Charan and Upasana: చరణ్, ఉపాసన చెప్పే గుడ్ న్యూస్ ఇదేనా?
Charan and Upasana
ఎంటర్‌టైన్‌మెంట్

Charan and Upasana: రామ్ చరణ్, ఉపాసన దంపతులు చెప్పబోయే గుడ్ న్యూస్ ఇదేనా?

Charan and Upasana: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన (Ram Charan and Upasana) దంపతులు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారంటూ.. టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. గుడ్ న్యూస్ అనగానే మళ్లీ వారిద్దరూ పేరేంట్స్ కాబోతున్నారా? ఇప్పటికే ఈ జంటకు మెగా ప్రిన్సెస్ ‘క్లీంకార’ (klin kaara konidela) ఉండగా, ఇప్పుడు మళ్లీ ఉపాసన ఏమైనా ప్రెగ్నెంటా? అనే ఆలోచనలు రావడం సహజమే. అందులోనూ, మొదటి బిడ్డకు కావాలని గ్యాప్ తీసుకున్నామని, రెండో బిడ్డ విషయంలో అలా చేయమని.. ఆ మధ్య ఉపాసన ఓ కార్యక్రమంలో చెప్పారు కాబట్టి.. కచ్చితంగా గుడ్ న్యూస్ అనగానే అంతా అదే అనుకుంటున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య దంపతులు తాజాగా పేరేంట్స్‌గా ప్రమోషన్ పొందారు. వారికి బాబు జన్మించారు. మెగాస్టార్ చిరంజీవి పరుగుపరుగున వెళ్లి, మెగా వారసుడిని చూసుకుని, ఎంతో ఆనందించారు. ఈ నేపథ్యంలో టైటిల్ చూసి కచ్చితంగా అందరూ మళ్లీ వారు పేరేంట్స్ కాబోతున్నారనే అనుకుంటారు. కానీ, విషయం అది కాదు. మరేంటంటే..

Also Read- Bigg Boss 9 Telugu: ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యింది ఎవరంటే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు షాక్!

ఆ వాదనలో నిజమెంత?

ప్రస్తుతం థియేటర్లకు జనాలు రావడం లేదనే మాట ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. మంచి సినిమా, కంటెంట్ ఉన్న సినిమా అయితేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. కంటెంట్ లేకుండా వచ్చిన స్టార్ హీరోల సినిమాలను కూడా ఒక్క రోజులోనే డిజాస్టర్స్‌గా మార్చేస్తున్నారు. అలాగే ఓటీటీ ప్రభావం కూడా జనాలపై ఉందని, అందుకే థియేటర్లకు రావడం లేదనే వాదన కూడా వినిపిస్తూనే ఉంది. జనాలు థియేటర్లకు రావడం లేదు సరే.. మరెందుకు రోజురోజుకు మల్టీప్లెక్స్ థియేటర్ల నిర్మాణ సంఖ్య పెరుగుతోంది. మరీ ముఖ్యంగా, ఏఎమ్‌బి, ఏఏఏ, ఏవిడి ఇలా వరసగా మల్టీప్లెక్స్ థియేటర్లు వెలుస్తూనే ఉన్నాయి. రీసెంట్‌గా రవితేజ కూడా ఈ బిజినెస్‌లోకి అడుగు పెట్టారు. థియేటర్లకు జనాలు రాకుంటే.. ఎందుకు థియేటర్ల నిర్మాణం జరుగుతుందని ప్రశ్నించే వారు కూడా లేకపోలేదు. సరే, ఆ టాపిక్ పక్కన పెడితే.. ఇప్పుడిదే బిజినెస్‌లోకి రామ్ చరణ్ కూడా రాబోతున్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

Also Read- Nidhhi Agerwal: ‘మిరాయ్’ సక్సెస్‌.. పాపం.. నిధి పాప ఫీలవుతోంది!

న్యూ బిజినెస్

హైదరాబాద్‌లోనూ, అలాగే ఏపీలోనూ ఆయన కొన్ని మల్టీఫ్లెక్స్ థియేటర్ల నిర్మాణం చేయబోతున్నారట. అదీ కూడా అలాంటిలాంటి మల్లీప్లెక్స్‌ కాదు.. లగ్జరీ మల్టీఫ్లెక్స్ థియేటర్లు నిర్మించబోతున్నట్లుగా టాక్ నడుస్తుంది. దీనికి సంబంధించిన వ్యవహారాలన్నింటిని తన భార్య ఉపాసన చేతికి రామ్ చరణ్ ఇవ్వబోతున్నారట. అది అసలు విషయం. ఉపాసన బిజినెస్ మైండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో అత్తమ్మ వంటలను చూసి.. అత్తమ్మాస్ కిచెన్ అని బిజినెస్ స్టార్ట్ చేసిన ఘనాపాటి ఉపాసన. ఇప్పుడు తన భర్తతో కలిసి కొత్త బిజినెస్ అంటే.. ఆమె కంటే సరైన పర్సన్ ఎవరుంటారు? ఇప్పటికే అపోలో బాధ్యతలను నిర్వహిస్తున్న ఉపాసనకు ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలిచి మరీ తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో ఛైర్మన్ పదవిని ఇచ్చారంటే ఆమె సత్తా ఏంటో అర్థమవుతోంది. ఇప్పుడు చరణ్‌తో కలిసి ఆమె స్టార్ట్ చేయబోయే ఈ బిజినెస్ కూడా తిరుగులేనిది అవుతుందని మెగా అభిమానులు (Mega Fans) అప్పుడే కామెంట్స్ కూడా చేయడం మొదలుపెట్టారు. దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Tyler Chase: బెగ్గర్‌గా మారిన హాలీవుడ్ చైల్డ్ యాక్టర్ టైలర్ చేజ్.. ఎందుకంటే?

Railway Stocks: కీలక ట్రిగర్స్‌తో రైల్వే షేర్లలో దూకుడు.. IRCTC, RailTel, Jupiter Wagons 12% వరకు లాభాలు

Telangana Temples: ఆలయంలో ఇదేం తంతు.. పూజలు, టోకెన్ అంటూ భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న వైనం..!

Congress Counters KCR: కేసీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చిన మంత్రులు

Samsung Galaxy S26 Ultra: సామ్‌సంగ్ ఫ్యాన్స్‌కు షాక్.. Galaxy S26 Ultra ఆలస్యం వెనుక కారణం ఇదేనా..?