Mee Seva New Service: వివిధ అవసరాల నిమిత్తం కుల ధ్రువీకరణ పత్రాన్ని కేవలం కొన్ని నిమిషాలలోనే పొందడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. గతంలో కుల ధ్రువీకరణ పత్రం తీసుకొని మళ్లీ అవసరం ఉన్నప్పుడు తీసుకోవడానికి ప్రస్తుతం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ‘మీ సేవ(Mee Seva) కేంద్రాల్లో ఆధార్ నెంబరు ద్వారా రెండు నిమిషాల్లో తీసుకోవచ్చని ఈడీఎం శివ(Shiva)తెలిపారు. కులం మారదు కనుక అవసరం ఉన్న వారు నేరుగా మీసేవకు వెళ్లి రూ.45 రుసుం చెల్లించి ఆధార్ నెంబరు ద్వారా తీసుకో వచ్చు. ఎస్సీ హిందూ సామాజిక వర్గానికి చెందిన వారికి ఈ విధానం వర్తించదన్నారు.
Also Read: Meeseva: ఈ సర్టిఫికెట్లు జారీ చేయడంలో మీ సేవ కీలకపాత్ర
మీ సేవ’ పరిధిలోకి కొత్త సేవలు: ప్రజలకు
సౌకర్యార్థం ‘మీసేవ ( Mee seva) పరిధిలోకి కొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి. గతంలో ఈ సేవలు ప్రైవేటు సైట్లో అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం వీటిని మీ సేవ పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందులో రెవెన్యూ, అటవీ, సంక్షేమ శాఖలకు సంబంధించిన సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి గ్యాప్ సర్టిఫికేట్, పౌరుని పేరు మార్పు, స్థానికత, మైనార్టీ, క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్, సీనియర్ సిటిజన్ మెయిం టెనెన్స్, మానిటరింగ్, వన్యప్రాణుల దాడిలో పరిహారం, సామిల్, టింబర్ డిపో, తదితర వాటి కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. వీటితో పాటు హిందూ మ్యారేజ్ సర్టిఫికేట్,(Certificate,) నాన్ అగ్రికల్చర్ మార్కెట్ విలువ ధ్రువపత్రం, పాన్ కార్డు సవరణ, ఇసుక బుకింగ్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చినట్లు ఈడీఎం శివ, డి.ఎం సుధాకర్ రెడ్డి తెలిపారు.
Also Read: Auto Drivers Struggle: ఉచిత బస్సు ప్రయాణం.. మహాలక్ష్మితో ఆటో డ్రైవర్లు దివాలా
