Idli Kottu: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) నటించిన మరో సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ‘కుబేర’ (Kubera)తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ నటిస్తున్న ‘ఇడ్లీ కడై’ చిత్రం.. తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’ (Idli Kottu)గా విడుదల కాబోతోంది. ఈ సినిమాకు హీరోనే కాదు డైరెక్షన్ బాధ్యతలను కూడా ధనుష్ నిర్వహిస్తున్నారు. డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ఆకాష్ బాస్కరన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా.. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సినిమాను తెలుగులో శ్రీ వేదాక్షర మూవీస్ బ్యానర్‌పై నిర్మాత రామారావు చింతపల్లి విడుదల చేస్తున్నారు. అక్టోబర్ 1వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో మేకర్స్ చిత్ర ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేశారు. ఆదివారం ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలి, రిలీజ్ డేట్‌పై మరోసారి క్లారిటీ ఇచ్చారు.
Also Read- Ram Gopal Varma: ‘మిరాయ్’పై మరో ట్వీట్.. వర్మకి టాపిక్ దొరికిందోచ్!
రిలీజ్ డేట్‌ని కన్ఫర్మ్..
అక్టోబర్ 1న సినిమా రిలీజ్ అని మొదటి నుంచి చెబుతూ వస్తున్నా.. ఇంత వరకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. దీంతో ఈ సినిమా ఆ తేదీకి వస్తుందా? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే, ఈ సినిమా విడుదలైన మరుసటి రోజే రిషబ్ శెట్టి పాన్ ఇండియా సినిమా ‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) రిలీజ్ కాబోతోంది. దీంతో ధనుష్ సినిమా వాయిదా పడిందనేలా కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ మరోసారి రిలీజ్ డేట్‌ని కన్ఫర్మ్ చేస్తూ.. తెలుగు టైటిల్, ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఇది డైరెక్టర్‌గా ధనుష్ చేస్తున్న నాలుగో చిత్రం. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం పోటీ ఏర్పడగా, ఫైనల్‌గా ధనుష్ కెరీర్‌లోనే హైయెస్ట్ ప్రైస్‌కి శ్రీ వేదాక్షర మూవీస్ (Sri Vedakshara Movies) సొంతం చేసుకుంది.
హైయెస్ట్ థియేటర్స్‌లో..
ఈ సందర్భంగా ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్న నిర్మాత రామారావు చింతపల్లి (Ramarao Chintapalli) మాట్లాడుతూ.. ‘ఇడ్లీ కొట్టు’ సినిమాను అక్టోబర్ 1న ధనుష్ కెరీర్ లోనే హైయెస్ట్ థియేటర్స్‌లో గ్రాండ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. తెలుగులో చాలా అగ్రెసివ్‌గా ప్రమోట్ చేసి, సినిమాను భారీగా రిలీజ్ చేయబోతున్నాం. ఈ సినిమా తెలుగు రైట్స్ మాకు ఇచ్చినందుకు ధనుష్‌కు, ఆయన టీమ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కచ్చితంగా ఈ సినిమా తెలుగు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నామని తెలిపారు. ఇక మేకర్స్ వదిలిన ఫస్ట్ లుక్ గమనిస్తే.. పంచెకట్టులో ఓ చేతిలో క్యాన్లు, మరో చేతిలో సంచి, ఆకుకూరలు పట్టుకుని, నుదిటికి విభూది పెట్టుకుని.. పక్కా పల్లెటూరి వ్యాపారిగా కనిపిస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధనుష్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్, రాజ్‌కిరణ్ ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు. టాప్ కంపోజర్ జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు