Bigg Boss 9 Telugu ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Bigg Boss 9 Telugu: ఫస్ట్ వీక్ ఎలిమినేషన్.. వైరల్ అవుతున్న నాగార్జున, శ్రష్ఠి వీడియో.. ఎలిమినేట్ చేశారా లేక బయటకు రప్పిస్తున్నారా?

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 జోరుగా సాగుతోంది. లాంచ్ ఎపిసోడ్ నుంచి నామినేషన్స్, కెప్టెన్సీ టాస్క్, మొదటి కెప్టెన్, ఇప్పుడు ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ వరకూ.. అన్ని చకా చకా జరిగిపోయాయి. అయినా, ఆడియన్స్‌కి థ్రిల్, ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. మొదటి వారం నామినేషన్స్‌లో స్టార్ కంటెస్టెంట్స్ ఉండటంతో, “ఎవరు బయటకు వెళ్తారు?” అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.

Also Read: Shankarpally Robbery Case: శంకర్‌పల్లి దారి దోపిడీ కేసు.. సంచలన విషయలు వెలుగులోకి? ఏం నటించాడు భయ్యా!

ఈ వారం నామినేషన్స్‌లో శ్రష్ఠి వర్మ, ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి, సంజనా గల్రానీ, తనూజా గౌడ, సుమన్ శెట్టి, రాము రాథోడ్, డీమన్ పవన్, ఇమ్మానుయేల్ ఉన్నారు. ఫస్ట్ వీక్ లో సుమన్ శెట్టి యాక్టీవ్ గా లేకపోయినా మొదటి రోజు నుంచే ఓటింగ్ లో మాత్రం మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాత సంజన, తనూజ, ఇమ్మానుయేల్ ఉన్నారు. సంజన ఆటతీరు చూసి చాలా మంది ఆమెనే ఎలిమినేట్ అవుతుందని ఊహించారు. కానీ, ఎవరూ ఉహించని విధంగా కెప్టెన్‌ అయింది. ఇక చివరగా ఫ్లోరా షైనీ, శ్రష్ఠి వర్మ మిగిలారు.

Also Read: Bigg Boss 9 Telugu: ఫస్ట్ వీక్ ఎలిమినేషన్.. వైరల్ అవుతున్న నాగార్జున, శ్రష్ఠి వీడియో.. ఎలిమినేట్ చేశారా లేక బయటకు రప్పిస్తున్నారా?

మనం నార్మల్ గా ఆలోచిస్తే ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అంటే .. శ్రష్ఠి వర్మ అని చెప్పేస్తాము. కానీ, ఎవరూ ఊహించని విధంగా ఫ్లోరా షైనీ సేఫ్ అయ్యి, శ్రష్ఠి వర్మ బయటకు వచ్చేందుకు రెడీ అయింది. ఇది నిజంగా అందరికీ షాకింగ్ లాగే ఉంది. ఎందుకంటే, శ్రష్ఠి వర్మకి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఆమె కొన్ని వారాలు ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ, బిగ్ బాస్ ఇలా ట్విస్ట్ ఇస్తాడని అనుకోలేదు. సీజన్ 9 మొదటి ఎలిమినేటెడ్ కంటెస్టెంట్‌గా శ్రష్ఠి వర్మ ఉంది.

Also Read: Renu Agarwal Murder Case: రేణు అగర్వాల్ హత్య కేసులో.. క్యాబ్ డ్రైవర్​ ఇచ్చిన సమాచారంతో వీడిన మిస్టరీ.. కారణాలు ఇవే?

వైరల్ అవుతున్న నాగార్జున, శ్రష్ఠి వీడియో..

శ్రష్ఠి వర్మ హౌస్ లోకి వెళ్లే ముందు నాగార్జున బిగ్ బాస్ స్టేజ్ మీద నువ్వు తొందరగా బయటకు వస్తే .. నేను కూడా ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేపించుకుంటా అని అన్నాడు. అప్పుడు శ్రష్ఠి వర్మ అది నేను కూడా చెబుదాం అనుకున్నా సార్.. అంటే నువ్వు తొందరగా బయటకు వస్తావా ఏంటి అని నాగ్ అన్నాడు. అది ముందు చెప్తే బాగుటుంది కదా అని శ్రష్ఠి మాట్లాడిన మాటలు ట్రోల్స్ చేస్తూ కావాలనే ఆమెను బయటకు రప్పిస్తున్నారంటూ నెటిజన్స్ అనుకుంటున్నారు.

Just In

01

Porter Layoffs 2025: పోర్టర్‌లో భారీ ఉద్యోగ కోతలు.. ఖర్చు తగ్గింపు పేరుతో 300 మందికి పైగా ఉద్యోగులకు షాక్

Jubliee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో ఎన్నడూ గెలవలేదు.. బీజేపీకి ఛాన్స్ ఇవ్వండి.. ఓటర్లకు కిషన్ రెడ్డి రిక్వెస్ట్

Heroes rejected hits: ఆ సినిమాలను వారు రిజక్ట్ చేయకుంటే స్టార్లు అయిపోయేవారు.. ఎవరంటే?

Memory Improvement: ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంచే అద్భుతమైన హెల్త్ టిప్స్

Hydraa: నాటి నిందలే నేటి ఫలితాలు.. హైడ్రాకు జనం నీరాజనాలు