Crime News: ఒత్తిడి తేవడంతోనే బీటెక్​ విద్యార్థిని ఆత్మహత్య!
Crime News (imagecredit:swetcha)
క్రైమ్

Crime News: పెళ్లి కోసం ఒత్తిడి తేవడంతోనే బీటెక్​ విద్యార్థిని ఆత్మహత్య!

Crime News: అసలు స్వరూపం తెలిసి పెళ్లికి నిరాకరించిందని మాజీ ప్రియుడు పెడుతున్న వేధింపులు భరించలేక బీటెక్​ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదం మీర్ పేట పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. ఇన్స్​ పెక్టర్​ శంకర్ నాయక్​ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అల్మాస్​ గూడ వాస్తవ్యులైన రూప, అశోక్‌లు భార్యాభర్తలు. వీరి కూతురు విహారిక (20) అబ్దుల్లాపూర్ మెట్​‌లోని విజ్ఞాన్​ ఇంజనీరింగ్ కాలేజీ(Vignan Engineering College)లో బీటెక్​ మూడో సంవత్సరం విద్యార్థిని. ఇదిలా ఉండగా అల్మాస్ గూడ రాజీవ్ గృహ కల్ప ప్రాంత వాస్తవ్యుడు, డెకరేషన్ వర్కర్​ అయిన కిశోర్​ (32) కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ విహారిక వెంట పడ్డాడు.

Also Read: Congress Rebels: కాంగ్రెస్ రెబల్స్‌కు లబ్ డబ్.. క్షేత్రస్థాయిలో గందరగోళం!

అభ్యంతరకర భాషలో..

నువ్వు లేనిదే బతకలేనంటూ నమ్మించి ఆమెను ట్రాప్​ చేశాడు. పెళ్లికి కూడా ఒప్పించాడు. ఇదే విషయాన్ని విహారిక తల్లిదండ్రులతో చెప్పింది. ఒక్కగానొక్క కూతురు కావటంతో రూప(Rupa), అశోక్(Ashock)లు ప్రేమ వివాహానికి అంగీకరించారు. అయితే, ఆ తరువాత కిశోర్(Kishore)​ అసలు స్వరూపం విహారికకు తెలిసిపోయింది. దాంతో అతనితో పెళ్లికి నిరాకరించిన విహారిక మాట్లాడటం కూడా మానేసింది. దాంతో కిశోర్ తనను వివాహం చేసుకోవాలని, లేనిపక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని విహారికతోపాటు ఆమె తల్లిదండ్రులను బెదిరించటం మొదలు పెట్టాడు. అభ్యంతరకర భాషలో విహారిక(Viharika) ఫోన్​ కు మెసేజీలు పెడుతూ వస్తున్నాడు. దాంతో మానసికంగా కుంగిపోయిన విహారిక ఆదివారం రాత్రి తన బెడ్ రూంలో చున్నీతో సీలింగ్ ఫ్యాన్​ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కిశోర్​ వేధింపుల కారణంగానే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందంటూ విహారిక తల్లిదండ్రుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: VC Sajjanar: ఫోన్​ ట్యాపింగ్​ కేసులో కీలక పరిణామం.. స్వయంగా ప్రశ్నించనున్న సీపీ సజ్జనార్​!

Just In

01

Crime News: ఆర్టీసీ సిబ్బందిని టార్గెట్ చేస్తున్న మోస్ట్ వాంటెడ్​ క్రిమినల్ అరెస్ట్..!

Tanuja Interview: దానికోసం ఎప్పుడూ పనిచేయలేదు.. బిగ్‌బాస్ రన్నర్ తనూజ..

Gold Rates: మహిళలకు షాకింగ్ న్యూస్.. అతి భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్!

BJP Telangana: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ హైకోర్టులో పిటిషన్..!

Vivo Smartphones 2026: 2026లో వివో ప్రభంజనం.. మార్కెట్‌లోకి రాబోతున్న.. టాప్ మెుబైల్స్ ఇవే!