Auto Drivers Struggle: మహాలక్ష్మితో ఆటో డ్రైవర్లు దివాలా
Auto Drivers Struggl( IMAGE credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Auto Drivers Struggle: ఉచిత బస్సు ప్రయాణం.. మహాలక్ష్మితో ఆటో డ్రైవర్లు దివాలా

Auto Drivers Struggle: సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు రోడ్డు మార్గంలో బస్సులు, ఆటోలు సేవలందిస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తుండటంతో ఆటోవాలాలు దివాలా తీస్తూ ఉపాధి కోల్పోయారు. ప్రధానంగా గార్ల మండల కేంద్రంలోని పలు ఆటో అడ్డా లోని ఆటో డ్రైవర్ల(Auto drivers)కు ప్రయాణికులు లేకపోవడంతో ఖాళీగానే కాలం గడుపుతున్నారు. మహిళలంతా బస్సుల్లోనే ప్రయాణించడానికి మొగ్గు చూపుతుండడంతో మర్రిగూడెం, పోచారం, సీతంపేట, సత్యనారాయణపురం, డోర్నకల్ తదితర ప్రాంతాలకు వెళ్లే గిరాకీ దొరకక పూట గడవని పరిస్థితి నెలకొందని ఆర్టీసీ ఫుల్ ఆటో నిల్ ఇదేమీ ఖర్మరా మాకు అంటూ ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 Also Read:Mulugu Development: ఫ‌లించిన సీత‌క్క పోరాటం.. ములుగు అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఫ్రీ బస్సు లేనప్పుడు తమ గ్రామాలకు ఆటో అడ్డా లోని ఆటోలలో ప్రయాణించేవారు మహాలక్ష్మి పథకంతో ఉచిత ప్రయాణం కావడంతో 5 కిలోమీటర్ల లోపు ఉన్న గ్రామాలకు వెళ్లేందుకు కూడా మహిళలు ఆర్టీసీ బస్సును వినియోగించుకుంటున్నారు. బస్సు ఎక్కుతున్న మహిళలను చూస్తున్న ఆటోడ్రైవర్లు ఇదేమి ఖర్మరా మాకు అంటూ బిక్క మొహం వేసుకొని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పూట గడవడమే కష్టం

ఆటో డ్రైవర్ ఐలేష్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం(Mahalaxmi Scheme)ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో మా బతుకు చక్రం తిరగబడుతుందని ఆటోలకు గిరాకీ రావడంలేదని ఆటో ప్రయాణాలు చేసే వారు కరువవడంతో ఎంతో కొంత గిరాకీలోనే సీరియల్ ప్రకారం వెళ్తూ వచ్చిన కొంత డబ్బులపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న ఆటో వాళ్లకు పూట గడవడమే కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో తోలి సంపాదించిన వాటితోనే జీవనం సాగిస్తూ అటు ఇంటి కిరాయి కట్టలేక పిల్లల చదువులు బండి మెయింటెనెన్స్ కు డబ్బులు లేక తీవ్ర ఇక్కట్లు పడుతున్నామని కిరాయి ఆటో నడిపే డ్రైవర్లు ఆటోలు(Auto drivers) నడపలేక కూలి పనులకు వెళ్తున్నారని తెలిపారు ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆటో డ్రైవర్ల(Auto drivers) ను ఆదుకోవాలని కోరారు.

Also Read: Gadwal District: ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్యలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు