Jogulamba Gadwal: గద్వాలలో ఫీజుల కోసం విద్యార్థులపై దాడులు
Jogulamba Gadwal (IAMGE credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Jogulamba Gadwal: గద్వాల జిల్లాలో ప్రైవేట్ స్కూల్‌ల దుర్మార్గాలు.. ఫీజుల కోసం విద్యార్థులపై దాడులు

Jogulamba Gadwal: జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండల కేంద్రంలోని ప్రైవేటు శ్రీ కృష్ణవేణి హై స్కూల్లో(Sri Krishnaveni High School) అక్రమ కోచింగ్ లో పేరుతో వ్యాపారం చేస్తూ పాఠశాలను నిర్వహిస్తూ ఫీజుల పేరుతో చరణ్ తేజ(Charan Teja) అనే విద్యార్థిని తీవ్రంగా చితకబాదిన ఘటన పైన విద్యార్థి సంఘాలతో కలిసి స్కూల్ ఆవరణ లో నిరసన తెలపడం జరిగింది. ఇది రెండోసారి గతంలో కూడా రెండవ తరగతి చదువుతున్న విరాట్ శంకర్ నాయక్ అనే విద్యార్థిని కూడా తీవ్రంగా చితకబాదిన ఘటన ఉంది. తక్షణమే మండల ఎంఈఓని ఆ స్కూల్ యజమాని పైన ఎఫ్ఐఆర్ బుక్ చేసి చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకొని ఆ స్కూలు యొక్క గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరిగిందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

Also Read: Gadwal district Rains: గద్వాల జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజల ఆవస్థలు

ఎంఈఓ ముందే నా బిడ్డను ఎలా చిత్రహింసలు పెడుతున్నాడో మధుసూదన్ రెడ్డి(Madhusudhan Reddy) అని ఒక పేరెంటు తన బాధను వెళ్ళగక్కడం చాలా బాధాకరమైన ఘటన. ఈ సందర్బంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ఐజ కృష్ణవేణి ప్రైవేట్ హై స్కూల్(Private High School)లో దారుణనన్నారు. కోచింగ్ ల పేరుతో భారీగా దోపిడికి పాల్పడుతున్న కృష్ణవేణి ప్రైవేట్ స్కూల్(Krishnaveni Private School) యజమానిపై చర్యలు తీసుకోవాలన్నారు.   కృష్ణవేణి హై స్కూల్లో ఫీజుల పేరు తో చరణ్ తేజ(Charan Teja) అనే విద్యార్థిని గోరంగా యాజమాన్యం కొట్టడం చట్టరీత్య నేరమన్నారు.

కృష్ణా వేణి స్కూల్లో(Krishnaveni Private School) నవోదయ కోచింగ్ సెంటర్ పేరుతో యాజమాన్యం అక్రమంగా నడుపుతూ చరణ్ తేజ్(Charan Teja) s/o వెంకటేశ్ అనే విద్యార్థి ని ఇష్టం వచ్చినట్టు నెత్తిపై గుడిప కట్టే విధంగా వీపుపై వాతలు పడే విధంగా మరియు కాళ్లపై కొట్టాడు తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు.  గతంలో కూడా విద్యార్థిని చితకబాదినటువంటి ఘటన జరిగింది. అయినా తీరు మార్చుకోకుండా విద్యార్థులను వేధింపులకు గురి చేయడం దుర్మార్గం. ఐజ కృష్ణవేణి ప్రైవేట్ స్కూల్(Private High School) కేవలం విద్యను వ్యాపారంగా మార్చుకొని నాసిరకం విద్యను అందిస్తూ పర్మిషన్లు లేకుండా నవోదయ కోచింగ్ పేరుతో భారీ దోపిడీకి తెర లేపడం దుర్మార్గం అనిమండిపడ్డారు.  అధికారులకు పలుమార్లు విన్నవించిన కూడా ఆ స్కూల్ పైన చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గం అందుకే తక్షణమే ఎంఈఓ కు డీఈఓ కు కలెక్టర్ గారికి కూడా డిమాండ్ చేస్తున్నాం తక్షణమే కఠినమైన చర్యలు తీసుకొని ఆ కూలీలకు గుర్తింపు రద్దు చేయాలని వాఖ్యనించారు.

జిల్లాలో ప్రైవేటు స్కూళ్ల(‘Private schools) దోపిడీ రోజురోజుకు పెరిగి పోతు మరియు విద్యార్థులను బస్సుల పేర్లతో చంపుతూ, ఫీజుల పేర్లతో అడ్డమైన కోచింగ్ ల పేర్లతో విద్యార్థులను చిత్రహింసలను పెడుతూ పర్మిషన్ లేకుండా కూడా భారీ దోపిడీకి పాల్పడుతూ విద్యను నాశనం చేసే పరిస్థితి ఉండడం దుర్మార్గమని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు .

ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు

BRSV రాష్ట్ర నాయకులు జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District) కోఆర్డినేటర్ కురువ పల్లయ్య, PDSU జిల్లా అధ్యక్షులు హాలీం పాషా, పివైఎల్ జిల్లా అధ్యక్షులు బీరెల్లి దానయ్య, యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి వామనపల్లి రంగస్వామి, బీఆర్ఎస్వి టౌన్ మాజీ ప్రెసిడెంట్ కె.వీరేష్, PDSU జిల్లా నాయకులు సూర్య, అరవింద్, క్రాంతికుమార్,తదితరులు పాల్గొన్నారు.

 Also Read: Urea Shortage: తొర్రూరులో యూరియా కోసం.. కాళ్లు పట్టుకున్న రైతులు

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు