Huma Qureshi: హుమా ఖురేషి.. సౌత్ ప్రేక్షకులకు ఈ భామ పరిచయమే. బాలీవుడ్‌లో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. సౌత్‌లో సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ‘కాలా’, తలా అజిత్ (Ajith) ‘వలిమై’ సినిమాలలో హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం ఈ భామ పేరు బాలీవుడ్ సర్కిల్స్ బాగా వైరల్ అవుతోంది. అందుకు కారణం.. ఆమె తన చిరకాల ప్రియుడు రచిత్ సింగ్ (Rachit Singh)తో సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకుందని, త్వరలోనే ఆమె పెళ్లి పీటలు ఎక్కనుందనేలా.. ఒకటే వార్తలు. ఈ వార్తలు ఇలా ప్రచారమవడానికి కారణం లేకపోలేదు. తన ప్రియుడు, యాక్టింగ్ కోచ్ అయినటువంటి రచిత్ సింగ్‌తో ఆమె తరుచూ కనిపిస్తూ ఉండటంతో పాటు, గాయని అకాసా సింగ్ చేసిన పోస్ట్‌తో వీరి ప్రేమయాణం బయటపడింది. హుమా, రచిత్‌లో రిలేషన్ షిప్ గురించి మొదట రివీల్ చేసింది అకాసా సింగే కావడం విశేషం.
Also Read- Little Hearts: ఇప్పటి వరకు ‘లిటిల్ హార్ట్స్’ కొల్లగొట్టిన కలెక్షన్స్ ఎంతంటే..
ఆ వార్తలకు కారణం ఇదే..
‘బెస్ట్ పేరు ఉన్న నీకు, నీ లిటిల్ పీస్ ఆఫ్ హెవెన్‌కి అభినందనలు హుమా. చాలా మంచి రాత్రి గడిపాను’ అని అప్పట్లో అకాసా చేసిన పోస్ట్‌తో బాగా వైరల్ అయింది. అప్పుడే హుమా ఖురేషి, రచిత్ సింగ్‌తో రిలేషన్‌లో ఉందనే విషయం ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత కూడా వీరిద్దరూ ఓ పబ్లిక్ ఫంక్షన్‌లో కనిపించి సందడి చేశారు. సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్‌ల వివాహానికి హుమా, రచిత్ ఇద్దరూ ఒకే రంగు డ్రస్‌లతో హాజరయ్యారు. ఆ వేడుకలో వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చూసిన అభిమానులు, హుమా పక్కన ఉన్న ఆ వ్యక్తి ఎవరని తెలుసుకోవడానికి మరింత ఆసక్తి చూపించారు. ఈ మధ్య హుమా ఒక ప్రైవేట్ వేడుకలో రచిత్ పుట్టినరోజును జరుపుకోవడంతో.. వారిద్దరి నిశ్చితార్థంపై వస్తున్న రూమర్స్‌కు మరింత బలం చేకూర్చినట్లయింది. కాకపోతే, నిశ్చితార్థానికి సంబంధించి వీరిద్దరూ ఎక్కడా అధికారికంగా ధ్రువీకరించలేదు. వారి చెప్పలేదు కానీ, వారి చర్యలు మాత్రం వారిద్దరికీ ఎంగేజ్‌మెంట్ అయిపోయినట్లుగానే ఉండటం విశేషం.
Also Read- Jayammu Nichayammu Raa: డాడీ అని పిలిచిన తేజ సజ్జా.. ఫీలైన జగ్గూ భాయ్.. వీడియో వైరల్!
రచిత్ సింగ్ ఎవరంటే..
రచిత్ సినీ పరిశ్రమలో బాగా పేరున్న వ్యక్తి. ఆలియా భట్, రణవీర్ సింగ్, విక్కీ కౌశల్ వంటి నటులకు యాక్టింగ్ కోచ్‌గా శిక్షణ ఇచ్చారు. అంతేకాదు, ‘కర్మ కాలింగ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించి తెరపై కూడా అరంగేట్రం చేశారు. హుమా, రచిత్ మధ్య బంధం గురించి చాలా కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మార్చి 2024లో, షారూక్, గౌరీ ఖాన్‌లు ఎడ్ షీరన్‌కు ఏర్పాటు చేసిన పార్టీలో వారిద్దరూ కనిపించారు. అప్పుడు కూడా వారిద్దరూ చాలా సన్నిహితంగా ఉన్నట్లు కనిపించారు. ప్రస్తుత హుమ ఖురేషి (Huma Qureshi) విషయానికి వస్తే.. ఆమె వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ మంచి ఊపు మీద ఉంది. ఆమె నటించిన చిత్రం ‘బయాన్’, టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో వరల్డ్ ప్రీమియర్ అయ్యింది. నటిగా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా హుమా తొలిసారి ఈ ఫెస్టివల్‌లో అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే, ఇంతకు ముందు హుమా ఖురేషి.. దర్శకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత, పాటల రచయిత అయిన ముదస్సర్ అజీజ్‌తో సుధీర్ఘకాలం పాటు రిలేషన్‌ను కొనసాగించిన విషయం తెలిసిందే. వారిద్దరూ పెళ్లి చేసుకుంటారనుకునే సమయంలో 2022లో వారి బంధానికి బ్రేకప్ పడింది. అప్పటి నుంచి రచిత్ సింగ్‌తో ఆమె రిలేషన్ కొనసాగిస్తున్నారని, ఇటీవలే వీరికి నిశ్చితార్థం అయిందంటూ తాజాగా బాలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు