Congress Rebels: కాంగ్రెస్ రెబల్స్‌కు లబ్ డబ్.. ఎందుకంటే?
Revanth-Reddy (Image source Twitter)
Telangana News, లేటెస్ట్ న్యూస్

Congress Rebels: కాంగ్రెస్ రెబల్స్‌కు లబ్ డబ్.. క్షేత్రస్థాయిలో గందరగోళం!

Congress Rebels: సీఎం ఆగ్రహం తర్వాత ఆయా నేతల్లో టెన్షన్

సస్పెన్షన్ తప్పదని హింట్
ఇతర పార్టీలోనూ ఆప్షన్ లేక సతమతం
కాంగ్రెస్ క్షేత్రస్థాయి లీడర్లలో గందరగోళం

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నిర్ణయం, క్రమశిక్షణను ధిక్కరించి, సొంత అజెండాతో ముందుకు వెళ్లిన ‘రెబల్’ నాయకుల గుండెల్లో (Congress Rebels) ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. నిన్నటి వరకు ధిక్కార స్వరం వినిపించిన నేతలు.. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్‌తో ఒక్కసారిగా డిఫెన్స్‌లో పడ్డారు. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ లైన్ దాటి వ్యవహరించిన వారిపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.పార్టీ కంటే ఎవరూ ఎక్కువ కాదు.. గీత దాటితే వేటు తప్పదు” అని ఆయన అంతర్గత సమావేశాల్లో సంకేతాలివ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో ఇప్పటి వరకు తమకు ఎదురులేదని భావించిన కొందరు కాంగ్రెస్ రెబల్ నేతల్లో వణుకు మొదలైంది. ఏ క్షణమైనా సస్పెన్షన్ ఆర్డర్స్ వస్తాయన్న హింట్‌తో వారిలో టెన్షన్ పీక్స్‌కు చేరింది.పైగా రెబల్స్ పరిస్థితి ఇప్పుడు ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’లా మారింది. పార్టీపై తిరుగుబాటు జెండా ఊపినప్పటికీ, ప్రత్యామ్నాయం వెతుక్కుందామంటే ఇతర పార్టీల్లోనూ పరిస్థితులు ఏమాత్రం ఆశాజనకంగా లేవనేది వాళ్లకూ స్పష్టమైంది. దీంతో సర్పంచ్ ఎన్నికల్లో రెబల్స్ గా పోటీ చేసిన లీడర్లకు ఏం చేయాలో? అర్థం కాక అయోమయంలో పడ్డారు.

Read Also- Ganja Smuggling: గంజాయి రవాణాపై స్పెషల్ ఫోకస్ చేసిన ఈగల్ టీమ్.. ఎందుకో తెలుసా?

అక్కడా సేమ్ సీన్…

సీఎం వార్నింగ్ తర్వాత కొందరు బీఆర్ ఎస్ తో టచ్ లోకి వెళ్లినా…ఆ పార్టీ కూడా రెబల్స్ ను చేర్చుకునేందుకు ఆసక్తి చూపడం లేదనేది తెలుస్తుంది. మరి కొందరు బీఆర్ ఎస్ ఇప్పటికే బలహీనపడి ఉండటంతో అటు వెళ్లడం రిస్క్ అని భావిస్తున్నారు. బీజేపీలోనూ ఇదే సిచ్వేషన్. దీంతో అనవసరంగా రెబల్ గా పోటీ చేశామా? అని కూడా కొందరు నేతలు డైలమాలో పడ్డారు. పైగా ఇండిపెండెంట్లుగా తమ సత్తా చాటేందుకు కొందరు నేతలు భారీ స్థాయిలో ఖర్చు పెట్టారు. రెబల్స్ గా పోటీ చేసి ఓడిపోయి, ఖర్చులు తడిచిపోవడంతో ఆయా లీడర్ల మానసిక పరిస్థితి కూడా గందరగోళంగానే ఉన్నది. కాంగ్రెస్ మాత్రం తప్పనిసరిగా వేటు చేయాలని ముందుకు సాగుతున్నది.

Read Also- KCR BRS LP: రాబోయేది మనమే.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు.. సాయంత్రం 6 గంటలకు ప్రెస్‌మీట్

​హైకమాండ్ నజర్.. నెక్స్ట్ ఏంటి?

​రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అధిష్టానం గమనిస్తోంది. క్రమశిక్షణ విషయంలో రాజీ పడొద్దని ఇప్పటికే పీసీసీకి క్లియర్ కట్ ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్రమశిక్షణ అతి ముఖ్యం. ధిక్కార స్వరాన్ని సహిస్తే అది మిగిలిన వారికి తప్పుడు సంకేతం పంపినట్లవుతుందని స్వయంగా సీఎం వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్ రెబల్స్ పై వేటు తప్పనిసరి అనే ప్రచారం బలంగా జరుగుతుంది. పైగా కాంగ్రెస్ మద్ధతుతో గెలిచిన సర్పంచ్ లు కూడా రెబల్స్ పై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ పీసీసీపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే రెబల్స్ లిస్టు గాంధీభవన్ కు చేరింది.క్రమ శిక్షణ కమిటీ డిస్కషన్ అనంతరం చర్యలు ప్రారంభం కానున్నాయి.

Just In

01

Anil Ravipudi: ‘AI’ ని ఇలా పద్ధతిగా కూడా వాడుకోవచ్చు.. అనిల్ రావిపూడి పోస్ట్ వైరల్!

Kiara Advani: ‘టాక్సిక్‌’లో కియారా అద్వానీ.. రాకింగ్ ఫస్ట్ లుక్ చూశారా!

Bigg Boss Telugu 9: విన్నర్ ప్రైజ్ మనీ ఎంతంటే? తనూజ రాంగ్ డెసిషన్!

Congress Rebels: కాంగ్రెస్ రెబల్స్‌కు లబ్ డబ్.. క్షేత్రస్థాయిలో గందరగోళం!

Constable Incident: పోలీసుల ప్రాణాల మీదకు తెస్తున్న బెట్టింగ్ యాప్‌లు!