Little Hearts: చిన్న సినిమాగా థియేటర్లలోకి వచ్చిన ‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts) చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం నిర్మాణానికి రూ. 2.5 కోట్ల ఖర్చు, ప్రమోషన్స్‌కు రూ. 1.5 కోట్ల ఖర్చు.. మొత్తంగా రూ. 4 కోట్లు అయినట్లుగా.. ఇటీవల ఓ వేడుకలో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేసిన నిర్మాతలలో ఒకరైన బన్నీ వాసు (Bunny Vas) తెలిపారు. హీరో మౌళి (Mouli Tanuj) కూడా.. ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. మొదటి రోజే, సినిమా పెట్టుబడిని మించి కలెక్షన్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందని పబ్లిగ్గా చెప్పారు. ఈ సినిమాతో పాటు అదే రోజు రెండు పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. అనుష్క ‘ఘాటి’, శివకార్తికేయన్ ‘మదరాసి’ చిత్రాలతో పోటీగా వచ్చిన ‘లిటిల్ హార్ట్స్’కు ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. ఆ రెండు సినిమాలకు ఆశించినంతగా పాజిటివ్ టాక్ రాలేదు. దీంతో అంతా ‘లిటిల్ హార్ట్స్’పై పడ్డారు. అంతే రికార్డ్ స్థాయిలో ఈ సినిమాకు కలెక్షన్లు వచ్చాయి.
Also Read- OG Movie: ‘గన్స్ ఎన్ రోజెస్’ సాంగ్ వచ్చేసింది.. నో డౌట్, థమన్ రెడ్ బుల్ ఏసే ఉంటాడు!
పాజిటివ్ రియాక్షన్స్..
ఆఫ్‌కోర్స్.. సినిమాలో దమ్మున్న కంటెంట్ ఉంది కాబట్టే.. అంతా ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు వస్తున్నారు. మరోవైపు ఈ సినిమాపై సెలబ్రిటీలు పోస్ట్‌లు కూడా.. ప్రేక్షకులను థియేటర్ల వైపుకు నడిపించాయని చెప్పుకోవాలి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. సినిమా చూసిన సెలబ్రిటీలందరూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ.. టీమ్‌ను అభినందించారు. అల్లు అర్జున్, రవితేజ, విజయ్ దేవరకొండ.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది స్టార్స్.. ఈ సినిమాపై రియాక్ట్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే, ఈ మధ్యకాలంలో స్టార్స్ ఇంతగా రియాక్ట్ అయిన సినిమా రాలేదనే చెప్పుకోవాలి. ఇక విషయానికి వస్తే.. తాజాగా ఈ సినిమా ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసిందో.. చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 32.15 కోట్ల గ్రాస్ కలెక్ట్ (Little Hearts Collections) చేసినట్లుగా మేకర్స్ తెలిపారు. ఈ కలెక్షన్స్‌తో చిత్రయూనిట్ మొత్తం చాలా హ్యాపీగా ఉందని, ఇంకా కలెక్షన్స్ స్టడీగానే ఉన్నాయని.. టీమ్ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
Also Read- Mirai Movie: ఒక టికెట్ కొంటే ఇంకోటి ఫ్రీ.. ‘మిరాయ్’ మేకర్స్ సంచలన నిర్ణయం
కలెక్షన్స్ డ్రాప్..
వాస్తవానికి ఈ వారం ఈ సినిమా కలెక్షన్లు తగ్గాయి. ‘మిరాయ్’, ‘కిష్కింధపురి’ రూపంలో మరో రెండు హిట్స్ పడటంతో.. ‘లిటిల్ హార్ట్స్’ చిత్రానికి కలెక్షన్ల కొద్దిగా డ్రాప్ అయ్యాయి. లేదంటే కచ్చితంగా ఈ సినిమా రూ. 50 కోట్ల క్లబ్‌లోకి చేరేదని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ప్రస్తుతం ‘మిరాయ్’ మేనియా నడుస్తున్న విషయం తెలిసిందే. మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన ‘లిటిల్ హార్ట్స్’ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ తెరకెక్కించారు. ‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ సినిమాను నిర్మించారు. బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేశారు. రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్ తదితరులు ఇతర పాత్రలలో నటించారు.
32Cr🔥🔥🔥
Thanks a lot❤️💥 pic.twitter.com/pkhcnsaK1V— Mouli Talks (@Mouli_Talks) September 15, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు