Bhupalpally Heavy Rains ( image CREDIT: SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

Bhupalpally Heavy Rains: భూపాలపల్లి జిల్లాలో పిడుగుపాడుకతో 100కు పైగా గొర్రెలు మృతి.. ఎన్ని లక్షల నష్టమంటే..?

Bhupalpally Heavy Rains:  జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా  రాత్రి వర్షం దంచి కొట్టింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. ఎగువన కురిసిన వర్షంతో మానేరు సహా జిల్లా వ్యాప్తంగా ఉన్న వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. కాళేశ్వరం వద్ద వరద ఉధృతి క్రమంగా పెరుగుతూ గోదావరి ప్రవాహం పెరుగుతుంది. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి మరింత వరద పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,95,410 క్యూసెక్ లు ఉండగా పూర్తిస్థాయిలో 85 గేట్లు ఓపెన్ చేసి అధికారులు నీటిని దిగువకు వదిలారు. వరద ప్రవాహం పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తం అయ్యి లోతట్టు, గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు. వరద ఉదృతితిలో పలు చోట్ల పంటలకు నష్టం వాటిల్లింది.

 Also Read: Raghava Lawrence: అప్పుడు కష్టపడిన డబ్బుతో కొన్న ఇంటిని.. లారెన్స్ ఏం చేశాడో తెలుసా?

పిడుగు పేరుతో 100 గొర్రెలు మృతి

మహదేవపూర్ మండలం అంబటిపెళ్లి గ్రామానికి చెందిన రైతులు గొర్రెల మేతకోసం తీసుకెళ్లిన సమయంలో పిడుగుపడి 100 కు పైగా గొర్రెలు మృతి చెందాయి. అంబటిపల్లి గ్రామానికీ చెందిన 6 రైతులు కాట్రేవుల కత్తెరశాలకు చెందిన 21 గొర్రెలు, కాట్రేవుల కళ్యాణ్ చెందిన 17 గొర్రెలు, కాట్రేవుల ఆదిరెడ్డి కి చెందిన 20 గొర్రెలు, కాట్రేవుల మల్లేష్ చేసిన 10 గొర్రెలు, కాట్రేవుల పున్నంచెందర్ కు చెందిన 15 గొర్రెలు, (Bhupalpally Heavy Rains) కాట్రేవుల శ్రీశైలం కు చెందిన 11 గొర్రెలతో కలుపుకుని 100పైగా గొర్రెలు మృతి చెందాయి. గొర్రెలు చనిపోవడంతో తమ బతుకుకు వీధిన పడినట్టు అయ్యిందని బాధితులు విలపిస్తున్నారు.

వాగులో వరద నీటిలో ఇరుక్కు పోయిన ట్రాక్టర్లు, డ్రైవర్లు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళపల్లి-ఓడేడు మానేరు వాగులో ఇసుక కోసం వెళ్లిన ట్రాక్టర్లు అకస్మాత్తుగా వరద ఉధృతి పెరగడంతో వరద ప్రవాహంలో చిక్కుకున్నాయి. వాగులో నీటి మట్టం ఒక్కసారిగా పెరగడంతో ట్రాక్టర్లు ఇరుక్కుపోయి కదలలేని స్థితిలో నిలిచిపోయాయి. ట్రాక్టర్ల పై నలుగురు డ్రైవర్లు ఇరుక్కుపోయి కాపాడండి అంటూ అర్ధనారాలు చేశారు. ఇసుక కోసం వెళ్ళి ప్రమాదంలో పడ్డ డ్రైవర్లను పోలీసులు గ్రామస్తుల సహకారంతో కాపాడారు.

 Also Read: GHMC: దశాబ్దాలుగా సీట్లకు అతుక్కుపోయిన అధికారులు.. ఎక్కడంటే..?

Just In

01

Kishkindhapuri: ‘ఓజీ’ వచ్చే వరకు.. ‘కిష్కింధపురి’ రెస్పాన్స్‌పై టీమ్ రియాక్షన్ ఇదే!

HCA Scam: జగన్మోహన్​ రావు టైంలో హెచ్​సీఏ ఎన్నో అక్రమాలు.. తెలిస్తే షాక్?

Sushila Karki: నేపాల్‌కు తాత్కాలిక ప్రధాని ఎంపిక పూర్తి!.. ప్రమాణస్వీకారానికి సర్వంసిద్ధం

Revanth Reddy: గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి… అధికారులకు సీఎం ఆదేశం

Dasoju Sravan: గ్రూప్1 పరీక్షను తిరిగి నిర్వహించాలి.. ఎమ్మెల్సీ కీలక వ్యాఖ్యలు