Congress party( image CREDIT: SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

Congress party: మంత్రి వివేక్ ముందే ఇరువర్గాలు రచ్చ రచ్చ

Congress party: గజ్వేల్ కాంగ్రెస్‌లో వర్గపోరు మరోసారి బట్టబయలైంది. గజ్వేల్‌లో నిరుపేదలకు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక కాంగ్రెస్ పార్టీలోని నర్సారెడ్డి, శ్రీకాంతరావు వర్గాల మధ్య రచ్చ నెలకొన్నది. ఇరు వర్గాల మధ్య తోపులాటతో పాటు వ్యతిరేక అనుకూల నినాదాలతో సభా ప్రాంగణం రస బసగా మారింది. మంత్రి వివేక్ ఎదుటే ఇదంతా జరగడం గమనార్హం. కొత్తగా రేషన్ కార్డులు(New ration cards)మంజూరైన లబ్ధిదారులకు కార్డుల పంపిణీ కార్యక్రమాలను వర్గల్, గజ్వేల్,(Ghazwal)జగదేవ్‌పూర్, మర్కుక్, ములుగు మండల కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలకు మంత్రి వివేక్‌(Minister Vivek0తో పాటు మెదక్ ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కలెక్టర్ హైమావతి హాజరయ్యారు. వర్గల్ ప్రారంభ సభ తర్వాత గజ్వేల్‌(Gajwel)లో గందరగోళానికి దారి తీసింది.

Also Read: M Venkaiah Naidu: మన ఆర్థిక శక్తి ఏమిటో త్వరలోనే అగ్రరాజ్యాలకు తెలుస్తుంది

సభ స్థలి వద్ద ఉద్రిక్తత

శ్రీకాంత్ రావు వర్గానికి చెందిన గజ్వేల్ ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి(Mallareddy)వేదికపైకి వెళ్లగా నర్సారెడ్డిని పిలవకుండా మల్లారెడ్డి(Mallareddy) ఎలా వేదిక ఎక్కుతారని నర్సారెడ్డి వర్గం ఆందోళనకు దిగింది. ఈ క్రమంలో కార్యకర్తలు మల్లారెడ్డి(Mallareddy) వేదిక నుండి దించేందుకు వేదికపైకి దూసుకెళ్లే క్రమంలో తోపులాట చోటు చేసుకున్నది. పోలీసులు వారిని నిలువరించడానికి చాలా సేపు కష్టపడాల్సి వచ్చింది. నర్సారెడ్డిని స్టేజి పైకి పిలవాలని కార్యకర్తలు పెద్దపెట్టను నినాదాలు చేస్తూ ఆందోళన సృష్టించారు. వ్యతిరేకవర్గం కూడా ప్రతిఘటించే ప్రయత్నం చేయడంతో సభ స్థలి వద్ద ఉద్రిక్తత నెలకొన్నది.

ఆందోళన వ్యక్తం 

చివరకు మంత్రి వివేక్(Minister Vivek) కల్పించుకొని నర్సారెడ్డితో మాట్లాడారు. ఇది అధికార కార్యక్రమం కాబట్టి ప్రోటోకాల్ పాటించడం జరుగుతుందని పార్టీ కార్యక్రమాలు వేరే ఉంటాయని కార్యకర్తలకు వివరించి చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. కాగా, జగదేవ్‌పూర్ మండలంలో కూడా కొద్దిపాటి గొడవ చోటు చేసుకున్నది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సజావుగా నిర్వహించి ప్రజల మెప్పును పొందాలని భావిస్తున్న క్రమంలో భావిస్తున్న క్రమంలో గజ్వేల్ కాంగ్రెస్‌లో గొడవలు జరగడం పట్ల స్థానిక నాయకులు, కార్యకర్తలు పార్టీ అభిమానుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు గజ్వేల్‌లో ఇదేం గొడవ అని పార్టీ అధిష్టానం ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

 Also Read: Allu Aravind: ‘మహావతార్ నరసింహ’ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ చూడాలని కోరుకుంటున్నా!

Just In

01

Heavy Rains: కుండపోత వర్షంతో కనిపించని రహదారులు.. ఎక్కడంటే..?

Prithvi Shaw: లైంగిక వేధింపుల కేసులో.. క్రికెటర్ పృథ్వీషాకు.. రూ.100 జరిమానా

Vayuputra Animation Movie: పాన్ ఇండియా స్థాయిలో మరో యానిమేషన్ మూవీ.. నిర్మాత ఎవరంటే?

Maoist Party: మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా దేవ్ జీ?

Jishnu Dev Verma: జైళ్ల శాఖ సిబ్బంది కృషి శ్లాఘనీయం: గవర్నర్​ జిష్ణుదేవ్ వర్మ