GHMC (imagecredit:twitter)
హైదరాబాద్

GHMC: దశాబ్దాలుగా సీట్లకు అతుక్కుపోయిన అధికారులు.. ఎక్కడంటే..?

GHMC: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీ(GHMC)లోని కీలక విభాగాలైన ట్రాన్స్ పోర్టు(Transport), (Tax Sections), ట్యాక్స్ సెక్షన్లలోని ఆఫీసర్లు, ఉద్యోగులకు బదిలీల్లేకపోవటంతో ఏళ్లుగా ఒకే చోట తిష్ట వేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా శేరిలింగంపల్లి(Serilingampally) లోని ట్యాక్స్ విభాగంలోని ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు, ట్రాన్స్ పోర్టులోని ఫోర్ మెన్ లు ఒక్కోక్కరు ఏకంగా 20 ఏళ్ల నుంచి ఒకే సీటులో కొనసాగుతున్నట్లు సమాచారం. వీరిలో కొందరు ఎప్పటికపుడు ఉన్నతాధికారులను మేనేజ్ చేసుకుని బదిలీల నుంచి తప్పించుకుంటుండగా, మరి కొందరు యూనియన్ల పేర్లు చెప్పి, ఇంకొందరు ఏకంగా రాజకీయ వత్తిళ్లు తెస్తూ తమ సీట్లకు ఢోకా లేకుండా చూసుకుంటూ పలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. శేరిలింగంపల్లి జోన్ లోని కొందరు ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు ఏకంగా 20 ఏళ్ల నుంచి అక్కడే తిష్టే వేసి, పలు అక్రమాలకు పాల్పడుతూనే ఉన్నట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అయిదు నెలల క్రితమే

ముఖ్యంగా ప్రస్తుతం జీహెచ్ఎంసీ(GHMC)లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా గ్రేటర్ లోని మొత్తం 30 సర్కిళ్ల ప్రతి నెల ఖచ్చితంగా రూ. వంద కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్(Property tax) టార్గెట్ ను అధిగమించాల్సిందేనని ఖచ్చితమైన ఆదేశాలున్నా, జీహెచ్ఎంసీలో లాంగ్ స్టాండింగ్ గా విధులు నిర్వహిస్తున్న కొందరు ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు యూనియన్ కార్యకలాపాలంటూ కలెక్షన్ విధులకు హాజరుకావటం లేదని తెలిసింది. గడిచిన రెండు నెలలుగా వీరు చేసిన ట్యాక్స్ కలెక్షన్ ను సమీక్షిస్తే వారి పనితీరు బయట పడుతుందని ట్యాక్స్ విభాగానికి చెందిన కొందరు ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు(Tax inspectors), బిల్ కలెక్టర్లలే(bill collectors) బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. అయిదు నెలల క్రితమే కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ ఇప్పటి వరకు డిప్యూటీ కమిషనర్లు, పలు బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లకు బదిలీలు కల్పించటంతో పాటు అదనపు కమిషనర్ల సంఖ్యను బాగా కుదిస్తూ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెల్సిందే.

Also Read; Bunny Vas: ‘లిటిల్ హార్ట్స్’కు వచ్చే ప్రతి రూపాయి నాకు కోటి రూపాయలతో సమానం!

లాంగ్ స్టాండింగ్ ల డేటా సేకరణ

అన్ని విభాగాల్లో లాంగ్ స్టాండింగ్ గా ఒకే చోట విధులు నిర్వహిస్తున్న అధికారులను కూడా గుర్తించి, వారి డేటా సేకరించాలని విభాగాధిపతులకు కమిషనర్ ఆదేశించినట్లు సమాచారం. ముఖ్యంగా నిత్యం పలు ఆరోపణలను ఎదుర్కొంటున్న ట్రాన్స్ పోర్టు విభాగంలో కొందరు ఫోర్ మెన్లు ఏకంగా 20, 25 ఏళ్ల నుంచి ఒకే చోట విధులు నిర్వహిస్తున్నట్లు, మరి కొందరు ఎలాంటి బదిలీల్లేకుండా నియామకం జరిగిన చోటే ఇంకా కొనసాగుతున్నట్లు కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అలాంటి వారి వివరాలను కూడా ఉన్నతాధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితి మలక్ పేట(malakpet), అంబర్ పేట(Amberprt) సర్కిళ్లలోని హెల్త్ సెక్షన్ లో కూడా నెలకున్నట్లు సమాచారం. ఈ రెండు సర్కిళ్లలో నియామకం జరిగిన నాటి నుంచి ఎలాంటి బదిలీల్లేకుండా విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు రిటైర్డు మెంట్ కూడా అక్కడే అవుతామని చెప్పుకోవం బల్దియాలో పాలనకు అద్దం పడుతుంది.

కలెక్షన్ కు ప్రైవేటు ఏజెంట్లు

జీహెచ్ఎంసీ(GHMC)లోని 30 సర్కిళ్లలో సుమారు 300 పై చిలుకు ప్రాపర్టీ ట్యాక్స్ డాకెట్లున్నాయి. వీటి ద్వారా ట్యాక్స్ కలెక్షన్ చేసేందుకు గ్రేటర్ వ్యాప్తంగా 145 మంది ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు, మరో 320 మంది బిల్ కలెక్టర్లున్నారు. అయితే ప్రాపర్టీ ట్యాక్స్ అనేది జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరు అని, వసూళ్ల బాధ్యతలను ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లే చేపట్టాలని గత కమిషనర్ లోకేశ్ కుమార్ లిఖితపూర్వకమైన ఆదేశాలు జారీ చేసినా, అవి ఎక్కడా కూడా అమలు కావటం లేదన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా కొందరు ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు ట్యాక్స్ కలెక్షన్ కోసం ప్రైవేటుగా ఏజెంట్లను నియమించుకుంటున్నారంటూ అప్పటి కమిషనర్ లోకేశ్ కుమార్ కు ఫిర్యాదులు అందటంతో ఆయన ఆదేశాలు జారీ చేసినా, వాటిని ఖచ్చితంగా అమలు చేయటంతో ట్యాక్స్ సెక్షన్ విఫలమవుతుంది. ఒక్కో కలెక్షన్ ఏజెంట్ కు నెలకు రూ.30 వేల జీతం చెల్లిస్తూ, ఓ బైక్ ను కూడా ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు సమకూరుస్తూ బల్దియా ఖజానాకు రావాల్సిన ట్యాక్స్ నిధులను కొల్లగొడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: Konda Surekha: ఈ నెల 15న కామారెడ్డిలో భారీ బీసీ బ‌హిరంగ స‌భ!

Just In

01

Lawyers Fight: హైకోర్టులో షాకింగ్ ఘటన.. జడ్జి ముందే గొడవ పడ్డ లాయర్లు.. వీడియో వైరల్

Offers On iPhone: ఐఫోన్14పై భారీ డిస్కౌంట్.. ఎప్పటినుంచంటే?

Hyderabad Crime: కూకట్ పల్లి కేసులో కీలక అప్డేట్స్.. రంగంలోకి ప్రత్యేక బృందాలు

Raghava Lawrence: అప్పుడు కష్టపడిన డబ్బుతో కొన్న ఇంటిని.. లారెన్స్ ఏం చేశాడో తెలుసా?

Girls on Married Men: పెళ్లైన మగాళ్లపై అమ్మాయిలు ఎందుకు మోజు పడుతున్నారు? దాని వెనుకున్న కారణాలివే!