Demon Pavan Bigg Boss: కామనర్‌గా హౌస్‌లోకి అడుగు పెట్టిన డిమాన్ పవన్ (Demon Pavan) రూ. 15 లక్షలతో వెనుదిరిగినట్లుగా తెలుస్తోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే (Bigg Boss Telugu Season 9 Grand Finale) అట్టహాసంగా ప్లాన్ చేశారు. ఇప్పటికే వచ్చిన కొన్ని లీక్స్ ప్రకారం కళ్యాణ్‌కు భారీ ఓటింగ్ పడిందని, అతనే ఈ సీజన్ విన్నర్ అనేలా టాక్ నడుస్తుంది. అలాగే టాప్ 5 నుంచి సంజన మొదట ఎలిమినేట్ అయినట్లుగా సమాచారం. ఇక హౌస్‌లో ఉన్న టాప్ 4లో డిమాన్ పవన్ రూ. 15 లక్షలు తీసుకుని టాప్ 4గా వెనుదిరిగినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి కళ్యాణ్ (Kalyan Padala) తర్వాత డిమాన్ పవన్ ఈ రేసులో ఉండాల్సింది. కానీ, చివరిలో రీతూ బాండింగ్ బాగా దెబ్బకొట్టింది. దీంతో అతను బాగా వెనుకబడిపోయారు. అప్పటి నుంచి డిమాన్ ఓటింగ్ కూడా ఏం పెరగలేదు. కళ్యాణ్ మాత్రం ప్రతి వారం ఓటింగ్‌లో టాప్‌లోనే ఉంటూ వచ్చారు. కళ్యాణ్ తర్వాత ప్లేస్‌లో తనూజ ఉన్నట్లుగా తెలుస్తోంది.
Also Read- Bigg Boss Grand Finale: ఈసారి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే మాములుగా ఉండదు.. ప్రోమో వచ్చేసింది!
టాప్ 3 ఎవరంటే..
సంజన, డిమాన్ అనంతరం టాప్ 3 ప్లేస్‌లో కళ్యాణ్, తనూజ (Tanuja), ఇమ్మానుయేల్ (Emmanuel Bigg Boss) ఉన్నారు. ఈ ముగ్గురిలో విన్నర్ అయ్యే ఛాన్స్ కళ్యాణ్‌కే ఉందనేలా ఎప్పటి నుంచో టాక్ నడుస్తుంది. ఓటింగ్ పర్సంటేజ్ కూడా కళ్యాణ్‌కే ఎక్కువగా ఉన్నట్లుగా ఇప్పటికే లీక్స్ వచ్చేశాయి కాబట్టి.. విన్నర్ ఓకే.. మరి రన్నర్ ఎవరు? తనూజనా? లేక ఇమ్మానుయేలా? వీరిద్దరిలో రన్నర్ ఎవరు? రన్నర్ ఏం గెలుచుకున్నారనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ గ్యాప్‌లో డిమాన్ రూ. 15 లక్షలకు ఓకే చెప్పాడంటే.. నిజంగా అతనిది తెలివైన నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే, విన్నర్ తను కాలేడని ఇప్పటికే తనకో క్లారిటీ ఉంది. అందుకే రూ. 15 లక్షల ఆఫర్‌ని అతను వదులుకోలేదు. డిమాన్ రూ. 15 లక్షలు తీసుకుంటే.. ఇక విన్నర్‌కు కేవలం రూ. 35 లక్షలు మాత్రమే ఉంటాయి. ఇందులో టాప్ 2, 3లు ఎవరైనా టెంప్ట్ అయితే మాత్రం.. విన్నర్‌కు వచ్చే ప్రైజ్‌మనీ ఇంకా తగ్గిపోయే అవకాశం లేకపోలేదు. చూద్దాం.. అఫీషియల్ అప్డేట్స్ కాసేపట్లో..
Also Read- Brahmani Birthday: హీరో నిఖిల్‌తో కలిసి సరదాగా క్రికెట్ ఆడిన నారా బ్రాహ్మణి
ఇప్పటికే వచ్చిన ప్రోమో గమనిస్తే..
బిగ్ బాస్ సీజన్ 9 వచ్చేసి కంట్రీలోనే నెంబర్ వన్ ప్లేస్‌లో ఉన్నట్లుగా కింగ్ నాగార్జున (King Nagarjuna) ప్రకటించారు. అలాగే ఇంట్లో ఉన్న వారిలో ఎవరికి థ్యాంక్యూ చెప్పాలని అనుకుంటున్నావో.. వారికి బ్రెస్‌లెట్ వేసేసి థ్యాంక్యూ చెప్పమని నాగ్ హౌస్‌మేట్స్‌ని కోరగా.. కళ్యాణ్ వచ్చేసి తనూజకు థ్యాంక్యూ చెప్పాడు. పవన్ కూడా తనూజకే థ్యాంక్యూ చెప్పాడు. రీతూకి పవన్ సారీ చెప్పాడు. తర్వాత హౌస్‌లోకి శ్రీకాంత్ ఎంట్రీతో కాసేపు నవ్వులు పూయించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

