Bigg Boss Buzzz: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇటీవలే గ్రాండ్‌గా మొదలైన విషయం తెలిసిందే. ఈ సీజన్ ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచడానికి బిగ్ బాస్ నిర్వాహకులు డబుల్ హౌస్‌లు అనే కొత్త కాన్సెప్ట్‌తో ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఈ షో బాగానే ఆదరణను రాబట్టుకుంటోంది. అయితే ఈ షోలో గత సీజన్ కంటెస్టెంట్ శివాజీ కూడా భాగం కాబోతున్నారు. అదెలా అనుకుంటున్నారా? తాజాగా బిగ్ బాస్ టీమ్ ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో శివాజీ ఏం చేయబోతున్నారో క్లారిటీ ఇచ్చారు.
Also Read- Disha Patani: ఇంటి ముందు కాల్పులు.. షాక్‌లో దిశా పటానీ.. విషయం ఏమిటంటే?
బిగ్ బాస్ బజ్ హోస్ట్‌గా శివాజీ
ఈసారి బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌ని బిగ్ బాస్ బజ్ కార్యక్రమం ద్వారా నటుడు శివాజీ ఇంటర్వ్యూ చేయనున్నారు. గత సీజన్లలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌ని బిగ్ బాస్ బజ్‌లో కొందరు కంటెస్టెంట్స్ ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ స్థానంలో శివాజీ రానున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన చేస్తూ.. ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో శివాజీ హావభావాలు, మాట్లాడే తీరు అన్నీ కూడా మరో బిగ్ బాస్‌ని తలపిస్తున్నాయి. ఈసారి ఎలిమినేట్ అయిన పర్సన్‌తో వెంటనే ఇంటర్వ్యూ ఉంటుందని, స్టార్ మాలో అది ప్రసారం అవుతుందని ఈ వీడియోలో శివాజీ చెబుతున్నారు. అంతేకాదు, అసలు హౌస్‌లో ఏం జరుగుతుంది? ఎందుకు ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది? వంటి అన్నీ విషయాలను డిస్కస్ చేయబోతున్నట్లుగా శివాజీ చెబుతూ.. ఈ కాన్సెప్ట్‌కు బిగ్ బాస్ బటర్ ఫ్లై ఎఫెక్ట్ అనే ట్యాగ్ తగిలించారు. అంతేనా, తనని తానొక ఓజీగా కూడా ప్రకటించుకున్నారు.
Also Read- Ritu Varma: తత్వం బోధపడినట్లుంది.. గ్లామర్ ట్రీట్‌కు రెడీ అంటూ హింట్ ఇచ్చేసిందిగా!
ఫ్యాన్స్ వెయిటింగ్
ఈ న్యూస్ అధికారికంగా బయటికి వచ్చినప్పటి నుంచి శివాజీ అభిమానులతో పాటు, బిగ్ బాస్ ప్రేక్షకులు కూడా ఈ కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్‌లో శివాజీ ప్రయాణం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ ఇమేజ్ ఈ బిగ్ బాస్ బజ్ కార్యక్రమానికి ప్లస్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. శివాజీ బిగ్ బాస్ బజ్‌లో ఏం మాట్లాడతారు? ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? అనేది చూడాలి.. అంటూ నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఈ కార్యక్రమం ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో కూడా వేచి చూడాల్సి ఉంది. శివాజీ ఎంట్రీ ఇవ్వాలంటే, హౌస్‌లో ఎలిమినేషన్ జరగాలి. ఈ శని, ఆదివారాల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఎవరు మొదటిగా శివాజీ ముందు కూర్చుని చర్చలు జరుపుతారు? అసలు ఈ వారం ఎలిమినేషన్ ఉంటుందా? మొదటి వీక్ కాబట్టి బిగ్ బాస్ ఏమైనా ట్విస్ట్ ఇస్తాడా? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.
When the Bigg Boss Butterfly Effect hits, no one is safe! 🦋👀 Catch the eliminated contestant’s truths in the #BiggBossBuzzz Exit Interview with #Sivaji 💥
Watch #BiggBossBuzzz Every Sunday at 10:30PM only on #StarMaa #StarMaaPromo pic.twitter.com/YSVfXQDaaL
— Starmaa (@StarMaa) September 12, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు