Ram Gopal Varma: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ‘మిరాయ్’ (Mirai Movie) రూపంలో టాపిక్ దొరికింది. ఇక సోషల్ మీడియాను షేర్ చేసే పనిలో ఉన్నారు. తేజ సజ్జా (Teja Sajja) హీరోగా కార్తిక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వంలో సెప్టెంబర్ 12న విడుదలైన ‘మిరాయ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. విడుదలైన మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకున్న ఈ సినిమాపై విమర్శకులే కాదు.. ప్రేక్షకులు కూడా అద్భుతం అంటున్నారు. మరీ ముఖ్యంగా అంత తక్కువ బడ్జెట్‌తో అలాంటి అవుట్‌పుట్ రావడం అంటే మాములు విషయం కాదంటూ.. టీమ్ అందరిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో సెలబ్రిటీలెందరో ‘మిరాయ్’ టీమ్‌ను అభినందిస్తున్నారు. ఇక సినిమా విడుదల రోజే.. రియాక్ట్ అయిన వర్మ.. సినిమా అదుర్స్ అనే రేంజ్‌లో తన రివ్యూ ఇచ్చారు. ఇప్పుడు మరో ట్వీట్ చేశారు.
ఇలాంటి గ్రాండ్ విఎఫ్‌ఎక్స్ ఇంత వరకు చూడలేదు..
నిజంగా చిత్ర నిర్మాత కూడా ఈ సినిమా టీమ్ గురించి ఇంతగా చెప్పలేదు. సోషల్ మీడియాలో పెద్ద మెసేజ్ పెట్టి.. హీరో, విలన్, దర్శకుడు, నిర్మాత, విఎఫ్‌ఎక్స్ అంటూ.. ఒక్కో విభాగాన్ని ప్రత్యేకంగా ప్రశంసించడం చూసిన వారంతా.. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ వర్మకు ఓ టాపిక్ దొరికింది, ఇక రోజూ వాయించేస్తాడు.. అంటూ సరదాగా కామెంట్స్ చేస్తుండటం విశేషం. అసలింతకీ వర్మ తన ట్వీట్‌లో ఏం చెప్పారంటే.. ‘‘మిరాయ్ సినిమా చూశాక, ఇలాంటి గ్రాండ్ విఎఫ్‌ఎక్స్‌ను నేను ఎప్పుడూ చూడలేదు, 400 కోట్ల బడ్జెట్ ఉన్న సినిమాల్లో కూడా ఇలాంటివి కనిపించలేదు. హలో మంచు మనోజ్.. అసలు మీరు విలన్ పాత్రకు సరైన వ్యక్తి కాదని అనుకున్నాను, కానీ మీ అద్భుతమైన నటన చూసి నా చెంప మీద నేను కొట్టుకున్నాను. ఇప్పుడు నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను. హలో తేజ సజ్జా.. ఈ భారీ యాక్షన్ సినిమాను మీరు మోయలేరని, మీరు ఇంకా చాలా చిన్నవాడని అనుకున్నాను, కానీ.. ఒక్కసారి కాదు.. ఇప్పుడో రెండోసారి కూడా నా నిర్ణయం తప్పని నిరూపించావు.
Also Read- Charan and Upasana: రామ్ చరణ్, ఉపాసన దంపతులు చెప్పబోయే గుడ్ న్యూస్ ఇదేనా?
నువ్వు కన్న కల
సినిమాలోని విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, స్క్రీన్‌ప్లే, నిర్మాణం ఇలా అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్, ఎలివేషన్స్, భక్తిపరమైన అంశాలు చాలా ఆకర్షణీయంగా, లీనమయ్యేలా అనిపించాయి. కత్తులు, మంత్రాలు, అతీంద్రీయ బెదిరింపుల మధ్య కూడా.. ఈ చిత్రం కుటుంబం, బాధ్యత, ప్రేమ, వెన్నుపోటు వంటి వాటిని చాలా స్పష్టంగా తెలియజేసింది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని.. ‘మిరాయ్’ విజయం వెనుక ఉన్న మెయిన్ కారణం ఏంటంటే.. ఇది నువ్వు కన్న అద్భుతమైన కల అనిపించడమే. కథకు విజువల్స్‌తో పాటు పురాణాలను, హీరోయిజాన్ని జోడించి చూపించిన విధానం చూస్తుంటే.. నీకు అన్ని విభాగాల్లో పట్టు ఉందనేది అర్థమవుతోంది.
Also Read- Bigg Boss 9 Telugu: ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యింది ఎవరంటే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు షాక్!
నిజానికి ఇది ఒక పెద్ద సినిమా
నిర్మాత విశ్వప్రసాద్.. మీరు సినిమా కుటుంబం నుండి రాకపోయినా, ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లాలనే మీ వ్యక్తిగత అభిరుచి, ఇండస్ట్రీ నుంచి వచ్చిన హెచ్చరికలను కూడా లెక్కచేయకుండా మీరు మీపైనే నమ్మకం ఉంచారని నిరూపించింది. ఈ సాహసం ‘విధి ధైర్యవంతులకే అనుకూలంగా ఉంటుంది’ అని మరోసారి రుజువు చేసింది. ఒక సినిమా టీమ్ పని కేవలం లాభాలు సంపాదించడం మాత్రమే కాదు, జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను సృష్టించడం కూడా అని నేను బలంగా నమ్ముతాను. ఇందులో కొన్ని షాట్స్ శ్లోకాలుగా, యాక్షన్ సన్నివేశాలు ఆచారాలుగా అనిపించాయి. చివరగా నేను చెప్పదల్చుకున్నది ఏంటంటే.. ఇది చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించాలని ప్రయత్నించిన సినిమా కాదు, నిజానికి ఇది ఒక పెద్ద సినిమా, ప్రేక్షకులు దీనిని ఆదరించే వరకు ఈ విషయాన్ని ప్రచారం చేసుకోరు. మరోసారి టీమ్ అందరికీ నా అభినందనలు’’ అని వర్మ పేర్కొన్నారు.
After seeing #Mirai , I don’t remember the last time VFX felt so grand , even in the so called + 400 cr films
Hey @HeroManoj1 I thought you were miscast as the villain , and I slapped myself after seeing your terrific portrayal 🔥🔥🔥
Hey @tejasajja123 I thought you might…
— Ram Gopal Varma (@RGVzoomin) September 14, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు