Harish Rao: రేవంత్ పాలనలో పల్లెలకు అవార్డులు అభివృద్ధి బంద్!
Harish Rao (imagecredit:swetcha)
Uncategorized

Harish Rao: రేవంత్ పాలనలో పల్లెలకు అవార్డులు అభివృద్ధి బంద్!: హరీష్ రావు

Harish Rao: గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండలం మల్కాపూర్, కోనైపల్లి, నర్సంపల్లి గ్రామాల్లో గెలిచిన సర్పంచులు, అలాగే అచ్చంపేట నియోజకవర్గం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత మండలం వంగూరులో 10 గ్రామ పంచాయతీల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ సర్పంచులు ఈరోజు హైదరాబాద్ లో మాజీ మంత్రి హరీష్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.​ముఖ్యమంత్రి సొంత గడ్డపై కాంగ్రెస్ ప్రలోభాలను తట్టుకొని నిలబడిన వంగూరు సర్పంచులను, అలాగే గజ్వేల్ సర్పంచులను హరీష్ రావు గారు ప్రత్యేకంగా అభినందించి, శాలువాలతో సత్కరించారు.

కేసీఆర్ నాయకత్వంలో

ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ… స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దిమ్మతిరిగే ఫలితాలు వచ్చాయి. ప్రజల తీర్పు చూసి కాంగ్రెస్ నాయకులకు షాక్ తగిలింది. మొదటి దఫా ఫలితాలు చూసి షాక్ అయ్యారు..రెండో దఫా ఫలితాలు చూసి మైండ్ బ్లాక్ అయ్యింది. ఇక ఈ రాత్రి వచ్చే మూడో దశ ఫలితాలు కూడా కాంగ్రెస్ పార్టీనీ నిరాశపరచక తప్పదు. ఈ ఓటమి భయంతోనే ఇప్పుడు డబ్బు సంచులు పట్టుకొని హైదరాబాద్ నుండి బయలుదేరారు. పోలీసులను అడ్డుపెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. కేసీఆర్ నాయకత్వంలో తూప్రాన్ మండలమే కాదు రాష్ట్రం మొత్తం అద్భుతంగా అభివృద్ధి చెందింది. తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. నాడు ఢిల్లీలో అవార్డులు ఇస్తే తెలంగాణ పల్లెల పేర్లు లేకుండా జాబితా ఉండేది కాదు. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో తెలంగాణకు ఒక్క అవార్డు కూడా రాలేదు. పల్లెలు అపరిశుభ్రంగా మారాయి. కనీసం కేసీఆర్ గారు కొనిచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ పోసే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదు.

Also Read: BJP Telangana: సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ హవా.. స్టేట్ వైడ్‌గా గతం కంటే పెరిగిన స్థానాలు!

కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి

ఆనాడు కేసీఆర్ ప్రతి నెలా పల్లెలకు నిధులు విడుదల చేసేవారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వ నిధులు, కేంద్ర ప్రభుత్వ నిధులు బంద్ అయ్యాయి. పల్లె ప్రకృతి వనాలు, డంపు యార్డ్లు అన్నీ మూలకు పడ్డాయి. అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు కాబట్టే.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పారు. కాంగ్రెస్ నాయకులను నేను హెచ్చరిస్తున్నా.. మా కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదు. దాడులు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. బీఆర్ఎస్ లో గెలిచిన వారిని బలవంతంగా పార్టీలో చేర్చుకోవాలని చూసినా కుదరదు.. ఎందుకంటే బీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమకారులని గుర్తుంచుకోండి. వారు మీ బెదిరింపులకు లొంగరు. దేశం వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా వెళ్తోంది. బహుశా మరో ఆరు నెలల్లోనో ఏడాదిలోనో ఎన్నికలు రావచ్చు. రెండేళ్లలో కచ్చితంగా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. గెలిచిన సర్పంచులంతా ధైర్యంగా ఉండండి. మళ్ళీ గ్రామాలకు మంచి రోజులు వస్తాయి. అభివృద్ధి పథంలో మన గ్రామాలన్నీ ప్రయాణిస్తాయి.

Also Read: Defection MLAs: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు.. సంచలన నిర్ణయం తీసుకున్న స్పీకర్

Just In

01

Jinn Movie: ‘జిన్’ అలా ఇలా భయపెట్టడు.. థియేటర్లలో ఒక్కొక్కరికి! నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు

Purushaha: కన్నీళ్లతో చంపేస్తా.. పవన్ కళ్యాణ్ ‘పురుష:’ నుంచి హీరోయిన్ లుక్ విడుదల

Shocking Crime: అమెరికాలో తండ్రిని చంపిన భారత సంతతి యువకుడు.. ఇదే అసలైన ట్విస్ట్!

Harish Rao: రేవంత్ పాలనలో పల్లెలకు అవార్డులు అభివృద్ధి బంద్!: హరీష్ రావు

Jogipet News: మంజీరకు ఇరువైపులా ఫిఫ్త్‌ ఫ్యూచర్‌ సిటీ నిర్మించాలని.. కేంద్ర మంత్రులకు వినతి..!