Pawan Kalyan: పోలవరం ప్రాజెక్టుకు ఆయన పేరు బావుంటుంది
Pawan-Polavaram (Image source Facebook)
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Pawan Kalyan: పోలవరం ప్రాజెక్టుకు ఆయన పేరు పెడితే బావుంటుంది.. డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములుకు (Potti Sriramulu) తగిన గుర్తింపు, నివాళి అర్పించాలంటే పోలవరం లాంటి ప్రాజెక్టులకు ఆయన పేరు పెడితే బావుంటుందని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే, పొట్టి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్రాలు తెచ్చిన మహానీయుడు అని కొనియాడారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ఆకలితో అలమటించారని గుర్తుచేశారు. పొద్దాక పోలవరం ప్రాజెక్ట్.. పోలవరం ప్రాజెక్టు అంటుంటాం గానీ ఇలాంటి మహానుభావుల పేరుపెడితే మంచిగా ఉంటుందని పేర్కొన్నారు. ఏదో నాలుగైదు మండలాలకు వర్తించేలా కాకుండా, అంతకంటే పెద్దవాటికి పేరు పెట్టాలంటే ప్రాజెక్టులు వంటివాటి గురించి ఆలోచించాలన్నారు. ఇది తన ప్రతిపాదన కాదని, కేవలం వ్యక్తిగత ఉద్దేశమని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి తన ఒక్కడి ఉద్దేశం పనిచేయదని, చాలామంది కూర్చొని, ప్రతినిధులను తీసుకొని మాట్లాడాలన్నారు. ఇది తన లోపల ఉన్న కోరిక అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించారు. మంగళగిరిలో సోమవారం నిర్వహించిన ‘పదవి- బాధ్యత’ సమావేశంలో ఈ మేరకు పవన్ కళ్యాణ్ మాట్లాడారు.

Read Also- Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్ కేసులో దూకుడు పెంచిన సిట్.. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?

త్వరలో మరికొందర్ని నామినేట్ చేస్తాం

‘‘కూటమిలో భాగంగా జనసేన పార్టీకి రాష్ట్రం మొత్తం మీద 3,459 నామినేటెడ్ పదవులు వచ్చాయి. మరికొంతమందిని త్వరలో నామినేట్ చేస్తాం’’ అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ‘‘ మొదట నుంచి క్షేత్రస్థాయిలో పోరాటాలు చేసిన వారికి, పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఇచ్చాం. ఎటువంటి సిఫార్సు లేకుండా పదవులు ఇచ్చాం. పదవి అనేది చిన్నదా? పెద్దదా? అని కాకుండా వచ్చిన పదవిని ప్రజలకు సేవ చేయడానికి, సమస్యలు పరిష్కరించడానికి లభించే గొప్ప అవకాశంగా భావించాలి. ప్రాంతీయ పార్టీలకు జాతీయ దృక్పథం తక్కువగా ఉంటుంది. కేవలం ఎలక్షన్ కోణంలోనే ప్రాంతీయ పార్టీల ఆలోచన విధానం ఉంటుంది. దానికి విభిన్నంగా జాతీయ దృక్పథంతో ఉన్న ప్రాంతీయ పార్టీ ఉండాలని జనసేన పార్టీని స్థాపించాను. యువతకు ఈ పార్టీ వేదిక కావాలని అనుకున్నాను. నేడు మనకు 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ఇంతమంది కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లు ఉన్నారంటే దానికి పవన్ కళ్యాణ్ ఒక్కడే కారణం కాదు. మనందరి భావజాలం, పోరాటశక్తి, పోరాట పటిమ. ఏ పార్టీకి అయినా సమున్నతమైన భావజాలం, సిద్దాంతం ఉండాలి. సరైన ఆలోచన విధానం ఉండాలి. జనసేన పార్టీ ఐడియాలజీ, సిద్దాంతాలు బలమైనవి. పదిమందికి ఉపయోగపడేవి. నేను బతికే భావజాలమే పార్టీకి అన్వయించాను’’ అని పవన్ అన్నారు.

Read Also- Viral Video: బెడ్‌పై ఉన్న పెషెంట్‌ని చితకబాదిన డాక్టర్.. ప్రముఖ హాస్పిటల్‌లో షాకింగ్ ఘటన.. వీడియో ఇదిగో

రెండు మూడు కులాలతో పార్టీని నడపలేం

రెండు మూడు కులాలతో కూర్చొని పార్టీని నడపలేమని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ‘‘అన్ని కులాలు కలిస్తేనే సమాజం. నేను ఏనాడు కులం కోసం పార్టీని పెట్టలేదు. నన్ను కులానికి పరిమితం చేసి మాట్లాడితే బాధగా ఉంటుంది. జనసేన పార్టీ మూల సూత్రాల్లో అంతర్లీనంగా చాలా పెద్ద భావజాలం ఉంది. భావితరాలకు ఉపయోగపడాలనే ఏడు సూత్రాలని ప్రతిపాదించాను. ప్రజాప్రతినిధులు రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేసినపుడు భారతదేశానికి సంబంధించిన ప్రతి సమస్య మన సమస్యే. ఉక్రెయిన్ యుద్ధం వల్ల మనకేంటీ అనుకోవద్దు. దానివల్ల మన యూరియా ధరలు పెరిగిపోతున్నాయి. ప్రతిదీ మనకు అవసరమే. అన్ని తెలిస్తేనే దేని మీద అయినా బలంగా మాట్లాడగలం. భాష, యాస, సంస్కృతిని గౌరవించాలి. వాటిని కాపాడాలి. వీటిని అర్ధం చేసుకోవాలి. దానికోసం నేను నిలబడ్డాను. మీరంతా నా వెంట నిలబడ్డారు. ప్రధానమంత్రి లాంటి వారు మనకు గౌరవం ఇస్తున్నారంటే మన ఆశయ బలం. మన బాధ్యత’’ అని పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ సూచించారు.

Just In

01

Bigg Boss House: గ్రాండ్ ఫినాలే అనంతరం.. బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో చూశారా? వీడియో వైరల్!

Ponguleti Srinivas Reddy: భూభారతి పోర్టల్‌తో అనుసంధానం.. ఒక్క క్లిక్‌తో రైతుల‌కు పూర్తి భూస‌మాచారం!

Jupally Krishna Rao: కేసీఆర్‌ కుటుంబ రాజకీయాలే ఆ పార్టీ పతనానికి కారణం : మంత్రి జూపల్లి కృష్ణారావు

Seethakka: ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకునే బాధ్యత అందరిపై ఉంది : మంత్రి సీతక్క

Nari Nari Naduma Murari: రాజాలా పెంచితే రోజా ముందు.. ‘నారీ నారీ నడుమ మురారి’ టీజర్ ఎలా ఉందంటే?