Anil Ravipudi: ‘AI’ ని ఇలా పద్ధతిగా కూడా వాడుకోవచ్చు..
Anil Ravipudi AI Video (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Anil Ravipudi: ‘AI’ ని ఇలా పద్ధతిగా కూడా వాడుకోవచ్చు.. అనిల్ రావిపూడి పోస్ట్ వైరల్!

Anil Ravipudi: ఈ మధ్య విపరీతంగా పెరిగిపోయిన టెక్నాలజీ, ముఖ్యంగా ఏఐ వచ్చిన తర్వాత సోషల్ మీడియా అంతా, ఆ టూల్‌తో చేసిన వీడియోలే. ఇందులో కొన్ని మంచివి ఉంటే, మరికొన్ని మాత్రం కొందరినీ కించపరిచేలా ఉంటూ విమర్శలను ఎదుర్కొంటున్నాయి. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ, డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి, బాగా హర్ట్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మొదలుకుని, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్‌లతో పాటు మ్యాగ్జిమమ్ హీరోయిన్లు ఈ బారిన పడిన వారే. పెరుగుతున్న టెక్నాలజీని మంచికి ఉపయోగించుకుంటే.. ఆ టెక్నాలజీ మరింతగా అభివృద్ధి చెందుతుంది. కానీ, కొందరు చేసే ఆకతాయి పనుల వల్ల టెక్నాలజీని కూడా తిట్టిపోస్తున్నారు. ఇక ఈ ‘ఏఐ’ టెక్నాలజీని పద్ధతిగా వాడితే ఏమేం క్రియేట్ చేయవచ్చో.. చక్కని ఉదాహరణగా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నాయి.

Also Read- Bigg Boss Telugu 9: విన్నర్ ప్రైజ్ మనీ ఎంతంటే? తనూజ రాంగ్ డెసిషన్!

నేను చూస్తూ పెరిగిన మెగాస్టార్ నుంచి

అందులో అవతార్ వచ్చి మన సౌత్ హీరోలతో సెల్ఫీలు దిగుతున్నట్లుగా క్రియేట్ చేసిన వీడియో బాగా వైరల్ అవుతోంది. ఇప్పుడలాంటి వీడియోనే దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) పోస్ట్ చేసి, అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara VaraPrasad Garu) అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘అలా నేను చూస్తూ పెరిగిన మెగాస్టార్ నుంచి, ఇలా నేను డైరెక్ట్ చేసే మెగాస్టార్ వరకు’ అంటూ ‘ఏఐ’కి థ్యాంక్స్ చెబుతూ షేర్ చేసిన వీడియోలో.. సేమ్ టు సేమ్ అవతార్‌ మాదిరిగానే.. అనిల్ రావిపూడి కూడా వింటేజ్ మెగాస్టార్‌ని కలిసి సెల్ఫీలు తీసుకుంటున్నారు.

Also Read- Demon Pavan: డిమోన్ పవన్ రైట్ డెసిషన్.. సూట్‌కేస్ తీసుకోకుండా ఉంటేనా?

అనిల్ రావిపూడి షేర్ చేసిన వీడియోలో ఏముందంటే..

‘ఖైదీ’ చిరంజీవి, ‘గ్యాంగ్ లీడర్’ చిరంజీవి, ‘ఘరానా మొగుడు’ చిరంజీవి, ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ చిరంజీవి ప్లస్ శ్రీదేవిలతో, ‘ముఠామేస్త్రి’ చిరంజీవి, ‘అన్నయ్య’ చిరంజీవి, ‘ఇంద్ర’ చిరంజీవి, ‘శంకర్ దాదా MBBS’ చిరంజీవి, ‘ఠాగూర్’ చిరంజీవిలతో సెల్ఫీలు తీసుకుంటూ.. ఫైనల్‌గా తన సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ దగ్గరకు వచ్చి షూట్ చేస్తున్నారు. నిజంగా ఈ వీడియో మెగా అభిమానులందరికీ ఆనందాన్ని ఇచ్చేదిగా చెప్పుకోవచ్చు. ఇలాంటి టెక్నాలజీని పిచ్చి పిచ్చి వాటికి ఉపయోగిస్తూ.. కేసులు పెట్టించుకుంటున్నారు కానీ, నిజంగా అనిల్ రావిపూడి చేసిన ప్రయోగం పురాతన కాలం నాటి వాళ్లని కూడా మళ్లీ తీసుకొచ్చి వారిని నేటి తరానికి పరిచయం చేయవచ్చు. ఇప్పటికైనా ఈ ఏఐని మంచిగా వాడి, అలాంటి ప్రయత్నాలు చేస్తారని ఆశిద్ధాం. ఇక అనిల్ రావిపూడి చేసిన ఈ పోస్ట్ మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘మన శంకర వరప్రసాద్ గారు’ విషయానికి వస్తే.. ఈ సినిమా రాబోయే సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 12న విడుదల కాబోతోంది. రీసెంట్‌గానే రిలీజ్ డేట్‌ని అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన పాటలు ట్రెండ్ సెట్టర్స్‌గా నిలిచి, చార్ట్ బస్టర్ లిస్ట్‌లోకి చేరిన విషయం తెలిసిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Anil Ravipudi: ‘AI’ ని ఇలా పద్ధతిగా కూడా వాడుకోవచ్చు.. అనిల్ రావిపూడి పోస్ట్ వైరల్!

Kiara Advani: ‘టాక్సిక్‌’లో కియారా అద్వానీ.. రాకింగ్ ఫస్ట్ లుక్ చూశారా!

Bigg Boss Telugu 9: విన్నర్ ప్రైజ్ మనీ ఎంతంటే? తనూజ రాంగ్ డెసిషన్!

Congress Rebels: కాంగ్రెస్ రెబల్స్‌కు లబ్ డబ్.. క్షేత్రస్థాయిలో గందరగోళం!

Constable Incident: పోలీసుల ప్రాణాల మీదకు తెస్తున్న బెట్టింగ్ యాప్‌లు!