OG Movie Song Still
ఎంటర్‌టైన్మెంట్

OG Movie: ‘గన్స్ ఎన్ రోజెస్’ సాంగ్ వచ్చేసింది.. నో డౌట్, థమన్ రెడ్‌ బుల్ ఏసే ఉంటాడు!

OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) నటించిన ‘ఓజీ’ మూవీ (OG Movie) విడుదల దగ్గర పడుతున్న కొద్ది.. ఫ్యాన్స్‌లో టెన్షన్ పెరిగిపోతోంది. థియేటర్లలో ఈసారి శవాలు లేవడం పక్కా, దయచేసి ఈ సినిమా విడుదల కాకుండా చూడండి.. లేదంటే చాలా శవాలు లేస్తాయి అంటూ.. సినిమాపై ఉన్న హైప్‌ని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వాళ్లు అంటున్నారని కాదు కానీ, నిజంగానే ఈ సినిమాపై అలాంటి హైపే ఉంది. ఈ చిన్న ప్రమోషనల్ కంటెంట్ వచ్చినా, ట్రెండ్‌ని బద్దలు కొడుతోంది. రెండు రోజలు క్రితం ‘ఓజీ’ చిత్రం నుండి విడుదలైన ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. సెలబ్రిటీలే చేస్తున్నారు కానీ, మేకర్స్ ఇంత వరకు ఎలాంటి ప్రమోషన్స్ చేయడం లేదనే నిరాశలో ఉన్న ఫ్యాన్స్ అందరికీ ఫుల్ ట్రీట్ ఇచ్చేలా.. రెండు రోజుల నుంచి మేకర్స్ ఏదో ఒక అప్డేట్ వదులుతూనే ఉన్నారు. మరోవైపు ఓవర్సీస్‌లో ఈ సినిమా ప్రీ సేల్స్ రికార్డుల అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఇలా ఏదో రకంగా ఈ సినిమా వార్తలలో ఉంటూనే ఉంది. ఇక సోమవారం ఈ చిత్రం నుంచి మరో సాంగ్‌ని మేకర్స్ వదిలారు. ఈ సాంగ్ విన్న వారంతా థమన్‌‌పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- Bigg Boss Telugu 9: రెండో వారం నామినేషన్స్ రచ్చ రచ్చ.. ప్రోమో వచ్చేసింది!

ఒకటి కాదు రెండు మూడు రెడ్ బుల్స్ ఏసే ఉంటాడు

‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ తుఫాను నుంచి అభిమానులు ఇంకా బయటకు రాకముందే.. ‘గన్స్ ఎన్ రోజెస్’ (Guns N Roses) అనే మరో సంచలన సాంగ్‌ని ‘ఓజీ’ చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. తిరిగి వచ్చింది. ఈ సాంగ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనాలను సృష్టిస్తోంది. సంగీత సంచలనం థమన్ ఎస్ స్వరపరిచిన ఈ పాట, శ్రోతలను ‘ఓజీ’ యాక్షన్-ప్యాక్డ్ ప్రపంచంలోకి లోతుగా తీసుకెళుతుంది. తనదైన స్వరకల్పనతో మరో అగ్ని తుఫానుని థమన్ (S Thaman) సృష్టించారు. ఉరుములను తలపించే బీట్స్, పదునైన అమరికలతో మలిచిన ‘గన్స్ ఎన్ రోజెస్’ సాంగ్.. చిత్ర కథలోని తీవ్రతని, స్థాయిని తెలియజేస్తుంది. ముఖ్యంగా ఈ పాటను కంపోజ్ చేసిన తీరు, వాడిన పరికరాలు అన్నీ కూడా కొత్త సౌండింగ్‌ని పరిచయం చేస్తున్నాయి. ఈ పాట విన్న తర్వాత అంతా ఏమంటున్నారంటే.. డౌటే లేదు.. థమన్ ఒకటి కాదు రెండు మూడు రెడ్ బుల్స్ ఏసే ఉంటాడని, సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియా షేక్ చేస్తూ.. టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Also Read- Jayammu Nichayammu Raa: డాడీ అని పిలిచిన తేజ సజ్జా.. ఫీలైన జగ్గూ భాయ్.. వీడియో వైరల్!

మరో పది రోజుల్లో థియేటర్లలో ‘ఓజీ’ తుఫాను

‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’‌కి వచ్చిన అద్భుతమైన స్పందన తర్వాత వచ్చిన ఈ ‘గన్స్ ఎన్ రోజెస్’ సాంగ్.. సినిమాపై ఉన్న అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్ళింది. ఇది కేవలం పాట కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోషించిన శక్తివంతమైన పాత్ర గంభీర యొక్క క్రూరమైన ప్రపంచం, అతని చుట్టూ ఉన్న ప్రమాదకరమైన శక్తులను పరిచయం చేసే గ్లింప్స్ అని చెప్పుకోవచ్చు. మరో పది రోజుల్లో థియేటర్లలోకి ‘ఓజీ’ తుఫాను రానుండటంతో, ఇకపై వచ్చే ప్రమోషనల్ కంటెంట్, ముఖ్యంగా ట్రైలర్ ఏ స్థాయిలో ఉంటుందో? ట్రైలర్ విడుదల తర్వాత, ఫ్యాన్స్ అసలు భూమి మీద ఉంటారో? లేదో? అనేలా ఈ సినిమా గురించి అప్పుడే చర్చలు మొదలయ్యాయి. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్ర ట్రైలర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారని తెలుస్తోంది. అలాగే ప్రీ రిలీజ్ వేడుకను కూడా ఓ రేంజ్‌లో ఏర్పాటు చేయబోతున్నట్లుగా టాక్ వినబడుతోంది. దర్శకుడు సుజీత్ ఈ సినిమాను ఒక సినిమాటిక్ తుఫానుగా తెరకెక్కిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి వంటి అద్భుతమైన తారాగణం నటిస్తోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Harish Rao: లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టే ధైర్యం ప్రభుత్వానికి లేదా: హరీష్ రావు

Ramachandra Rao: ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం.. అలైన్ మెంట్ మార్చాలంటూ రైతులు డిమాండ్!

H-City Project: ముందుకు సాగని హెచ్ సిటీ పనులు.. ఎందుకో తెలుసా..!

Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..

OG Concert: ‘ఓజీ’ సినిమాలో హీరో తాను కాదంటూ బాంబ్ పేల్చిన పవన్.. ఇంతకూ వారు ఎవరంటే?