Beauty Pre Release Event
ఎంటర్‌టైన్మెంట్

Beauty Movie: ‘బ్యూటీ’ దమ్మున్న సినిమా.. అందుకే ‘ఓజీ’ ముందు వదులుతున్నారట..

Beauty Movie: ‘మిరాయ్’ హిట్ అయింది.. ఇప్పుడు ‘బ్యూటీ’ (Beauty) వస్తోంది.. తర్వాత వచ్చే ‘ఓజీ’ ఎలా ఉండోబోతోందో నాకు తెలుసు.. ఈలోపు ‘బ్యూటీ’ని అంతా చూడండి. ఆడపిల్లల గురించి పవర్ స్టార్ చెప్పిన మాటలతో, యథార్ఘ సంఘటనలతో ‘బ్యూటీ’ కథను రాశారని అన్నారు స్టార్ డైరెక్టర్ మారుతి (Director Maruthi). అంకిత్ కొయ్య, నీలఖి హీరో‌హీరోయిన్లుగా విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మించాయి. ‘గీతా సుబ్రమణ్యం’, ‘హలో వరల్డ్’, ‘భలే ఉన్నాడే’ ఫేమ్ జె.ఎస్.ఎస్. వర్ధన్ మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించిన ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించారు. సెప్టెంబర్ 19న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా.. ఆదివారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక (Beauty Pre Release Event)ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్ మారుతి, నిర్మాత ఎస్ కే ఎన్ (SKN) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

దమ్ముంది కాబట్టే.. ఈ రోజు ఇక్కడున్నాం

ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. ‘‘మేము చేసిన ప్రతీ సినిమా విజయం సాధించిందంటే.. అందుకు దానికి కారణం ఎస్‌కే‌ఎన్. ‘ఈరోజుల్లో’ మూవీకి తను, శ్రేయాస్ శ్రీనివాస్ సపోర్ట్ చేశారు. ఆ రోజు వాళ్లిద్దరూ లేకుంటే.. నేను ఈ రోజు ఇక్కడ ఇలా ఉండేవాడినే కాదు. సుబ్బు మాకు ఎప్పుడూ క్రైమ్ కథలు చెబుతుండేవారు. కానీ ఆయన చెప్పిన ఓ పాయింట్‌, దానిపై కథ నాకు నచ్చింది. కానీ మా గ్రూపులో మాత్రం ఎవ్వరూ నమ్మలేదు. ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా ఆయన తన ఫాదర్ ఫీలింగ్‌ను పేపర్ మీద పెట్టారని అనిపించింది. ఆ కథను నిమ్మకాయల ప్రసాద్ విని ఎగ్జైట్ అయ్యారు. మేం చెప్పిన మార్పులు, చేర్పులతో ఆ కథను మాకు సుబ్బు ఇచ్చేశాడు. అప్పటికే సాయి బాధల్లో ఉన్నాడు. అందుకే పిలిచి ఈ కథను ఇచ్చాను. సాయి కుమార్ విజువల్స్, విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ చాలా బాగుంటాయి. మదర్ కారెక్టర్‌లో వాసుకి జీవించారు. వాసుకి, నరేష్ చేసిన పర్ఫామెన్స్ చూసి డిస్ట్రిబ్యూటర్‌లు ఎమోషనల్ అయ్యారంటే వారిద్దరూ ఎలా జీవించారో అర్థం చేసుకోవచ్చు. ఒరిస్సా నుంచి వచ్చిన నీలఖి అద్భుతంగా నటించింది. సినిమా చూసిన తర్వాత హీరో హీరోయిన్లు ప్రతీ ఒక్కరికీ గుర్తుండిపోతారు. ఈ సినిమాలో దమ్ముంది కాబట్టే.. ఈ రోజు ఇక్కడ మేం ఇలా ఎక్కువగా మాట్లాడుతున్నాం. తల్లిదండ్రులందరూ చూడాల్సిన సినిమా. సెప్టెంబర్ నెల బాగా కలిసి వస్తోంది. ప్రస్తుతం ‘లిటిల్ హార్ట్స్’ బాగా ఆడుతోంది.. ‘మిరాయ్’ హిట్ అయింది.. ఇప్పుడు ‘బ్యూటీ’ వస్తోంది. రాబోయే ‘ఓజీ’ ఎలా ఉండోబోతోందో నాకు తెలుసు. ఈ మధ్యలో ‘బ్యూటీ’ని కూడా చూసేయండి. ఆడపిల్లల గురించి పవర్ స్టార్ చెప్పిన మాటలతో, యథార్ఘ సంఘటనలతో ‘బ్యూటీ’ కథను రాశారు. సెప్టెంబర్ 19న థియేటర్లోకి వస్తోంది.. అందరూ ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను.

Also Read- Ram Gopal Varma: ‘మిరాయ్’పై మరో ట్వీట్.. వర్మకి టాపిక్ దొరికిందోచ్!

పేరెంట్స్ పడే మథనం గురించి..

ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ నెలలో వచ్చిన ‘లిటిల్ హార్ట్స్’, ‘మిరాయ్’, ‘కిష్కింధపురి’ చాలా బాగా ఆడుతున్నాయి. తర్వాత ‘బ్యూటీ’ వస్తుంది.. ఆపై తుఫాన్ ‘ఓజీ’ వస్తుంది. మామూలు టికెట్ రేట్లతో సినిమాలు వస్తే జనాలు థియేటర్లకు వస్తున్నారని సినీ పెద్దలు ఇప్పటికైనా గుర్తించాలి. ‘బ్యూటీ’ కథ నాకు చాలా ఇష్టం. జర్నలిస్ట్‌గా సుబ్బు మా గ్రూపులో చాలా యాక్టివ్‌గా ఉండేవారు. ఆయనలాంటి వారు ‘బ్యూటీ’ లాంటి కథను చెప్పడంతో ఆశ్చర్యపోయాను. ఈ ‘బ్యూటీ’ కథ నా మనసుకి హత్తుకుంది. ప్రొడ్యూసర్స్ అంతా కూడా క్యాస్ట్ గురించి చూస్తారు.. కానీ ఆయన మాత్రం కంటెంట్‌లో టేస్ట్ చూస్తారు. పిల్లలు అడిగిందల్లా కొనివ్వలేని పేరెంట్స్ పడే మథనం గురించి అద్భుతంగా చూపించారు. ఇప్పుడు అసిస్టెంట్‌గా పని చేసిన వారు నెక్ట్స్ సినిమాకి డైరెక్టర్ అవ్వాలని అనుకునే వారిలో మారుతి, సుకుమార్ ముందుంటారు. సెప్టెంబర్ 19న ‘బ్యూటీ’ చిత్రం రాబోతోంది. 18న పెయిడ్ ప్రీమియర్లు వేస్తున్నారు. అమీర్ పేట్‌ AAA లో నేను ఫ్రీ షో వేయిస్తాను. ఓ అమ్మాయి.. తన ఫ్యామిలీతో కలిసి వచ్చి ఆ షోని చూడొచ్చని చెప్పారు.

‘తిమ్మరుసు’, ‘ఆయ్’లో చేసింది నువ్వేనా?

హీరో అంకిత్ కొయ్య మాట్లాడుతూ.. వర్దన్‌కు దర్శకుడు మారుతి రెండో అవకాశం ఇచ్చారు. సక్సెస్ లేనప్పుడు కూడా మారుతి లాంటి వారు వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తారనడానికి ఇదే ఎగ్జాంపుల్. నన్ను నమ్మి నాకు ఇంత మంచి సినిమాను ఇచ్చిన ఆయనకు థాంక్స్. ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ థియేటర్‌ విజిట్‌కు వెళ్తే.. ‘తిమ్మరుసు’, ‘ఆయ్’లో చేసింది నువ్వేనా? అని అడిగారు. మంచి చిత్రాలు చేస్తున్నావ్ అంటూ ఓ పెద్దాయన అన్న మాటలు నాలో ఎంతో స్పూర్తిని నింపాయి. మంచి పాత్రలు, మంచి చిత్రాలు చేసుకుంటూ వెళ్తే.. ఆడియెన్స్ మనల్ని హీరోని చేస్తారని నాకు అర్థమైంది. ఈ సినిమా ఏ ఒక్కరినీ నిరాశ పర్చదు. సెప్టెంబర్ 19న వస్తున్న ‘బ్యూటీ’ని ఒక్కసారి థియేటర్లకు వచ్చి చూడండి.. నచ్చకపోతే సున్నా రేటింగ్ ఇవ్వండి.. నచ్చితే మాత్రం ప్రమోట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లండని కోరారు.

Also Read- Narendra Modi: నేను శివ భక్తుడిని.. దూషణల విషాన్ని కూడా తాగగలను: ప్రధాని మోదీ

నాకు డెమీ గాడ్

డైరెక్టర్ జె.ఎస్.ఎస్. వర్దన్ మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రతీ ఒక్కరినీ సీటులో కూర్చోబెడుతుంది. నాకు రెండో ఛాన్స్ ఇచ్చిన మారుతి.. నాకు డెమీ గాడ్. అలాగే నిమ్మకాయల ప్రసాద్ గురువులాంటి వారు. సుబ్రహ్మణ్యం కథ నాకు చాలా నచ్చింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అని కథ విన్న వెంటనే నిమ్మకాయల ప్రసాద్ ముందుగా నమ్మారు. అందరూ ఈ సినిమా కోసం కష్టపడ్డారు. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సెప్టెంబర్ 19న రాబోతోన్న ‘బ్యూటీ’ అందరికీ నచ్చుతుందని అన్నారు. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల మాట్లాడుతూ.. వందల కోట్లు సంపాదించాలని వానరా సెల్యూలాయిడ్‌ బ్యానర్ స్టాపించలేదు. మంచి చిత్రాల్ని నిర్మించాలని ఇండస్ట్రీలోకి వచ్చాను. నేను తీసిన గత చిత్రం కూడా మంచిదే. ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఆ విషయం అందరికీ తెలిసింది. ‘కన్నమ్మ’ అనేది అంకిత్ పర్సనల్ సాంగ్ కాదు.. అది మా ‘బ్యూటీ’ చిత్రంలోనిది. ఈ మూవీ అందరికీ నచ్చుతుంది. మా కోసం వచ్చిన మారుతి, ఎస్.కే.ఎన్‌లకు థాంక్స్. అందరూ ఈ సినిమా చూడాలని కోరుతున్నానని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర టీమ్ ప్రసంగించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Pawan Kalyan: ప్రకృతితో చెలగటాలు ఆడొద్దు అంటున్న నెటిజన్స్

Huzurabad District: సింగాపూర్‌లో అక్రమ మొరం తవ్వకాలు.. పట్టించుకోని అధికారులు

Vasavi Group: ఓ పక్క ఐటీ దాడులు.. హైడ్రా భయంతో వాసవి గ్రూప్ ఉక్కిరిబిక్కిరి!

BJP Telangana: బీజేపీలో రగులుతున్న అంతర్గత కుమ్ములాట.. మళ్లీ మొదలైన పాత కొత్త నేతల లొల్లి

Army Veterans: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సర్కారు ఆసుపత్రుల్లో ఆర్మీ జవాన్లు