Mahabubabad district (Image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Mahabubabad district: బాలికల గురుకుల కళాశాలలో.. విద్యార్థుల పట్ల అధికారుల తీవ్ర నిర్లక్ష్యం!

Mahabubabad district: మహబూబాబాద్ జిల్లా, ఇనుగుర్తి మండలంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్థుల(Students) పట్ల తీవ్ర నిర్లక్ష్యం జరుగుతుందని ధర్మ సమాజ్ పార్టీ(Dharma Samaj Party) నాయకుడు వాలెందర్ సతీశ్ ఆరోపించారు. సాయంత్రం 4 గంటలైనా విద్యార్థినులకు భోజనం పెట్టకపోవడంతో ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్లక్ష్యంపై నిరసనగా ఆయన హాస్టల్ గేటు వద్ద ధర్నాకు దిగారు. గతంలో కూడా ఈ సమస్యపై తాను ధర్నా చేశానని, అప్పుడు సిబ్బంది క్షమాపణలు చెప్పి, ఇలా మళ్లీ జరగదని హామీ ఇచ్చారని వాలెందర్ సతీశ్ గుర్తు చేశారు.

 Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ

ఆకలి వేస్తే ఎవరికి చెప్పుకోవాలి.. ?

అయితే, కూడా అదే పరిస్థితి పునరావృతమైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ గేట్లు తాళాలు వేసి ఉండటం వల్ల పిల్లలు బయటకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారని, ఆకలి వేస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల ఆరోగ్యానికి గ్యాస్ ఫామ్ అయ్యే ప్రమాదం ఉందని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. హాస్టల్‌లో అధిక శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉన్నారని, అగ్ర కులానికి చెందిన ప్రిన్సిపాల్ వారి పట్ల కుల వివక్ష, నిర్లక్ష్యం చూపుతున్నారని ఆరోపించారు. హాస్టల్‌లో సరైన వసతులు లేకపోవడంపై కూడా ఆయన ప్రస్తావించారు. ఈ సమస్యలన్నింటికీ ప్రిన్సిపాల్‌ నిర్లక్ష్యమే కారణమని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పిల్లలకు సరైన వసతులు కల్పించి, సమయానికి భోజనం పెట్టేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

 Also Read:Jogulamba Gadwal district: గద్వాల జిల్లాలో అధ్వానంగా మారిన రోడ్లు.. పట్టించుకోని ప్రజాప్రతినిధులు అధికారులు

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?