Jharkhand Encounter: జార్ఖండ్ హజారీబాగ్ లో మావోయిస్టులకు పెద్ద ఎదురెదెబ్బ తగిలింది. మావోయిస్టులకు కోబ్రా బెటాలియన్ పోలీసులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో హిడ్మా కు అత్యంత సన్నిహితుడైన సహదేవ్ సోరన్, రఘునాథ్ హిమంబరం, విర్సన్ గంజు లు హతమయ్యారు. ఇందులో సహదేవ్ సోరైన్ పై రూ. కోటి రికార్డు, మరో ఇద్దరికి 25 లక్షల చొప్పున కాగా, ఒకరికి అదనంగా 10 లక్షలు రివార్డు ఉన్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది.
Also Read: Siddaramaiah: హిందూ సమాజంపై సంచలన ప్రశ్నలు సంధించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
టాప్ లీడర్స్ టార్గెట్ గా లక్ష్యం
మావోయిస్టుల టాప్ లీడర్స్ టార్గెట్ గా కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆపరేషన్ కగార్ మొదలైన నాటి నుంచి వివిధ క్యాడర్లలో ఉన్న 400 మందికి పైగా మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం మట్టు పెట్టింది. ఆపరేషన్ కగార్ లక్ష్యంగా ముందుకు సాగుతూ వస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్టుగానే మార్చి 31 2026 వరకు మావోయిస్టులను పూర్తిస్థాయిలో మట్టు పెడతామనే సంకేతాలు బలంగా వెళ్తున్నాయి. సోమవారం హజారీబాగ్ వద్ద జరిగిన మోస్ట్ వాంటెడ్ హిడ్మా కు అత్యంత సన్నిహితుడుగా ఉన్న మావోయిస్టు సీనియర్ కమాండర్ సహదేవ్ సోరైన్ సహా స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు రఘునాథ్ హిమంబరం, జోనల్ కమిటీ సభ్యుడు విర్సెన్ గంజు లను కోబ్రా బెటాలియన్ పోలీసులు మత్తు పెట్టారు. జూలైలో జరిగిన కోబ్రా జవాన్ ఎటాక్ చేసి హత్య చేసిన చేసిన ఘటనలో సహదేవ్ సోరైన్ ప్రధానంగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆపరేషన్ కగార్ లక్ష్యం నెరవేరే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
అమిత్ షా అనుకున్నట్టుగానే
కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనుకున్నట్టుగానే తన లక్ష్యం నెరవేచ్చేందుకు కోబ్రా బెటాలియన్ బలగాలను వాడుకుంటున్నారు. కోబ్రా బెటాలియన్ బలగాలను వాడుతున్నారు అంటే ఇక టాప్ లీడర్స్ ను ఏరి వేస్తారని సంకేతాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. లెక్కకు మించిన మావోయిస్టులను ఇప్పటికే అంతం చేసిన కేంద్ర ప్రభుత్వం మరింత దూకుడుగా టాప్ లీడర్స్ సెట్ టార్గెట్ గా ముందుకు సాగడం హజారీబాగ్ ఎన్కౌంటర్ ప్రత్యక్ష ఉదాహరణగా స్పష్టమవుతుంది. పంతిత్రి అడవుల్లో భద్రత బలగాలు మావోయిస్టుల కోసం గాలిస్తున్నాయి. కోబ్రా బెటాలియన్ చేసిన స్పెషల్ ఆపరేషన్ లో ముగ్గురు ప్రధాన మావోయిస్టులను మట్టి కరిపించారు. అయితే పంతిత్రి అడవుల్లో మావోయిస్టులు పెద్ద ఆపరేషన్ చేసేందుకే ప్రత్యేక పోకస్ పెట్టినట్లుగా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఆ దిశగా సాగుతున్న క్రమంలో హజారీబాగ్ ఎన్ కౌంటర్ జరిగినట్లుగా కూడా భావిస్తున్నారు.
Also Read: Jupally Krishna Rao: వివాహ గమ్యస్థానంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి