IAS Amrapali: ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి(Amrapali)కి హైకోర్టులో చుక్కెదురైంది. ఆమెను తెలంగాణ(Telangana) కేడర్‌కు కేటాయిస్తూ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (Central Administrative Tribunal) ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. అక్టోబర్ నెలలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్(AP) కేడర్‌కు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో అక్కడకు వెళ్లిన ఆమె ఛార్జ్ తీసుకుని తరువాత సెలవుపై వెళ్లిపోయారు. అదే సమయంలో డీవోపీటీ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ క్యాట్‌లో పిటిషన్ వేశారు.
పిటిషన్ దాఖలు
దీనిపై విచారణ జరిపిన క్యాట్ ఆమెను తిరిగి తెలంగాణ కేడర్‌కు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ క్రమంలో మార్పిడి పద్దతి ద్వారా హరి కిరణ్(Hari Kiran)ను ఆంధ్రప్రదేశ్‌కు పంపించి ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయించారు. దీనిపై డీవోపీటీ హైకోర్టు(Hugh Cort)లో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. ఐఏఎస్ అధికారుల కేటాయింపు నిబంధనల ప్రకారం ఆమ్రపాలికి మార్పిడి పద్దతి వర్తించదని పిటిషన్లో పేర్కొంది. ఐఏఎస్ హరి కిరణ్ రిజర్వ్ కేటగిరీకి చెందిన అధికారి అని, ఓపెన్ కేటగిరీకి చెందిన ఆమ్రపాలిని ఆయనతో మార్పిడి పద్దతి ప్రకారం కేడర్ మార్చడం నిబంధనలకు విరుద్ధమని తెలిపింది.
ఉత్తర్వులు జారీ
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆరు వారాలపాటు వాయిదా వేసింది. అప్పటివరకు క్యాట్ ఉత్తర్వులు అమల్లో ఉండవని, వాటిపై స్టే కొనసాగుతుందని పేర్కొంది. దాంతోపాటు కౌంటర్ దాఖలు చేయాలని ఆమ్రపాలి తరఫు న్యాయవాదికి ఆదేశాలు జారీ చేసింది.
Also Read: Suicide Crime: దారుణం.. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతానేమో అన్న భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య

