Pawan Kalyan
ఎంటర్‌టైన్మెంట్

Pawan Kalyan: కళలు లేని సమాజంలో హింస ప్రబలే అవకాశం ఉంది.. పవన్ సంచలన నిర్ణయం

Pawan Kalyan: తెలుగు సినిమా స్థాయి ఇప్పుడు గ్లోబల్ రేంజ్‌కు చేరిందని అన్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan). ఢిల్లీ పర్యటనలో భాగంగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD) కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వంటి కేంద్రాన్ని ఏపీలోనూ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా మీడియా సమక్షంలో ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. తెలుగు సినిమా ఇప్పుడు గ్లోబల్ స్థాయికి చేరింది. ఢిల్లీలోని ఎన్ఎస్‌డీ క్యాంపస్‌ను చూస్తుంటే నాకు మరో మినీ ఇండియాను చూసినట్టుగా ఉంది. నాకు నటనలో శిక్షణ ఇచ్చిన గురువు సత్యానంద్ ఎప్పుడూ ఎన్ఎస్‌డీ గురించి చెబుతుండేవారు. కళలు లేని సమాజంలో హింస ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే, కళా రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో.. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎన్ఎస్‌డీ క్యాంపస్ ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చిస్తాను. యువ కళాకారులకు శిక్షణ ఇచ్చేందుకు, వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి సంస్థలు ఎంతగానో దోహదపడతాయని చెప్పుకొచ్చారు. ఆయన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కేంద్రాన్ని సందర్శిస్తోన్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నూతన ఉపరాష్ట్రపతి CP రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం రాత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు.

Also Read- Ritu Varma: తత్వం బోధపడినట్లుంది.. గ్లామర్ ట్రీట్‌కు రెడీ అంటూ హింట్ ఇచ్చేసిందిగా!

‘ఓజీ’గా ప్రేక్షకుల ముందుకు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ (OG Movie) చిత్రం సెప్టెంబర్ 25న విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ‘సాహో’ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలు ఉన్నాయి. ఎవరి నోట విన్నా.. ‘ఓజీ’ అనే మాటే వినబడుతోంది. అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో వేచి చూస్తున్నారు. ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. మేకర్స్ ఇప్పటి వరకు అరకొరగానే ప్రమోషన్స్ నిర్వహించారు. అయినా కూడా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు కూడా ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారంటే.. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నయో అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంకా మోహన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఓవర్సీస్‌లో రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా.. విడుదల తర్వాత సరికొత్త రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Also Read- Mirai songs: ‘మిరాయ్’ ఫైనల్ ఎడిటింగ్‌లో సాంగ్స్ అవుట్.. తీసేసింది అందుకేనా?

‘ఓజీ’ వెంటనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’

జూలైలో ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) గా వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సెప్టెంబర్‌లో ‘ఓజీ’గా రాబోతున్నారు. ‘ఓజీ’ విడుదలైన రెండు నెలలకే మరో సినిమాను ఆయన లైన్‌లో పెడుతున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) చిత్రాన్ని డిసెంబర్ మొదటి వారంలో లేదంటే మూడవ వారంలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ‘ఓజీ’కి పోటీగా విడుదల కావాల్సిన ‘అఖండ 2’ (Akhanda 2) చిత్రం డిసెంబర్ మొదటి వారంలో వస్తే మాత్రం.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కచ్చితంగా మూడో వారంలో పడుతుందనేలా టాక్ నడుస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Sushila Karki: నేపాల్‌కు తాత్కాలిక ప్రధాని ఎంపిక పూర్తి!.. ప్రమాణస్వీకారానికి సర్వంసిద్ధం

Revanth Reddy: గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి… అధికారులకు సీఎం ఆదేశం

Dasoju Sravan: గ్రూప్1 పరీక్షను తిరిగి నిర్వహించాలి.. ఎమ్మెల్సీ కీలక వ్యాఖ్యలు

Plane Loses Wheel: విమానం టేకాఫ్ సమయంలో ఊడిన చక్రం.. గమ్యస్థానం చేరుకున్నాక..

Bhupalpally Heavy Rains: భూపాలపల్లి జిల్లాలో పిడుగుపాడుకతో 100కు పైగా గొర్రెలు మృతి.. ఎన్ని లక్షల నష్టమంటే..?