Beauty Movie: సినీ ఇండస్ట్రీలో నటి నటులు ఏ పాత్ర అయినా వేస్తారు. ఒకరితో ఒక పాత్రలో నటించిన తర్వాత దానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్న పాత్ర అయినా నటిస్తారు. హీరో హీరోయిన్స్ చాలా మంది అన్న చెల్లెళ్లుగా నటించి తర్వాత జంటగా కూడా నటించారు. అయితే సీనియర్ నటుడు నరేష్, నటి వాసుకి మాత్రం చాలా డిఫరెంట్.
Also Read: Jharkhand Encounter: మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ.. అగ్రనేత హతం.. మరో ఇద్దరు కీలక నేతలు సైతం?
నరేష్ – వాసుకి ఇటీవల సుందరకాండ మూవీలో తండ్రి కూతుళ్లుగా నటించారు. నారా రోహిత్ సినిమాలో వాసుకి రోహిత్ కి అక్కగా, నరేష్ కూతురిగా ఓ ప్రగ్నెంట్ ఉమెన్ పాత్రలో కనిపించి మెప్పించింది. ఈ చిత్రంలో తండ్రీకూతుళ్లుగా ఈ ఇద్దరూ బాగానే సెట్ అయ్యారు. అయితే, ఇప్పుడు ఈ ఇద్దరూ భార్యాభర్తలుగా కనిపించబోతున్నారు.
Also Read: Siddaramaiah: హిందూ సమాజంపై సంచలన ప్రశ్నలు సంధించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
అంకిత్ కొయ్య, నీలఖి జంటగా రాబోతున్న బ్యూటీ మూవీ సెప్టెంబర్ 19న విడుదల కానుంది. ఈ చిత్రంలో నరేష్ – వాసుకి హీరోయిన్ తల్లి తండ్రి పాత్రల్లో నటించారు. అంటే భార్యాభర్తలుగా నటించారు. ట్రైలర్ లో చూస్తే వీరిద్దరి మధ్య బాండింగ్ బాగానే ఉంది. భార్యాభర్తలుగా బాగానే సెట్ అయ్యారు అనిపిస్తుంది. సుందరకాండలో తండ్రీ-కూతురు బంధంతో ఆకట్టుకున్న నరేష్-వాసుకి జోడీ, ఇప్పుడు బ్యూటీ సినిమాలో భార్యాభర్తలుగా ఎలాంటి మాయాజాలం చేస్తారో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Jangaon Politics: జనగామ రాజకీయాల్లో తెరముందు శత్రుత్వం తెరవెనుక మిత్రుత్వం.. ఇవన్నీ దేనికి సంకేతం!