Manikrao Kokate: మాజీ మహారాష్ట్ర మంత్రి మాణిక్‌రావ్ కోకాటేపై మోసం, నకిలీ పత్రాల కేసులో విధించిన దోషి దృఢీకరణను సుప్రీంకోర్టు సోమవారం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నేపథ్యంలోనే సెలవుల బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్య బాగ్చీతో కూడిన వెకేషన్ బెంచ్, కోకాటే దాఖలు చేసిన పిటిషన్‌పై మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Also Read: Telangana Temples: ఆలయంలో ఇదేం తంతు.. పూజలు, టోకెన్ అంటూ భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న వైనం..!
“ పిటిషనర్‌కు విధించిన దోషిదృఢీకరణను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం. అయితే, ఈ స్టే వల్ల శాసనసభ్యుడిగా అతడిపై ఎలాంటి అనర్హత వర్తించదు. కానీ ఎటువంటి లాభదాయక పదవులను మాత్రం చేపట్టకూడదు” అని బెంచ్ స్పష్టం చేసింది. ఫిబ్రవరిలో మేజిస్ట్రేట్ కోర్టు మాణిక్‌రావ్ కోకాటేకు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం చేసి ఫ్లాట్ల కేటాయింపులు పొందారని కోకాటే, అతని సోదరుడు కలిసి అక్రమాలకు పాల్పడ్డారని కోర్టు నిర్ధారించింది. ఈ తీర్పును గత వారం నాసిక్ సెషన్స్ కోర్టు కూడా సమర్థించింది.
దీంతో కోకాటే సుప్రీంకోర్టును ఆశ్రయించగా, తాజాగా అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన స్టే ఉత్తర్వులతో ఆయనకు ఊరట లభించింది. అయితే, కేసు తుది విచారణ వరకు రాజకీయంగా కొన్ని పరిమితులు కొనసాగనున్నాయి.
Also Read: Bhatti Vikramarka: బడ్జెట్ ప్రతిపాదనలు కోరిన ఆర్థిక శాఖ.. జనవరి 3లోగా రిపోర్ట్ పంపాలని కేంద్రం ఆదేశం

