Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9)లో ఉన్న టాప్ 5 హౌస్‌మేట్స్‌లో నుంచి ఒకరు ఎలిమినేట్ అయ్యారు. ఈ ప్రాసెస్ చేయడానికి హీరో శ్రీకాంత్ (Srikanth)ని కింగ్ నాగార్జున ఇంటిలోకి పంపించారు. ఇంటిలోకి వెళ్లిన శ్రీకాంత్.. ఇంటిని చూసి ఆశ్చర్యపోయారు. కాసేపు టాప్ 5 కంటెస్టెంట్స్‌తో వారి గురించి ముచ్చటించి, వారు ఏమేం చేసేవాళ్లో చెప్పారు. బిగ్ బాస్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. ప్రతి రోజు బిగ్ బాస్ చూస్తానని తెలిపారు. వాస్తవానికి హౌస్‌లోకి వెళ్లి టాప్ 5ని టాప్ 4 చేయాల్సిన బాధ్యత ‘ఛాంపియన్’ (Champion) సినిమా ప్రమోషన్స్ నిమిత్తం వచ్చిన శ్రీకాంత్ తనయుడు రోషన్ (Roshan), హీరోయిన్ అనస్వర రాజన్‌కు నాగ్ అప్పగించారు. కానీ బిగ్ బాస్ అంటే ఎంతో ఇష్టపడే తన తండ్రి అయితే బెటర్ అని రోషన్ చెప్పడంతో.. శ్రీకాంత్‌ని పిలిచి, ఇంటిలో ఉన్న టాప్ 5ని టాప్ 4 చేసే బాధ్యతను ఆయనకు నాగ్ అప్పగించారు.
Also Read- Shambhala: నేచురల్ స్టార్ వదిలిన ‘శంబాల’ మిస్టికల్ ట్రైలర్.. ఎలా ఉందంటే?
సంజన ఔట్..
అయితే బిగ్ బాస్ సీజన్‌ను మొదటి నుంచి చూస్తున్న శ్రీకాంత్ మాత్రం టాప్ 5లో ఎవరినీ ఎలిమినేట్ చేయడానికి ఇష్టపడలేదు. బిగ్ బాస్ ఇచ్చిన షర్ట్స్ వేసుకున్న కంటెస్టెంట్స్ వెనుక అందరినీ సేఫ్ అని రాసి, తన వల్ల కాదని చెప్పేశారు. అయితే, ఆ ప్రాసెస్ వేరే విధంగా బిగ్ బాస్ ప్లాన్ చేశారు. గార్డెన్ ఏరియాలోకి వచ్చిన టాప్ 5 కంటెస్టెంట్స్‌లో నుంచి ఒకరిని తీసుకెళ్లడానికి ఒక గ్రూపు వచ్చి అందరికీ కటౌట్స్ పెట్టి, అందులో నుంచి సంజన కటౌట్‌ను తీసుకెళ్లారు. వెంటనే సంజన ఎలిమినేట్ అయినట్లుగా నాగార్జున ప్రకటించారు. సంజనను తీసుకుని స్టేజ్‌పైకి రావాలని శ్రీకాంత్‌కు సూచించారు. హౌస్‌లో ఉన్న వాళ్లందరికీ సెండాఫ్ ఇచ్చేసి సంజన, శ్రీకాంత్‌తో కలిసి స్టేజ్‌పైకి వచ్చింది. దీంతో మొదటి నుంచి అనుకున్నట్లుగానే టాప్ 5 కంటెస్టెంట్‌గా సంజన వెనుదిరిగింది.
Also Read- Demon Pavan Bigg Boss: రూ. 15 లక్షలతో వెనుదిరిగిన డిమాన్ పవన్!
ప్రౌడ్‌గా ఉందన్న సంజన
స్టేజ్‌పైకి వచ్చిన సంజన (Sanjjanaa).. ఇన్ని వారాలు ఉంటానని అస్సలు అనుకోలేదని చెప్పారు. ఇన్ని వారాలు ఉండి, టాప్ 5గా వెనుదిరిగినందుకు చాలా ప్రౌడ్‌గా ఉందని ఆమె తెలిపారు. నాగ్ నుంచి బ్లెస్సింగ్స్ తీసుకుని ఆమె ఎలిమినేటైన కంటెస్టెంట్స్‌లో కుర్చున్నారు. అనంతరం ‘బీబీ జోడి’ టీమ్ స్టేజ్‌పై సందడి చేసింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

