Urea Shortage( image CREDIT: SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

Urea Shortage: తొర్రూరులో యూరియా కోసం.. కాళ్లు పట్టుకున్న రైతులు

Urea Shortage: వానాకాలం పంటల కోసం అత్యవసరమైన యూరియా(Urea)ఎరువు కోసం రైతులు(Farmers)తొర్రూరులో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  తెల్లవారుజామునే అమ్మపురం రోడ్డులోని పిఎసిఎస్ భవనం ఎదుట రైతులు(Farmers) క్యూ కట్టారు. గంటల తరబడి ఎదురు చూసినా… ఒక్కో బస్తా కూడా దొరకని పరిస్థితి. రెండు బస్తాలు యూరియా తీసుకోవాలంటే నానో లింక్ తప్పనిసరి అని పెట్టిన నిబంధన రైతుల(Farmers) ఆగ్రహానికి కారణమైంది.

 Also Read:Independence Day: తొర్రూరులో స్వాతంత్ర్య దినోత్సవం రోజే జాతీయ జెండాకు అవమానం

క బస్తా ఎరువు ఇవ్వండి సార్… అంటూ కాళ్లు పట్టుకున్న రైతులు

ఒక బస్తా ఎరువు ఇవ్వని అంటూ పిఎసిఎస్ అధికారుల కాళ్లు మొక్కుతున్న రైతులు మనసు పెట్టి పంట పండించే రైతు(Farmers) ఎరువు కోసం ఇంత అవమానం పడాలా..? అంటూ అక్కడున్న వారు ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో అందించకపోవడం వల్ల రైతుల(Farmers)కు ఇబ్బందులకు గురవుతున్నారు.

కాంగ్రెస్ పాలనలో రైతుల దుస్థితి

రైతులు(Farmers) మండిపడుతూ…ఉదయం నుండి సాయంత్రం వరకు క్యూల్లో నిలబడి చివరికి రెండు సంచులు మాత్రమే ఇస్తున్నారు. మిగతా అవసరాలు ఎక్కడి నుంచి తీర్చుకోవాలి..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలోనే రైతుల(Farmers)పై ఇంతటి దౌర్జన్యం జరుగుతోందని ఆరోపించారు. ముందుగానే సరిపడా యూరియా (Urea)నిల్వలు చేయకపోవడమే ఈ గందరగోళానికి కారణమని రైతులు (Farmers)విరుచుకుపడ్డారు. పోలీసుల బందోబస్తులో ఎరువులు పంచడం రైతులకు మరింత అవమానం కలిగించిందని స్థానికులు మండిపడ్డారు.

 Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ

Just In

01

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు