Bigg Boss Telugu 9: బిగ్ బాస్ 9 విన్నర్ కళ్యాణ్, రన్నర్ తనూజ
Bigg Boss Winner (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. విన్నర్ కళ్యాణ్, రన్నర్ తనూజ

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్‌ (Bigg Boss Telugu 9 Winner)గా కళ్యాణ్ పడాల (Kalyan Padala) నిలిచారు. టాప్ 5లో ఉన్న కళ్యాణ్, తనూజ, పవన్, ఇమ్మానుయేల్, సంజనలలో ఎవరు విన్ అవుతారనే విషయంపై ఇప్పటి వరకు ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. కొందరు కళ్యాణ్ విన్ అయ్యాడంటే, మరికొందరు తనూజ విన్ అయ్యింది అంటూ వార్తలు రాస్తూ వచ్చారు. ఇంకొందరు ఇమ్మానుయేల్ ఈ సీజన్ విన్నర్ అంటూ బిగ్ బాస్‌కు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చిన, కామెంట్లతో హోరెత్తిస్తూనే ఉన్నారు. ఫైనల్‌గా 105 రోజుల నిరీక్షణకు తెరపడింది. ఈ సీజన్‌కు కామనర్ కళ్యాణ్ పడాల విన్నర్‌గా గెలిచి, క్యాష్ ప్రైజ్‌ను, మారుతి సుజుకీ విక్టోరియా కారును సొంతం చేసుకున్నారు. దీంతో కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందాన్ని తెలియజేస్తూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇక రన్నర్ విషయానికి వస్తే..

Also Read- Bigg Boss Telugu 9: టెన్షన్ పెట్టిన బిగ్ బాస్.. టాప్ 5గా వెనుదిరిగిన సంజన..

అంచనాలన్నీ తారుమారు

విన్నర్‌గా మొదటి నుంచి కళ్యాణ్ పడాల పేరు వినిపిస్తూనే ఉంది. మొదటి ఫైనలిస్ట్‌గా కళ్యాణ్ నిలిచినప్పటి నుంచే కళ్యాణ్ పేరు విన్నర్ స్థానంలో నిలిచింది. కానీ రన్నర్ విషయంలోనే ఎవరనేది చెప్పడం కష్టంగా మారింది. ఎందుకంటే ఈ స్థానానికి ఇద్దరు పేర్లు బాగా వినిపించాయి. అందులో ఒకరు తనూజ అయితే, రెండో వ్యక్తి ఇమ్మానుయేల్. కానీ ఇక్కడే గేమ్ తారుమారైంది. టాప్ 4గా ఇమ్మానుయేల్ వెనుదిరిగాడు. ఇక టాప్ 3గా కళ్యాణ్, తనూజ, పవన్ నిలిచారు. ఇందులో డిమోన్ పవన్ రూ. 15 లక్షల సూట్‌కేస్ తీసుకుని టాప్ 3గా వెనుదిరిగారు. అనంతరం ఓటింగ్ ప్రకారం కళ్యాణ్ విన్నర్‌గా నిలవగా, తనూజ (Tanuja) రన్నర్‌గా నిలిచింది. ఇమ్మానుయేల్‌కు, ఆయన అభిమానులకు బిగ్ బాస్ షాకిచ్చాడనే చెప్పాలి.

Also Read- Godavari Water Dispute: ఆగని జల కుట్రలు.. కేంద్రంతో ఉన్న సత్సంబంధాలతో మరో భారీ కుట్రకు తెరలేపిన ఏపీ ప్రభుత్వం..?

టాప్ 4లో ఇమ్మానుయేల్ ఎగ్జిట్ (Emmanuel Bigg Boss Exit)

ఇమ్మానుయేట్ ఎగ్జిట్‌ను చాలా వెరైటీగా ప్లాన్ చేశారు. హౌస్‌లోకి ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju) హీరోహీరోయిన్లు అయినటువంటి నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty), మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary)లతో పాటు రోగ్ (రోబో)ని పంపించారు. టాప్ 4ను నవీన్ కొన్ని ప్రశ్నలు అడిగితే, ఆ ప్రశ్నలకు రోగ్ సమాధానమిచ్చింది. ఇక ఫైనల్‌గా టాప్ 4గా ఉన్నవారిని ఎగ్జిట్ చేసే బాధ్యతని కూడా రోగ్‌కే అప్పగించారు. ఇమ్మానుయేల్‌కు నమస్కరించి, తను ఎగ్జిట్ అయినట్లుగా రోగ్ సంజ్ఞ చేసింది. దీంతో ఇమ్మానుయేల్ జర్నీకి తెరపడింది. వాస్తవానికి ఇమ్ము విన్నర్ అని అంతా అనుకున్నారు. కానీ ఓటింగ్ పర్సంటేజ్ కళ్యాణ్‌కు, తనూజకు ఎక్కువగా ఉండటంతో.. ఇమ్ము టాప్ 4గా వెనుదిరగక తప్పలేదు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kiara Advani: ‘టాక్సిక్‌’లో కియారా అద్వానీ.. రాకింగ్ ఫస్ట్ లుక్ చూశారా!

Bigg Boss Telugu 9: విన్నర్ ప్రైజ్ మనీ ఎంతంటే? తనూజ రాంగ్ డెసిషన్!

Congress Rebels: కాంగ్రెస్ రెబల్స్‌కు లబ్ డబ్.. క్షేత్రస్థాయిలో గందరగోళం!

Constable Incident: పోలీసుల ప్రాణాల మీదకు తెస్తున్న బెట్టింగ్ యాప్‌లు!

Demon Pavan: డిమోన్ పవన్ రైట్ డెసిషన్.. సూట్‌కేస్ తీసుకోకుండా ఉంటేనా?