Hydraa: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో హైడ్రా పై ప్రశంల వర్షం
Hydraa (imagecredit:swetcha)
Uncategorized

Hydraa: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో హైడ్రా పై ప్రశంల వర్షం

Hydraa: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్‌లో వివిధ ప్రభుత్వ విభాగాలతో కలిసి ఏర్పాటు చేసిన హైడ్రా(Hydraa) స్టాల్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్‌ఎఫ్) అందించిన సేవలు, వరద ముప్పు నివారణకు తీసుకున్న చర్యలు ప్రతినిధుల మన్ననలు పొందుతున్నాయి. సమ్మిట్‌కు హాజరైన సందర్శకులు రాత్రి, పగలు అనే తేడా లేకుండా వర్షం పడిన సమయంలో డీఆర్‌ఎఫ్ చేసిన సేవలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. వరదలకు గల కారణాలు, సమస్య తలెత్తకుండా తీసుకున్న చర్యలకు సంబంధించిన వీడియోలను వారు ఎంతో ఆసక్తిగా పరిశీలించారు. వాతావరణంలో గణనీయ మార్పుల కారణంగా క్లౌడ్‌బరస్ట్‌లు ఏర్పడి ఒకే రోజు 15 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం పడిన సందర్భాలు గతంలో దేశంలోని అనేక పట్టణాలను అతలాకుతలం చేశాయి. అయితే, హైడ్రా తీసుకున్న సమర్థవంతమైన చర్యల ఫలితంగా ఈ ఏడాది మంచి ఫలితాలు వచ్చాయి. వరదలు ముంచెత్తడానికి గల కారణాలను తెలుసుకుని సరైన చారిత్రక చర్యలు చేపట్టడంతో, హైదరాబాద్‌ను వరద ముప్పు లేని నగరంగా హైడ్రా తీర్చిదిద్దిందని అధికారులు తెలిపారు.

Also Read: Telangana Holidays 2026: ఆదివారం వచ్చిన మూడు పెద్ద పండుగలు.. 2026 సెలవుల లిస్ట్ ఇదిగో

లక్షలాది మందికి ఉపశమనం

తొలి ఏడాదిలోనే హైడ్రా మంచి ఫలితాలను సాధించింది. భారీ వర్షాలు పడినా నగరంలో ఎక్కడా వరద ముప్పు లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. ముంపునకు కారణమయ్యే పూడుకుపోయిన నాలాల్లో మట్టిని తీయడం, ఆక్రమణలను తొలగించి నాలాలను విస్తరించడం వంటి చర్యలు చేపట్టారు. దీంతో అమీర్‌పేట, సికింద్రాబాద్ ప్యాట్నీ ప్రాంతాల్లో లక్షలాది మందికి ముంపు సమస్యను తప్పించింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాధ్ స్టాల్‌ను సందర్శించి ప్రతినిధులతో చర్చించారు. సమస్యల పరిష్కారంలో నిపుణుల సలహాలను స్వీకరించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం ఎంత భద్రమో వివరిస్తూ రూపొందించిన డీఆర్‌ఎఫ్ టీమ్‌ల పని తీరు వీడియో ప్రదర్శన గ్లోబల్ సమ్మిట్‌కు వచ్చిన వారిని విశేషంగా ఆకట్టుకుంది. చెరువులు, నాలాల పరిరక్షణ, పునరుద్ధరణ, పార్కులు కబ్జా కాకుండా చూడటం వంటి హైడ్రా కార్యకలాపాలు చక్కటి పర్యావరణానికి, మెరుగైన జీవనం సాగించడానికి దోహదపడతాయని ప్రతినిధులు ప్రశంసించారు.

Also Read: IAS Amrapali: హైకోర్టులో ఐఏఎస్​ అధికారిణి ఆమ్రపాలికి చుక్కెదురు..?

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు