TG Women Empowerment: రెండేళ్లలో 2,25,110 మహిళా సంఘాలు
TG Women Empowerment (imagecredit:twitter)
Telangana News

TG Women Empowerment: రాష్ట్రంలో రెండేళ్లలో 2,25,110 మహిళా సంఘాలు ఏర్పాటు.. ఇదిగో పూర్తి సమాచారం

TG Women Empowerment: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో మహిళా సాధికారత, స్వావలంబనకు దేశంలోనే ఆదర్శవంతమైన కార్యక్రమాలు అమలు చేసింది. కొత్తగా 2,25,110 సంఘాలను ఏర్పాటు చేసింది. ఆ సంఘాలు రూ.4,825.54 కోట్ల వ్యాపారాలను ప్రారంభించాయి. తెలంగాణ మహిళల సమగ్ర వికాసమే ధ్యేయంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.26 వేల కోట్ల రుణాలను పంపిణీ చేసింది. రాష్ట్రంలో 22 జిల్లాల్లో జిల్లా సమాఖ్యలకు ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది.

దేశంలోనే తొలిసారి

మహిళా సంఘాల ద్వారా దేశంలోనే తొలిసారిగా సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 32 జిల్లాల్లో 64 మెగా మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేపట్టిన రెండు రోజుల్లోనే మహాలక్ష్మీ పేరుతో మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ పథకం ప్రారంభించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మహిళలు రూ.7,600 కోట్లు ఆదా చేసుకున్నారు. రోజుకు దాదాపు 30 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో జీరో టికెట్లపై ప్రయాణిస్తున్నారు. రెండో ప్రాధాన్యతగా ఇంటి ఆడబిడ్డలకు ఖర్చు తగ్గించే ఉద్దేశ్యంతో సబ్సిడీపై ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలెండర్‌ను ప్రభుత్వం అందిస్తున్నది. ఫలితంగా దాదాపు 45 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. ఇందిరా మహిళా శక్తి స్కీమ్ ద్వారా స్వయంకృషితో ఎదిగే మహిళలకు రుణాలు అందించడం ద్వారా స్వయం సహాయక గ్రూపులు ఆర్థికంగా తమ కాళ్ల మీద తామే నిలబడేలా సర్కారు సహకారం అందిస్తున్నది.

Also Read: Indigo Disruptions: ఇప్పటివరకు రూ.610 కోట్లు రిఫండ్.. ఇండిగో కీలక ప్రకటన.. మెరుగుపడుతున్న సర్వీసులు

ఆర్టీసీకి అద్దె బస్సులు

మునుపెన్నడూ లేని విధంగా నేడు తెలంగాణ మహిళలు సొంతగా ఆర్టీసీకే బస్సులను అద్దె కివ్వడంతో పాటు, తామే పెట్రోల్ బంకులను కూడా నడిపే స్థాయికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహించింది. ఇందిరా జీవిత బీమా పథకం, ఇందిరా రుణ బీమా పథకం, శిల్పారామం వద్ద డ్వాక్రా మహిళా బజార్ ఏర్పాటు, ఇందిరా మహిళా డెయిరీ ప్రాజెక్టు, ఇలా సంఘాలకు సహకరిస్తూ మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నది. మహిళల భద్రత కోసం టీ సేఫ్ లాంటి సౌకర్యాలను ఈ రెండేళ్లలో ప్రజలు, ముఖ్యంగా మహిళలు నమ్ముకున్న ప్రభుత్వం తెచ్చింది. పాఠశాలల నిర్వహణ, నిర్మాణ పనులను అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలకు అప్పగించింది. ఈ కమిటీలకు రూ.554 కోట్ల విలువైన పనులు అప్పగించింది. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద మత్స్యశాఖ ద్వారా 32 జిల్లాల్లో మొబైల్ ఫిష్ అవుట్ లెట్లను ప్రారంభించింది. రూ. 10 లక్షల విలువైన వాహనాలను 60 శాతం సబ్సిడీతో అందజేసింది. ప్రమాదానికి గురైన స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు చెందిన కుటుంబాలకు రూ.10 లక్షల ప్రమాద బీమాను అందించింది. కొన్ని కుటుంబాలకు రూ.2 లక్షల రుణబీమాను చెల్లించింది. పారిశ్రామికవేత్తలతో పోటీపడేలా మహిళలు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం మహిళా సంఘాలతో పెట్రోలు బంక్‌లను ఏర్పాటు చేయించింది. నారాయణపేట, సంగారెడ్డిలో జిల్లా సమాఖ్యలు పెట్రోలు బంక్‌లు నిర్వహించి లాభాల బాటలో నడుస్తున్నాయి.

ప్రజా ప్రభుత్వ సంకల్పం

తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి మిషన్‌ 2025 పాలసీని అమల్లోకి తెచ్చింది. గ్రామీణ, పట్టణ మహిళలు, యువతులను ఒకే గొడుగు కిందకు తెచ్చి వారికి ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించాలనే లక్ష్యంతో వినూత్న నిర్ణయాలు తీసుకున్నది. మెప్మా, సెర్ప్‌ విలీన ప్రక్రియ చేపట్టిన తర్వాత కొత్త సభ్యులతో మహిళా సంఘాల సభ్యుల సంఖ్య కోటికి చేరాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకున్నది. కోటి మంది మహిళలు రూ.లక్ష కోట్ల రుణాన్ని పొందినప్పుడు నిజమైన మహిళా సాధికారత సిద్ధిస్తుందని సంకల్పించింది. సెక్రెటేరియట్​‌తో పాటు జిల్లా కలెక్టరేట్లు, ప్రభుత్వ ఆఫీసులు, కోర్టులు, కాలేజీలు, హాస్పిటళ్లు, ఆలయాలు, టూరిస్టు ప్రాంతాలు, న్యాయస్థానాలు, కళాశాలలు, ఆసుపత్రులు, దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల్లో 214 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని ఐటీ హబ్‌ మాదాపూర్‌లో మహిళా శక్తి బజార్‌ను ఏర్పాటు చేయించింది. రూ.9 కోట్లతో 106 దుకాణాల సముదాయాన్ని నిర్మించి, సంఘాలకు కేటాయించింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్‌ కుట్టే పనులను ప్రభుత్వం ఈ సంఘాలకు అప్పగించింది. కుట్టు కూలీ ఛార్జీలతో రూ.30 కోట్ల ఆదాయం సంఘాలకు సమకూరింది. మహిళా సమాఖ్యల వద్ద ఉన్న రూ.54 కోట్లతో 600 బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలే 17 జిల్లాల్లో సమాఖ్యల అధ్వర్యంలో 151 బస్సులను కొన్నారు. ఆర్టీసీకి అద్దెకు ఇవ్వడంతో మహిళా సంఘాలు బస్సులకు ఓనర్లయ్యారు. ఆర్థిక సాధికారత కోసం మరో 449 బస్సులు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Also Read: OTT Releases: ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే (డిసెంబర్ 08 నుండి డిసెంబర్14, 2025)

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు