Water Crisis: ముదిగొండ మండల పరిధిలోనీ ముత్తారం గ్రామ పంచాయతి లో స్పెషల్ ఆఫీసర్,సెక్రెటరీ నిర్లక్ష్యంతో కనీసం ఇండ్లలోకి వదలని నీళ్లు, ఐదు రోజుల నుండి నీళ్లు లేక అవస్థలు పడుతున్న గ్రామ ప్రజలు, మిషన్ భగీరథ నీళ్లు(Mission Bhagiratha Water) అందుబాటులో ఉన్నా పంచాయతీ సిబ్బందితో ఇండ్లలోకి నీళ్లు పంపడంలో నిర్లక్ష్య వైఖరి కనబరుస్తున్నారని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఒక వ్యక్తి నీళ్ల బాధలకు తట్టుకోలేక డాబాపై వృధాగా పోయే వర్షపు నీటీనీ పైపులు పరిచి తన ఇంటి హౌస్ లోకి నీళ్లను మళ్లించుకుంటున్నాడు.
Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ
ప్రజలు అవస్థలు
ఇన్ని బాధలు పడుతున్న గ్రామ ప్రజల ఇబ్బందులను పట్టించుకునే నాధుడేలేడని గ్రామ ప్రజలు వాపోతున్నారు. అంతేకాకుండా గ్రామపంచాయతీ పరిధిలో విపరీతమైన దోమలు,పారిశుద్ధ్య అశుభ్రతతో ముత్తారం గ్రామ ప్రజలు అవస్థలు పడుతున్న అధికారులు గాని, నాయకులు గాని,చొరవ తీసుకొనే సమస్య లేకపాయే, రోడ్లపై వర్షపు నీరు ఆగి ఆ నీళ్లలోనే రాకపోకలు కొనసాగిస్తున్న దానిపై ప్రజలు సెక్రెటరీ దృష్టికి గత వారం క్రితం తీసుకువెళ్లిన దానిని గాలికి వదిలేసిన అధికారి, ఇకనైనా సమస్యల వలయంలో ఉన్న ముత్తారాన్ని కొలిక్కి తీసుకొచ్చే విధంగా అధికారులు దృష్టి సారించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
Also Read: Jogulamba Gadwal: గద్వాల జిల్లాలో ప్రైవేట్ స్కూల్‌ల దుర్మార్గాలు.. ఫీజుల కోసం విద్యార్థులపై దాడులు