Director Maruthi
ఎంటర్‌టైన్మెంట్

Maruthi: చెప్పుతో కొట్టుకున్న ‘బార్బరిక్’ దర్శకుడికి పబ్లిగ్గా డైరెక్టర్ మారుతి క్లాస్!

Maruthi: ఇటీవల ‘త్రిబాణధారి బార్బరిక్’ దర్శకుడు.. తన సినిమాను చూడటానికి జనాలు రావడం లేదంటూ.. ఎమోషనల్ అవుతూ, చెప్పుతో కొట్టుకున్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై దర్శకుడు మారుతి (Director Maruthi) ఆయనకు క్లాస్ ఇచ్చారు. తాజాగా మారుతి సమర్పిస్తున్న ‘బ్యూటీ’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ వేడుకలో.. ‘త్రిబాణధారి బార్బరిక్’ (Tribandhari Barbarik) దర్శకుడు మోహన్ శ్రీవత్స‌ (Mohan Srivatsa)ను ఉద్దేశించి ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక్క మోహన్ శ్రీవత్స గురించే కాకుండా.. ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులను ఆయన చక్కగా విశ్లేషించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

వందసార్లు చెప్పా టైటిల్ మార్చమని

‘‘ఎవరైనా బాధలో ఉన్నారంటే.. ఫస్ట్ నాకు భయమేస్తుంది. ఎందుకంటే, ఆ ప్లేస్‌లో నేను ఉండకూడదని కోరుకుంటాను. నేను ఎవరైనా ఆనందంగా ఉన్నా, పబ్‌లో పార్టీలు అన్నా 90 పర్సంట్ వెళ్లను. ఎందుకంటే, ఆల్రెడీ వాళ్లు హ్యాపీగా ఉన్నారు. నేను వెళ్లి వాళ్ల ఆనందాన్ని పెంచాల్సిన అవసరం లేదు. కానీ బాధలో ఉన్నవాడికి నాలాంటి వాడి మాట, నేను తట్టే భుజం చాలా హెల్ప్ అవుతుంది. అది నేను పెరిగిన వాతావరణం ద్వారా వచ్చింది. నేను సాంగ్ షూట్‌లో ఉన్నా, ఫారెన్ వెళ్లినా, రోజు విజయ్‌తో మాట్లాడేవాడిని. ఆయన ‘బార్బరిక్’ అని మంచి సినిమా తీశాడు. ఆ సినిమా డైరెక్టర్ కూడా చాలా మంచి డైరెక్టర్. అతనికి వందసార్లు చెప్పా టైటిల్ మార్చమని.. ‘గురూ.. బార్బరిక్ అంటే.. అదేదో బార్బి క్యూ లాగా అనిపిస్తుంది. ఎవరికీ అర్థం కాదు. ఒకసారి ఆలోచించు..’ అని రోజుకో టైటిల్ పంపించా. స్పెల్లింగ్ ఎక్కడ మిస్ అవుతుందో అని.. నేనే లోగో రాసి మరీ పంపించేవాడిని. ఆయన ఏంటంటే.. ఒక ట్రాన్స్‌లో ఉండేవాడు. ఆ సినిమా గురించి ఆయన ఆలోచన ఎలా ఉండేదంటే.. బార్బరిక్ అంటే ఒక దేవుడని ఫీలయ్యాడు. మనం ఫీలవడం వేరు.. ఆడియెన్ ఫీలవడం వేరు. ఆడియన్ మనసులో లేని దేవుడిని మనం తీసుకెళ్లలేం. ఇది ఎన్నోసార్లు చెప్పాను. అయినా ఒక డైరెక్టర్‌గా ఇంకో డైరెక్టర్‌ని ఫోర్స్ చేయలేను అని.. సరేలే.. మీరు నమ్మారు కదా.. వెళ్లిపోండి అని చెప్పా. అది అలాగే వెళ్లిపోయింది.

Also Read- Idli Kottu: ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ను తెలుగులో రిలీజ్ చేస్తుంది ఎవరో తెలుసా?

నాకంటే గొప్పగా ఎవడూ రాయలేడు

చివరికి ఆయన ఒక మంచి సినిమా తీసి, చూడలేదని చెప్పుతో కొట్టుకున్నాడు. నాకు చాలా బాధ వేసింది. డైరెక్టర్, కళాకారుడు, పదిమందిని క్రియేట్ చేసేవాడు దయచేసి ఎప్పుడూ అలాంటి పిచ్చి పనులు చేయవద్దు. ఎందుకు చెబుతున్నానంటే, ఆడియెన్స్‌ను రప్పించడానికి ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారంటే.. బూతులు మాట్లాడుతున్నారు, చొక్కా తీసి తిరుగుతానని అంటున్నారు. అసలు సినిమాలే మానేస్తానని అంటున్నారు. అసలు ఒక సినిమా ఆడకపోతే ఇంత దిగజారిపోతారా? ఇంత దారుణంగా మాట్లాడతారా? ఈ సినిమా కాకపోతే, ఇంకో సినిమా ఆడుతుంది. అంతేకానీ, సినిమాలు మానేస్తా, రాను, ఎవరినీ చూడొద్దు, చొక్కా విప్పతీసుకుని తిరుగుతా, బూతులు మాట్లాడతా.. ఏంటిది? కల్చర్ ఎటు వెళ్లిపోతుంది? ప్రతి సినిమాకు చూస్తున్నా. మనం ఏదైనా కాంట్రవర్సీగా మాట్లాడితే.. సినిమా వెళ్తుంది. బూతులు మాట్లాడితే సినిమా చూస్తారనే భావనలో ఉన్నారు. అలా అనుకుంటే.. నేను రాసినన్నీ డబులు మీనింగ్ డైలాగ్స్, నేను కూర్చుంటే నాకంటే గొప్పగా ఎవడూ రాయలేడు. గుర్తు పెట్టుకోండి. కానీ, నేను ఎందుకు రాయడం లేదు? ‘బస్‌స్టాప్’ అనే సినిమాతో ఆపేశాను నేను.. ఎందుకు రాయడం లేదు? డబ్బులు సంపాదించడం నాకు రాదా? నాలుగు రోజులు కూర్చున్నానంటే.. ‘బ్యూటీ’ సినిమాకు వంద డైలాగ్స్ ఇస్తాను.

Also Read- Beauty Movie: ‘బ్యూటీ’ దమ్మున్న సినిమా.. అందుకే ‘ఓజీ’ ముందు వదులుతున్నారట..

ఊరికినే డైరెక్టర్స్ అయిపోరు

అసలు సినిమాలు ఎందుకు తీస్తున్నాం.. ఫ్యామిలీస్ సినిమాకు రావాలి. మంచి సినిమా, క్వాలిటీ సినిమా ఇవ్వాలి. ‘ఈరోజుల్లో’, ‘బస్‌స్టాప్’ సినిమాలతో బూతు డైరెక్టర్ అనిపించుకున్నవాడు.. ఈ రోజు రూ. 400 కోట్లతో ‘రాజా సాబ్’ (The Raja Saab) సినిమా తీస్తున్నాడు. వాడి ఎదుగుదల చూడండి. వాడి గ్రాఫ్ చూడండి. వాడి కెరియర్ చూడండి. నేను చెప్పేది అదే. ఊరికినే డైరెక్టర్స్ అయిపోరు. ఊరికే ఒక పాన్ ఇండియా స్టార్ వచ్చేసి, ఒక ఫ్లాప్ సినిమా తర్వాత పిలిచి, ఎదురుగుండా కూర్చోబెట్టి సినిమాలు ఇవ్వరిక్కడ. అలా పిలిచి సినిమా ఇచ్చారంటే.. ప్రభాస్ (Rebel Star Prabhas) మనసులో ఈవాళ నేను ఉన్నా. మేమిద్దరం ఎంత ప్రేమలో ఉన్నామో నాకు తెలుసు. నా మెసేజ్‌లు చూస్తే.. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు. ఇవన్నీ సందర్భం వచ్చినప్పుడు నేను మాట్లాడతా.

ఆ బాధ్యత మనపై ఉంది

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, సినిమా ఆడిచ్చాలని చాలా ఫ్రస్ట్రేషన్‌తో, స్ట్రెస్‌తో.. సినిమా ఈవెంట్స్‌లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అలా కాదు.. సినిమాను నమ్మండి, కంటెంట్‌ను నమ్మండి. జనం ఎప్పుడూ మంచి సినిమా తీస్తే చూస్తారు. మనం వెయ్యి రూపాయలను వారి జేబుల్లో నుంచి దోచేస్తున్నాం. వాళ్లకి మంచి సినిమా ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది. జనాలు థియేటర్‌కు రాలేదని తిడతారేంటి అసలు? రాలేదని చెప్పుతో కొట్టుకుంటారా? నాకు చాలా బాధ కలిగింది. అందుకని ఇలాంటి చిల్లర పనులు, చీప్ పనులు చేయవద్దు. ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా. ఒక సినిమా ఫెయిల్యూర్ అయిందంటే.. ఓహో నేను నచ్చలేదు, నా కంటెంట్ నచ్చలేదని రియలైజ్ అవ్వండి. ఆడియన్‌కి ఏం కావాలో? అది వండి పెట్టడానికి ట్రై చేయండి. అంతేకానీ, నువ్వు చేసిన వంట ఫోర్స్ చేసి మరీ వాళ్లని తినమని అంటారేంటి? దయచేసి ఆ పనులు చేయకండి..’’ అని మారుతి హితబోధ చేశారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Army Veterans: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సర్కారు ఆసుపత్రుల్లో ఆర్మీ జవాన్లు

Bathukamma 2025: గిన్నిస్ రికార్డు లక్ష్యంగా బతుకమ్మ ఉత్సవాలు.. ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు

Harish Rao: లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టే ధైర్యం ప్రభుత్వానికి లేదా: హరీష్ రావు

Ramachandra Rao: ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం.. అలైన్ మెంట్ మార్చాలంటూ రైతులు డిమాండ్!

H-City Project: ముందుకు సాగని హెచ్ సిటీ పనులు.. ఎందుకో తెలుసా..!