Thummala Nageswara Rao: ప్రభుత్వ శాఖల వస్త్ర ల ఆర్డర్ లను వారం రోజుల్లో టెస్కోకు అందజేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లో టెస్కో కు వస్త్ర ఆర్డర్ లను ఇవ్వని శాఖలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సచివాలయం లో చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ సంభందిత శాఖల ఉన్నతాధికారులతో సోమవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. టేస్కో సంస్థ కు అన్ని ప్రభుత్వ శాఖల నుంచి వస్త్ర ఆర్డర్ లను వారం రోజుల్లో అందించాలని సూచించారు. 2025- 26 సంవత్సరానికి టెస్కో కు అన్ని ప్రభుత్వ శాఖల నుండి వారం రోజులలో తమకు కావలసిన వస్త్ర ఆర్డర్లు ఇవ్వ వలసినదిగా సూచించారు.
వారం రోజులలో ఆర్డర్లు అందించాలి
అదేవిధముగా వివిధ శాఖలు టెస్కో కి బకాయి పడిన నిధులను వెంటనే చెల్లించాలని కోరారు. 2026- 27 సంవత్సరమునకు కేవలము నాలుగు శాఖల నుండి మాత్రమే ఆర్డర్లు రాగ మిగిలిన శాఖల నుంచి వారం రోజులలో ఆర్డర్లు అందించాలని వివిధ శాఖల అధికారులను కోరారు . వస్త్రాల ఇండెంట్ తో పాటు 50% నిధులను అడ్వాన్సు గా చెల్లించినట్లయితే టెస్కో వస్త్ర ఉత్త్పత్తి ని ప్రారంభించి సకాలములో సప్లై చేయగలదని తెలిపారు.
Also Read: Thummala Nageswara Rao: యూరియా కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వ శాఖలకు సకాలములో వస్త్రములను ఉత్పత్తి చేసి అందించాలని టెస్కో అధికారులకు సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు మరియు సంస్థల నుంచి వస్త్ర కొనుగోలుకు వంద శాతం ఆర్డర్స్ తీసుకుని చేనేత మరియు పవర్ లూమ్ సంఘాలకు వర్క్ ఆర్డర్ ఇచ్చి నేత కార్మికులకు నిరంతరం పని కల్పించే విధంగా ప్రభుత్వమ చర్యలు తీసుకోవాలని జౌళి శాఖా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశములో స్త్రీ శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనిత రామచంద్రన్ ,సెర్ప్ సి ఇఒ దివ్య, సంభందిత శాఖ అధికారులు పాల్గొన్నారు.
Also Read: Thummala Nageswara Rao: యూరియా తగ్గింపుపై దృష్టి పెట్టండి.. అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు!

