Demon Pavan: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో డిమోన్ పవన్ (Demon Pavan) జర్నీ ముగిసింది. హౌస్ నుంచి టాప్ 3 కంటెస్టెంట్‌గా డిమోన్ వెనుదిరిగాడు. టాప్ 5లో ముందుగా సంజన ఎగ్జిట్ అవ్వగా, ఆ తర్వాత ఇమ్మానుయేల్ ఎగ్జిట్ అయ్యాడు. ఇమ్మానుయేల్ విషయంలో ఊహించిందంతా తారుమారైంది. టాప్ 3గా నిలుస్తాడని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఇమ్మానుయేట్ టాప్ 4గా వెనుదిరగడంతో టాప్ 3గా కళ్యాణ్, తనూజ, పవన్ నిలిచారు. ఇక ఈ ముగ్గురిలో టాప్ 3గా వెనుదిరిగేది పవనే అని ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చింది. ఎప్పటిలానే టాప్‌లో ఒకరికి సూట్‌కేస్ ఆఫర్‌తో మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja)ను కింగ్ నాగార్జున (King Nagarjuna) హౌస్‌లోకి పంపించారు.
Also Read- Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. విన్నర్ కళ్యాణ్, రన్నర్ తనూజ
కళ్యాణ్, తనూజ నో.. పవన్ ఎస్
హౌస్‌లోకి వెళ్లిన రవితేజ.. ముగ్గురు హౌస్‌మేట్స్‌ని పిలిచి, తన దగ్గర ఉన్న సూట్‌కేస్‌లో రూ. 5 లక్షలు ఉన్నట్లుగా చెప్పారు. ఆ రూ. 5 లక్షలు తీసుకుని ముగ్గురిలో ఎవరైనా వెళ్లిపోతారా? అని అడిగారు. కానీ ముగ్గురు నో చెప్పేశారు. ఆ తర్వాత రవితేజ రూ. 7.5 లక్షలు ఆఫర్ ఇచ్చాడు. అయినా కూడా నో చెప్పారు. కింగ్ నాగ్ కల్పించుకుని రవితేజను నెక్ట్స్‌కు వెళ్లమన్నారు. వెంటనే రవితేజ రూ. 10 లక్షలు ఆఫర్ చేశారు. ఇక్కడే పవన్, తనూజ స్ట్రాంగ్‌గా ఉన్నారు కానీ, పవన్ మాత్రం కొంచెం టెంప్ట్ అయ్యాడు. వాళ్ల పేరేంట్స్‌ని అడుగుతానని అనుమతి తీసుకున్నాడు. వాళ్లు నీ ఇష్టం అని పవన్‌కు చెప్పారు. ఆ అమౌంట్‌కి వెళ్లలేనని పవన్ చెప్పేశాడు. వెంటనే రూ. 15 లక్షలు అని అనౌన్స్ చేయగానే కళ్యాణ్, తనూజ నో చెప్పారు. పవన్ ఎస్ చెప్పాడు. ఆ ఎస్ చెప్పిన తర్వాత అసలు కథ నడిచింది.
Also Read- Shambhala: నేచురల్ స్టార్ వదిలిన ‘శంబాల’ మిస్టికల్ ట్రైలర్.. ఎలా ఉందంటే?
పవన్ డెసిషన్‌పై ప్రశంసలు
రవితేజకు టాప్ 3లో ఎవరు ఎలిమినేట్ అయ్యేవారో చూపించమని చెప్పారు. రవితేజ మరో సూట్‌కేస్ ఓపెన్ చేసి చూపించగా, అందులో పవన్ ఎలిమినేటెడ్ అని ఉంది. దీంతో అందరూ క్లాప్స్ కొట్టారు. పవన్ డెసిషన్ కరెక్ట్ అయినందుకు రవితేజ కూడా అతన్ని అభినందించాడు. సిల్వర్ సూట్‌కేస్ తీసుకుని పవన్ మంచి పని చేశాడని, అంతా అనుకున్నారు. ఆయన అభిమానులు కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఒకవేళ తీసుకోకపోతే మాత్రం పవన్ చాలా కోల్పోయేవాడు. మంచి డెసిషన్ తీసుకుని కామనర్‌గా రూ. 15 లక్షలు తీసుకున్న పవన్ నిర్ణయాన్ని అంతా కొనియాడుతున్నారు. సరైన టైమ్‌లో మంచి నిర్ణయం తీసుకున్నందుకు అతన్ని అందరూ అభినందిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

