Disha Patani
ఎంటర్‌టైన్మెంట్

Disha Patani: ఇంటి ముందు కాల్పులు.. షాక్‌లో దిశా పటానీ.. విషయం ఏమిటంటే?

Disha Patani: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో నటి దిశా పటానీ (Disha Patani) ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటన సెప్టెంబర్ 12, 2025 తెల్లవారుజామున సుమారు 4:30 గంటల సమయంలో జరిగింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. అదృష్టవశాత్తూ, ఈ సంఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఈ సంఘటనతో దిశా పటాన్నీ షాక్‌కు గురైనట్లుగా తెలుస్తోంది.

కాల్పులకు కారణం:

ఈ కాల్పుల ఘటనకు కారణం హిందూ సాధువులైన ప్రేమానంద్ జీ మహారాజ్, అనిరుద్ధాచార్య జీ మహారాజ్‌లను అవమానించడం అని మీడియాలో వార్తలు వస్తున్నాయి. దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ ఇటీవల ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా చేసిన కామెంట్స్ (Khushboo Patani Controversy) కారణమని తెలుస్తోంది. ఆమె మాజీ ఆర్మీ ఆఫీసర్ అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఫిట్‌నెస్ ట్రైనర్‌గా వర్క్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ ఘటనకు తామే బాధ్యత వహిస్తున్నామని, గోల్డీ బ్రార్ గ్యాంగ్‌కు చెందిన వీరేంద్ర చరణ్, మహేంద్ర శరణ్ అనే వ్యక్తులు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ద్వారా తెలిపారు.

Also Read- Bhupalpally Heavy Rains: భూపాలపల్లి జిల్లాలో పిడుగుపాడుకతో 100కు పైగా గొర్రెలు మృతి.. ఎన్ని లక్షల నష్టమంటే..?

పోలీసుల దర్యాప్తు:

ఈ ఘటనపై దిశా పటానీ తండ్రి జగదీష్ పటానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్‌ల ప్రామాణికతను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. దిశా పటానీ ఇంటికి, ఆ ప్రాంతానికి భద్రతను పెంచారు. ఆమె ఇల్లు కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌపాలా చౌరహా సమీపంలో ఉంది.

Also Read- Pawan Kalyan: కళలు లేని సమాజంలో హింస ప్రబలే అవకాశం ఉంది.. పవన్ సంచలన నిర్ణయం

చిత్ర పరిశ్రమకు హెచ్చరిక:

సోషల్ మీడియా పోస్ట్‌లో, ఈ కాల్పులు కేవలం ‘ట్రైలర్’ మాత్రమే అని, భవిష్యత్తులో మతం, సాధువులను అవమానించే ఏ సినిమా నటులకైనా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సందేశం కేవలం దిశా పటానీకి మాత్రమే కాకుండా, మొత్తం సినీ పరిశ్రమకు వర్తిస్తుందని పేర్కొన్నారు. దిశా పటానీ విషయానికి వస్తే.. ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్ ఇమేజ్‌తో దూసుకెళుతోంది. తెలుగులో ఆమె వరుణ్ తేజ్ సరసన ‘లోఫర్’ చిత్రంతో పాటు రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ‘కల్కి 2898 AD’ చిత్రంలో నటించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Manchu Manoj: ‘మిరాయ్’ సక్సెస్‌తో మా అమ్మ గర్వపడుతోంది.. వీడియో వైరల్!

Bigg Boss Buzzz: బిగ్ బాస్ బటర్ ఫ్లై ఎఫెక్ట్.. ఈసారి శివాజీ రచ్చ రచ్చే!

GHMC: మానవత్వం లేదా? కమిషనర్ స్పందించినా, డిప్యూటీ కమిషనర్ స్పందించరా?

CM Revanth Reddy: 21న సిటీలో సీఎం టూర్.. పలు అభివృద్ది పనులు ప్రారంభం!

Disha Patani: ఇంటి ముందు కాల్పులు.. షాక్‌లో దిశా పటానీ.. విషయం ఏమిటంటే?