Thummala Nageswara Rao: యూరియా తగ్గింపుపై దృష్టి పెట్టండి..
Thummala Nageswara Rao (image credit: swetcha reporter)
Telangana News

Thummala Nageswara Rao: యూరియా తగ్గింపుపై దృష్టి పెట్టండి.. అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు!

Thummala Nageswara Rao: యూరియాను అధికంగా వినియోగించడం వలన కలిగే అనర్థాలను రైతులుకు వివరించి, దాని వినియోగాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో  రబీ ముందస్తు ప్రణాళికపై రాష్ట్ర, జిల్లా వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అధికంగా యూరియా వాడకం వలన జరిగే అనర్థాలను రైతులకు వివరంగా తెలియజేయాలని మంత్రి సూచించారు. దేశంలోనే యూరియాను అధికంగా వినియోగిస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఒకటని గుర్తు చేశారు.

Also Read:Thummala Nageswara Rao: 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రైతులకు అర్థమయ్యేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి

పంట కోత తరువాత అవశేషాలను కాల్చడం వల్ల పర్యావరణ పరంగా, భూమి పరంగా జరిగే పర్యవసానాలు రైతులకు అర్థమయ్యేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ, ఉద్యాన, కో-ఆపరేటివ్ అధికారులు అందరూ ఒక టీమ్‌లాగా కలిసి పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. యూరియా వాడకం నష్టాలను వివరించి, దాని వినియోగం తగ్గించాల్సిన బాధ్యత అధికారులు తీసుకోవాలని, అందుకోసం విస్తృత పర్యటనలు చేసి రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి అన్నారు. ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని విస్తరించాల్సిన అవసరాన్ని మంత్రి మరోసారి గుర్తుచేసి, ఈ దిశగా కృషి చేయాలని సూచించారు.

Also Read: Thummala Nageswara Rao: నేచురల్ ఫార్మింగ్ కు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్య లు

Just In

01

IPL Auction Live Blog: వెంకటేష్ అయ్యర్‌కు రూ.7 కోట్లే.. అన్‌సోల్డ్‌గా మిగిలిన స్టార్ క్రికెటర్లు.. ఐపీఎల్ వేలం లైవ్ అప్‌డేట్స్

Gadwal News: పంచాయతీ పోరులో గొంతు విప్పుతున్న యువగళం.. ఎన్నికల బరిలో నిలిచిన యువత

Upcoming Redmi Phones 2026: 2026లో భారత్‌ మార్కెట్లోకి రానున్న టాప్ 5 రెడ్‌మీ ఫోన్లు..

TTD Board Meeting: టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు.. ప్రతీ భక్తుడు తెలుసుకోవాల్సిందే!

Panchayat Elections: సర్పంచ్ ఎన్నికలో విచిత్రం.. చనిపోయిన వ్యక్తిని.. మెజారిటీతో గెలిపించిన గ్రామస్థులు