Odisha Feviquick Incident: గత కొద్దీ రోజుల నుంచి క్రైమ్ న్యూస్ లు ఎక్కువగా వినపడుతున్నాయి. అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా ఎవరికీ తెలీడం లేదు. తాజాగా జరిగిన ఘటన అందర్ని కన్నీరు పెట్టిస్తుంది. అసలే జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: SPDCL CMD Orders: జీరో ఫిర్యాదులే లక్ష్యంగా పని చేయాలి.. ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశం
నిద్రపోయిన విద్యార్థుల కళ్లలో ఫెవిక్విక్ పోసిన క్లాస్ మేట్స్
ఒడిశాలోని కంధమాల్ జిల్లా, ఫిరింగియా బ్లాక్‌లోని సలాగూడ గ్రామంలోని సేవాశ్రమ పాఠశాల హాస్టల్‌లో జరిగిన సంఘటన మొత్తం ప్రాంతాన్ని కలకలం రేపింది. గురువారం రాత్రి భోజనం ముగించి గాఢ నిద్రలో ఉన్న ఎనిమిది మంది విద్యార్థుల కళ్ళపై కొందరు ఆగంతకులు ఫెవిక్విక్ పూసి ఏం తెలియనట్టు వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం మేల్కొన్న విద్యార్థులు కళ్ళు తెరవలేక భయంతో అరుస్తూ, హాస్టల్‌ను గందరగోళానికి గురిచేశారు. ఈ ఘటన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, పర్యవేక్షణ లోపాలను తెలియజేస్తునాయి. తల్లిదండ్రుల్లో ఆగ్రహాన్ని, అధికారుల్లో ఆందోళనలను రేకెత్తించింది. హాస్టల్‌లోని ఈ విషాదకర గురువారం రాత్రి జరిగినట్టు చెబుతున్నారు.
బాలురు నిద్రపోతున్నప్పుడు, కొందరు తోటి విద్యార్థులు వారి కనురెప్పలకు ఫెవిక్విక్ పోసేశారని ఆరోపణలు వచ్చాయి. ఉదయం మేల్కొని కళ్ళు తెరవలేకపోవడంతో వారు అరుస్తూ భయపడ్డారు. ఈ అరుపులు విని ఇతర విద్యార్థులు, సిబ్బంది మేల్కొని అలారం మోగించారు. అక్కడికి చేరుకున్న ఉపాధ్యాయురాలు ప్రేమలత సాహు ఘటనను తెలుసుకుని, ఎనిమిది మంది బాలుర్ను ఆటోరిక్షాల్లో గోచపాడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అక్కడ వైద్యులు కళ్ళపై పూసిన పదార్థాన్ని గుర్తించి, యాంటీ-సెప్టిక్ , గోరువెచ్చని నీటితో కడిగి చికిత్స ఇచ్చారు. చికిత్సలో భాగంగా, స్థానిక సర్పంచ్ రోహిత్ కన్హార్ ఆసుపత్రికి చేరుకుని, ఏడుగురు బాలుర్ను ఫుల్బానీలోని జిల్లా హెడ్‌క్వార్టర్స్ హాస్పిటల్ (DHH)కి మార్చారు. మిగిలిన ఒకరు స్థానిక సెంటర్‌లోనే చికిత్స పొందారు. వైద్యుల చెప్పిన సమాచారం ప్రకారం, బాధితుల పరిస్థితి ఇప్పుడు మెరుగ్గా ఉందని వెల్లడించారు.