SPDCL CMD Orders: అసిస్టెంట్ ఇంజినీర్లు జీరో ఫిర్యాదులే లక్ష్యంగా పని చేయాలని, కనీసం వారానికి రెండుసార్లు తమ పరిధిలోని బస్తీల్లో, కాలనీల్లో విద్యుత్ నెట్ వర్క్ ను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అలాగే వినియోగదారులను నేరుగా కలవడం వల్ల సమస్యలు తెలుస్తాయని, మరోసారి ఇబ్బందులు రాకుండా చూడొచ్చని ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశించారు. మింట్ కాపాండ్ లోని ప్రధాన కార్యాలయంలో రంగారెడ్డి, మేడ్చల్ జోన్ లో వివిధ విభాగాలకు చెందిన దాదాపు 180 మంది అసిస్టెంట్ ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు.
Also Read: Bhatti Vikramarka: వేలంలో పాల్గొనక పోవడంతో రూ.60 వేల కోట్ల నష్టం: భట్టి విక్రమార్క
ఇంజినీర్లతో నేరుగా సీఎండీ మాట్లాడి పలు సూచనలు
సెక్షన్ల వారీగా ఎక్కువ ఫిర్యాదులు నమోదవుతున్న అసిస్టెంట్ ఇంజినీర్లతో నేరుగా సీఎండీ మాట్లాడి పలు సూచనలు చేశారు. ఫిర్యాదులకు గల కారణాలను విశ్లేషించి మరోసారి అలాంటి ఫిర్యాదులు రాకుండా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. విద్యుత్ ఉద్యోగులు వినియోగదారులతో నేరుగా కలుస్తూ స్నేహభావంతో మెలగాలని, వారికీ ఎలాంటి సమస్య ఎదురైనా, అది ఏ సమయమైనా సరే దృష్టికి తీసుకువచ్చే వాతావరణాన్ని క్షేత్ర స్థాయిలో కల్పించాలని సీఎండీ తెలిపారు. ఇరుకైన గల్లీలు, మురికివాడల్లో ప్రమాదకరంగా ఉన్న ఓవర్ హెడ్ లైన్ల స్థానంలో ఎయిర్ బంచ్డ్ కేబుళ్లు ఏర్పాటు చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టంచేశారు. దీనికి సంబంధించి పరిపాలనపర అనుమతులను సంస్థ సులభతరం చేసిందని సీఎండీ వారికి వివరించారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు నరసింహులు, శివాజీ, చక్రపాణి, ఇతర అధికారులు వేణు గోపాల్, సురేశ్ పాల్గొన్నారు.
Also Read: Bigg Boss Buzzz: బిగ్ బాస్ బటర్ ఫ్లై ఎఫెక్ట్.. ఈసారి శివాజీ రచ్చ రచ్చే!