో ప్రత్యేక వర్క్-షాప్ జరిగింది. బేగంపేట్ లోని టూరిజం ప్లాజాలో జరిగిన ఈ వర్క్ షాప్‌కు తెలంగాణా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, తెలంగాణ ఎఫ్.డీ.సీ మేనేజింగ్ డైరెక్టర్ సి.హెచ్ ప్రియాంక, టూరిజం కార్పొరేషన్ ఎం.డీ వల్లూరు క్రాంతిలతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు, రాష్ట్ర చలన చిత్ర పరిశ్రమ ప్రతినిధులు హాజరయ్యారు.
Also Read- Huma Qureshi: ‘కాలా’ బ్యూటీకి అతనితో నిశ్చితార్థం అయిపోయిందా? ఈ వార్తలేంటి?
‘ఫిలిమ్స్ ఇన్ తెలంగాణ’ వెబ్ సైట్
ఈ సందర్బంగా ఎఫ్.డీ.సి చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని రకాల చేయూతనిస్తున్నారని, ఈ సదావకాశాన్ని సినీ పరిశ్రమ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి సినీ నిర్మాతలు కేవలం స్క్రిప్ట్‌తో వస్తే వారి సినిమా నిర్మాణానికి కావాల్సిన షూటింగ్ లొకేషన్లు, వారికి వివిధ శాఖల నుండి కావాల్సిన అనుమతులు, సినీ నిర్మాణానికి సంబంధించించిన సాంకేతిక విభాగాలు, టెక్నీషియన్లు, హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ నగరాల్లో అందుబాటులో ఉన్న హోటళ్లతో పాటు సంపూర్ణ సమాచారంతో ఈ ‘ఫిలిమ్స్ ఇన్ తెలంగాణ’ వెబ్ సైట్ రూపొందిస్తున్నామన్నారు. సినిమాల చిత్రీకరణకు అవసరమైన అనుమతులన్నీ సింగిల్ విండో ద్వారా పొందేందుకు ఈ వెబ్ సైట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు.
Also Read- Beauty Movie: మొన్న తండ్రీకూతుళ్లుగా.. నేడు భార్యాభర్తలుగా.. నటించిన నటులెవరో తెలుసా?
హైదరాబాద్ సినిమా హబ్
ఇదిలా ఉంటే, ఇటీవల సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్‌లోనూ, నేషనల్ అవార్డ్స్ పొందిన వారు తనని కలవడానికి వచ్చిన సందర్భంలోనూ సినిమా ఇండస్ట్రీపై తన అభిప్రాయం ఎలా ఉందో తెలిపారు. హైదరాబాద్‌ను సినిమా హబ్‌గా మార్చాలని.. నేషనల్, ఇంటర్నేషనల్ నుంచి ఇక్కడ సినిమాలు తీయడానికి వచ్చేలా సకల సదుపాయాలు ఏర్పాటు చేయడానికి.. తగిన ప్లాన్‌తో రావాలని సినిమా ఇండస్ట్రీకి ఆయన పిలుపునిచ్చారు. రాజమౌళి (SS Rajamouli) వంటి వారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కూడా ఆయన కోరారు. సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి ఇష్యూస్‌కు తావు లేకుండా, వారు అడిగిన సదుపాయాలు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన తర్వాత బాలీవుడ్ నుంచి అజయ్ దేవగన్ వంటి వారు ఆయనని కలిసిన విషయం తెలిసిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు