Jayammu Nichayammu Raa: విలక్షణ నటుడు జగపతి బాబు (Jagapathi Babu), ఇప్పుడు బుల్లితెర, ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోన్న విషయం తెలిసిందే. నందమూరి నటసింహం బాలయ్య తరహాలోనే జగ్గూభాయ్ కూడా సెలబ్రిటీ టాక్ షో హెస్ట్‌గా దూసుకెళుతున్నారు. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ (Jayammu Nischayammu Raa) పేరుతో ఆయన నిర్వహిస్తోన్న సెలబ్రిటీ టాక్ షో.. మంచి ఆదరణను రాబట్టుకుంటోంది. జీ5 ఓటీటీ, జీ తెలుగు కోసం చేస్తున్న ఈ షో.. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఆగస్ట్ 15న గ్రాండ్‌గా ప్రారంభమైంది. మొదటి ఎపిసోడ్‌కు కింగ్ నాగార్జున (King Nagarjuna) గెస్ట్‌గా వచ్చారు. నాగ్ తర్వాత శ్రీలీల, నేచురల్ స్టార్ నాని, సందీప్ రెడ్డి వంగా – రామ్ గోపాల్ వర్మ, మీనా – సిమ్రాన్ – రవళి వంటి వారంతా ఈ షోలో సందడి చేస్తూ వచ్చారు. ఇప్పుడు ‘మిరాయ్’ (Mirai Movie) హీరో తేజ సజ్జా (Teja Sajja) వంతు వచ్చింది. తేజ సజ్జా ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా మేకర్స్ ప్రోమోని విడుదల చేశారు. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Also Read- Mirai Movie: ఒక టికెట్ కొంటే ఇంకోటి ఫ్రీ.. ‘మిరాయ్’ మేకర్స్ సంచలన నిర్ణయం
తేజ బుగ్గలు పట్టుకున్న గుణశేఖర్
ఈ ప్రోమోని గమనిస్తే.. రాకింగ్ ఎంట్రీ ఇచ్చిన తేజ సజ్జా.. రాగానే ‘అటు తిరుగుతారేంటి డాడీ’ అని పిలిచారు.. దీనికి జగపతిబాబు.. ‘డాడీ ఏంట్రా డాడీ.. పది మంది ముందు అలా పిలవవద్దని చెప్పానుగా’ అని ఫీలయ్యారు. వెంటనే తేజ సజ్జా.. ఇక్కడెవరు లేరుగా.. అనగానే.. లేరన్నట్లుగా జగ్గూభాయ్ తల ఆడించారు. అంతే, వెంటనే వెళ్లి జగపతిబాబుని హగ్ చేసుకున్నారు తేజ సజ్జా. అనంతరం సీట్లో కూర్చున్నాక.. ‘‘ఈ డాడీ గొడవేంటి?.. ఎంతమందికి డాడీ?’ అని ప్రశ్నించారు. ‘అది నేను చేయలేదు సార్.. ప్రపంచం చేస్తున్న విషయం’ అని తేజ ఆన్సర్ ఇచ్చారు. గుణశేఖర్ సార్ వాళ్ల టీమ్ ‘చూడాలని వుంది’ సినిమా కోసం వచ్చి అక్కడ ఫొటోలు తీసుకున్నారు.. అని తేజ సజ్జా చెప్పగానే.. వెనుక నుంచి గుణశేఖర్ (Guna Sekhar) వచ్చి, తేజ సజ్జా బుగ్గలు పట్టుకున్నారు. ఊహించని పరిణామానికి షాకైన తేజ సజ్జా.. వెంటనే లేచి ఆయనకు నమస్కరించి, హగ్ చేసుకున్నారు.
Also Read- Maruthi: చెప్పుతో కొట్టుకున్న ‘బార్బరిక్’ దర్శకుడికి పబ్లిగ్గా డైరెక్టర్ మారుతి క్లాస్!
స్టేజ్ మీదే రియల్ స్టంట్స్..
చిన్నప్పటి నుంచి నాకు బుగ్గలు గిల్లడం అలవాటు అని గుణశేఖర్ అనగానే.. ‘వెరీ గుడ్.. మళ్లీ గిల్లండి’ అని మరోసారి ఆ పని చేయించారు జగ్గూ భాయ్. ఆ తర్వాత షో లోకి ‘మిరాయ్’ మూవీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని వచ్చారు. జగపతిబాబు, తేజ సజ్జా, కార్తీక్ కలిసి ‘వైబ్ ఉంది’ పాటకు డ్యాన్స్ చేశారు. ‘మిరాయ్’ సినిమాలో రియల్‌గా యాక్షన్ స్టంట్స్ చేశానని చెప్పడం కాదు.. ఒకసారి అందరి ముందు చేసి చూపించాలని తేజాకు జగ్గూ భాయ్ సవాల్ విసిరారు. వెంటనే తేజ సజ్జా.. కర్ర తీసుకుని తనకు వచ్చిన, తను నేర్చుకున్న ఆర్ట్‌ని ప్రదర్శించారు. ఇది.. ప్రోమోలోని మ్యాటర్. ఇప్పుడీ ప్రోమో వైరల్ అవుతూ.. ఎపిసోడ్ కోసం వేచి చూసేలా చేస్తుంది. ఈ ఎపిసోడ్ జీ తెలుగు ఓటీటీలో ఈ శుక్రవారం నుంచి అందుబాటులోకి రానుంది. అలాగే జీ తెలుగు ఛానల్‌లో ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు